NSUI Protest at College (imagecredit:swetcha)
రంగారెడ్డి

NSUI Protest at College: నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఉద్రిక్తత

NSUI Protest at College: మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి మైసమ్మ గూడ లోని నర్సింహా రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ యూఐ(NSUI) విద్యార్థి నాయకులు ధర్నా చేపట్టారు. పరీక్షలు రాసేందుకు అటెండెంట్స్ లేదని సాకులు చెప్తూ విద్యార్థుల దగ్గర నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ, కలశాల ముందు ఆందోళనకు దిగారు. విద్యార్థుల వద్ద అధిక వసూలు చేయడమే కాక, పలు కారణాలు చెప్పి డబ్బులు దండుకుంటున్న యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ క్రమంలో ఎన్ ఎస్ యు(NSUI) నాయకులు కళాశాల అద్దాలు పూల కుండీలు ధ్వంసం చేశారు. విద్యార్థుల భవిష్యత్తులతో ఆడుకుంటున్న నర్సింహ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల(Narasimha Reddy Engineering College) పై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రెచ్చగొట్టడం వల్లనే దాడి ఘటన

కండోనేషన్ ఫీజు కింద విద్యార్థుల నుంచి నరసింహారెడ్డి ఇంజనీరింగ్ (Narasimha Reddy Engineering Collage) కళాశాల యాజమాన్యం భారీ ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారని ఎన్ఎస్ యూఐ నాయకులు తెలిపారు. తాము సైతం దాడులు దిగడానికి రాలేదని శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టేందుకు వచ్చామని, అయితే కళాశాల సిబ్బందితో పాటు ఇతర సిబ్బంది రెచ్చగొట్టడం వల్లే దాడికి దిగాల్సి వచ్చిందని ఎన్ ఎస్ యు ఐ నేతలు పేర్కొంటున్నారు. అయితే కళాశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు పేట్ బషీర్బాగ్ పోలీసులు ఎన్ఎస్ యుఐ నేతలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్(Police Station) కు తరలించారు.

శాంతియతంగా చేసుకోవాలి : కళాశాల ఎండి నరసింహారెడ్డి 

కళాశాలలో చోటుచేసుకున్న ఘటనపై కళాశాల ఎండి నరసింహారెడ్డి మాట్లాడుతూ విద్యార్థి సంఘ నేతలు ఆందోళన చేయాలనుకుంటే శాంతియుతంగా చేసుకోవచ్చని, ఇలా కళాశాలపై దాడి చేయడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. ఏదైనా సమస్య ఉంటే కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామని, ఇలా దాడులకు పాల్పడవద్దని కోరారు.

Also Read: TVK Vijay: సీఎం అభ్యర్థి ప్రకటన.. బీజేపీతో పొత్తుపై విజయ్ సంచలన నిర్ణయం

 

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు