HC on Group 1( IMAGE CREDIT: TWITTER)
తెలంగాణ

HC on Group 1: గ్రూప్-1 పిటిషన్లపై.. హైకోర్టులో విచారణ వాయిదా!

HC on Group 1: గ్రూప్​ 1 పిటిషన్లపై విచారణను నేటికి వాయిదా వేస్తూ హైకోర్టు (High Court) నిర్ణయం తీసుకుంది. గ్రూప్​ 1 ( group 1) పరీక్షలు రాసిన తెలుగు మీడియం విద్యార్థులకు సరైన మార్కులు వేయలేదంటూ పలువురు అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిగిన సందర్భంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్​ తరపున సీనియర్ అడ్వకేట్ నిరంజన్​ రెడ్డి (Advocate Niranjan Reddy) వాదనలు వినిపించారు. పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్యలో ఎలాంటి తేడాలు లేవని చెప్పారు. నామినల్ రోల్స్, అభ్యర్థుల వేలిముద్రల ఆధారంగా ఈ వివరాలు వెల్లడిస్తున్నట్టు తెలిపారు.

 Also Read: Formula E Race Case: వాట్సాప్ మెసేజ్‌తోనే 45 కోట్ల చెల్లింపు? అరవింద్ కుమార్ షాకింగ్ వాంగ్మూలం!

కోఠిలోని ఓ పరీక్షా కేంద్రంలో ఎగ్జామ్​ రాసిన వారే ఎక్కువ మంది ఎంపికయ్యారన్న దాంట్లో వాస్తవం లేదని చెప్పారు. మిగితా పరీక్షా కేంద్రాల్లో రాసిన వాళ్లలో అంతకంటే ఎక్కువ మంది ఎంపికైనట్టు తెలిపారు. కోఠిలోని రెండు కేంద్రాలను మహిళా అభ్యర్థులకు మాత్రమే కేటాయించినట్టు చెప్పారు. ఉద్యోగాలకు ఎంపిక కాలేకపోయిన అభ్యర్థులు అనుమానాలతో పిటిషన్లు వేశారన్నారు. వాళ్లు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు (High Court) ఎవాల్యుయేటర్లకు ఏవైనా మార్గదర్శకాలు ఉన్నాయా అని ప్రశ్నించింది. దీనికి సంబంధించిన వివరాలను బోర్డు నుంచి తీసుకుని సీల్డ్ కవర్‌లో సమర్పిస్తానని నిరంజన్ రెడ్డి చెప్పడంతో విచారణను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

 Also Read: Rayachoti Terrorists: రాయచోటి ఉగ్ర కేసు.. 30 బాంబులతో.. 3 నగరాల్లో పేలుళ్లకు కుట్ర!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు