Tamil Nadu Marriage
Viral, లేటెస్ట్ న్యూస్

Twist in Marriage: పెళ్లిలో బిగ్ ట్విస్ట్.. ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు!

Twist in Marriage: అది పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఇరుకుటుంబాలు కూర్చొని మాట్లాడుకొని.. అమ్మాయి, అబ్బాయిల ఇష్టపూర్వకంగానే వివాహాన్ని నిశ్చయించారు. ముహూర్తాలు పెట్టుకున్నారు. శుభలేఖలు ప్రింట్ వేయించి బంధువులు, చుట్టాలు, స్నేహితులు, ఇరుగుపొరుగువారందరినీ ఆహ్వానించారు. చెన్నైలోని బెసెంట్ నగర్‌లో ఉన్న ఒక చర్చిలో ఇరుకుటుంబాల పెద్దల సమక్షంలో ముహూర్తానికి వధువును వరుడు వివాహమాడాడు. పెళ్లి తంతు పూర్తయింది. ఇద్దరూ ఒక్కటయ్యారు. అయితే, అసలైన ట్విస్ట్ పెళ్లిన కొన్ని గంటలకు జరిగింది. పెళ్లి జరిగిన రోజు సాయంత్రం రిసెప్షన్ జరగాల్సి ఉండగా, నవ వధువు కనిపించకుండా పోయింది. ఎక్కడికి వెళ్లిందా? అని టెన్షన్ టెన్షన్‌గా ఆరా తీయగా ప్రియుడితో లేచిపోయినట్టు తేలింది. ఈ షాకింగ్ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో బుధవారం జరిగింది.

బ్యూటీ పార్లర్‌కు వెళ్లొస్తానని చెప్పి..

పెళ్లైన కొన్ని గంటలకే వధువు ప్రియుడితో పారిపోయిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఉదయం పెళ్లి జరగడం, సాయంత్రం లవర్‌తో జంప్ కావడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇంతకీ ఆ పెళ్లి కూతురు పేరు అర్చన (20), పెళ్లి కొడుకు పేరు జయకుమార్. అర్చన చెన్నైలోని పెరంబూర్‌ అంబేడ్కర్‌ నగర్‌ చెందిన అఖిలన్‌-నాగవల్లి దంపతుల కూతురు, కాగా, వరుడు జయకుమార్ మాధవరం బర్మా కాలనీకి చెందిన వ్యక్తి. ఇరు కుటుంబాల సమక్షంలో బుధవారం పెళ్లి జరిగింది. పెళ్లైన తర్వాత వధూవరులు ఇద్దర్ని యువతి ఇంటికి తీసుకొచ్చారు. ఆ రోజు సాయంత్రమే వివాహ రిసెప్షన్‌ జరగాల్సి ఉంది. అయితే, బ్యూటీ పార్లర్‌కు వెళ్లి మేకప్ వేయించుకొని వస్తానంటూ మధ్యాహ్న సమయంలో వెళ్లిన అర్చన సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఫోన్ స్విచాఫ్ రావడంతో భర్త జయకుమార్‌తో పాటు అర్చన తల్లిదండ్రులు, బంధువులు తెగ కంగారు పడ్డారు.

Read also- Actress Lavanya: లావణ్య మెడకు చుట్టుకున్న మరో వ్యవహారం.. ఫోన్ స్విచాఫ్

బ్యూటీ పార్లర్‌కు వెళ్లి చూడగా అక్కడ అర్చన లేదు. దీంతో, ఆమె కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఎంత అన్వేషించినా ఫలితం దక్కలేదు. అయితే, అర్చన అప్పటికే ప్రియుడితో పారిపోయినట్టుగా ఇరుగుపొరుగువారు గుర్తించారు. అర్చన పెళ్లికి ముందు ఎరుకంజేరి అనే ప్రాంతానికి చెందిన కలైఅరసన్‌ అనే యువకుడిని ప్రేమించినట్టుగా వెల్లడైంది. విషయం తెలిసి అర్చన తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. ఇక, భర్త జయకుమార్ పరిస్థితి వర్ణించలేని విధంగా ఉంది. అయితే, బతికిపోయావ్ సంతోషించు అంటూ స్థానికులతో పాటు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేలుతున్నాయి. తన కూతుర్ని అప్పగించాలంటూ తిరువిక నగర్‌ పోలీస్‌ స్టేషన్‌‌కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. పరారైన అర్చన, ఆమె లవర్ కోసం గాలింపు మొదలుపెట్టారు.

Read also- Vegetarian In China: చైనా వెళ్లిన వెజిటేరియన్.. ఏమంటున్నాడో మీరే వినండి

పెళ్లి ఖర్చులు తిరిగిచ్చేస్తా..
వరుడు జయకుమార్‌ కుటుంబానికి పెళ్లి ఖర్చులు ఇస్తానంటూ వధువు అర్చన హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. జయకుమార్ కుటుంబానికి అర్చన తల్లిదండ్రులు క్షమాపణలు చెప్పారు. పెళ్లి ఇష్టం లేదని ముందే చెప్పివుంటే తమకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అని జయకుమార్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, అర్చనకు ప్రేమ వ్యవహారం ఉందనే విషయం అప్పటికే రెండు కుటుంబాలకు తెలుసు చర్చ స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఇరు కుటుంబాలు వారి ప్రేమను కాదని వివాహం జరిపించారని తెలుస్తోంది. కాగా, పెళ్లి రిసెప్షన్ రద్దు చేసుకున్న అర్చన తల్లిదండ్రులు, బంధువులు ఎవరికీ ముఖాలను చూపించలేకపోయాడు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!