Mallikarjun Kharge (imagecredit:swetcha)
Politics

Mallikarjun Kharge: కార్యకర్తల వర్కింగ్ స్టైల్ బాగుంది.. మల్లికార్జున ఖర్గే

Mallikarjun Kharge: తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన సూపర్ గా ఉన్నదని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే(AICC chief Mallikarjun Kharge) కితాబిచ్చారు. ఆయన టీపీసీసీ(TPCC) విస్తృత స్థాయి మీటింగ్ లో మాట్లాడుతూ ప్రభుత్వంలో తమ పార్టీ ఉన్నదనే భరోసాతో కార్యకర్తలు కూడా అద్భుతంగా పనిచేస్తున్నారన్నారు. రాబోయో రోజుల్లో మరింత పటిష్టంగా పనిచేయాలన్నారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని పీఎం చేసే వరకు విశ్రమించవద్దని నొక్కి చెప్పారు. తెలంగాణలో మేనిఫెస్టో అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ కృషి అభినందనీయమన్నారు. హామీలను అమలు చేసే ఏకైక పార్టీగా కాంగ్రెస్(Congress) చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రజల సంక్షేమం, డెవలప్ ఏజెండగానే పరిపాలన ఉండాలని ఏఐసీసీ చీఫ్​ఖర్గే సూచించారు.

ఇక తనకు కొందరి నేతలపై ఫిర్యాదు అందాయని, ప్రధానంగా సమన్వయం, ప్రోటోకాల్స్ అంశాలే ఉన్నట్లు ఖర్గే వివరించారు. నేతలంతా సమన్వయంతో పనిచేస్తేనే వచ్చిన అధికారం సంపూర్ణంగా నిలుస్తుందన్నారు. ఆయా నేతలపై ఇప్పటికే ఎంక్వైయిరీ జరుగుతుందని, పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే ఏ స్థాయి నేతలకైనా చర్య లు తప్పవని ఖర్గే హెచ్చరించారు.

Also Read: Phone Tapping: షాద్‌ నగర్‌ చుట్టూ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం!

11 ఏళ్ల ఎమర్జెన్సీ గురించి మాట్లాడండి
మరోవైపు 50 ఏళ్ల క్రితం జరిగిన ఎమర్జెన్సీ గురించి మాట్లాడే బీజేపీ నేతలు తమ11 ఏళ్ల పాలనలోని ఎమర్జెన్సీ పరిస్థితులు గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఖర్గే నిలదీశారు. పదేళ్ల పాటు ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేశారన్నారు. రాజ్యాంగా(Constitutional)న్ని కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితులను బీజేపీ(BJP) తీసుకువస్తుందన్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేశారు. ఇక పార్టీ అందరికీ ఇచ్చిన పదవులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే సమర్ధులకు పదవులు ఇవ్వాల్సిందిగా టీపీసీసీ చీఫ్​కు సూచిస్తున్నానని వెల్లడించారు.

అగ్నిప్రమాదంపై ఆరా?
సంగారెడ్డి(Sanga Reddy) జిల్లాలోని పాశమైలారం పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఆరా తీశారు. ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతులు, బాధితులు, క్షతగాత్రులను వెంటనే ప్రభుత్వం నుంచి ఆదుకోవాలని సూచించారు. అంతేగాక ఆ సంస్థను కూడా బాధ్యత చేస్తూ నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆదేశించారు. ఇక పీసీసీ(TPCC) విస్తృత స్థాయి సమావేశానికి ముందు పాశమైలారం పరిశ్రమ ఘటనలో మరణించిన వాళ్ల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, నిమిషం పాటు నేతలంతా మౌనం పాటించారు.

Also Read: HC on Group 1: గ్రూప్-1 పిటిషన్లపై.. హైకోర్టులో విచారణ వాయిదా!

 

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?