Actress Lavanya: నటుడు రాజ్‌తరుణ్-నటి లావణ్య (Raj Tarun – Actress Lavanya) మధ్య వ్యవహారం టీవీ సీరియల్‌గా మాదిరిగా కొనసాగుతోంది. తాజాగా లావణ్య మెడకు మరో వ్యవహానం చుట్టుకుంది. కోకాపేటలో ఉన్న రాజ్ తరుణ్ విల్లాను కొనుగోలు చేసిన వ్యక్తిపై ఆమె బెదిరింపులకు పాల్పడినట్టుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు రాజ్ తరుణ్ నుంచి విల్లాను కొనుగోలు చేసిన సుశీల్ అనే వ్యక్తి నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో లావణ్యపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ విల్లాలో నివాసం ఉంటున్నవారిని బెదిరించి బయటకు వెళ్లగొట్టే ప్రయత్నాలు చేసిందని అందులో పేర్కొన్నారు. దీంతో, ఆస్తుల్ని ఆక్రమించుకునేందుకు, ధ్వంసానికి పాల్పడేందుకు ప్రయత్నించిందన్న సెక్షన్ల కింద లావణ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. బెదిరింపులకు పాల్పడిన సెక్షన్లను కూడా జత చేశారు.
Read also- Notice to Political Parties: బిగ్ బ్రేకింగ్.. 13 రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ షాక్!
విల్లా కోసమే లావణ్య బెదిరింపులకు దిగినట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై క్లారిటీ కోసం లావణ్య సంప్రదించే ప్రయత్నం చేయగా ఆమె కలవడం లేదని తెలుస్తోంది. ఫోన్ ఒకసారి మాత్రమే రింగ్ అయింది. ఆ వెంటనే స్విచాఫ్ లేదా నెట్‌వర్క్ కవరేజీ లేదు అని వస్తోంది. ఈ కేసు వ్యవహారంలో లావణ్యను అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అరెస్టుకు అవకాశం ఉంటే లావణ్య ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. గతంలో ఇదే విల్లా కోసం లావణ్య గట్టి పట్టుబట్టింది. రాజ్‌తరుణ్‌తో వాదులాటకు దిగింది. మొత్తంగా రాజ్‌తరుణ్ – లావణ్య ఎపిసోడ్ అటు ఇటు తిరుగుతోంది. నిజానికి, కోకాపేటలోని తన విల్లాను ఇద్దరి మధ్య తరచూ గొడవల నేపథ్యంలో సుశీల్ అనే వ్యక్తికి రాజ్‌తరుణ్ విక్రయించారు.
Read also- Nagarkurnool District Collector: నాగర్ కర్నూల్ జిల్లా యువకుడికి అరుదైన గౌరవం
ఇన్నాళ్లు ఎందుకు ఉన్నట్టు?
ఒకవేళ రాజ్‌తరుణ్, లావణ్యకు మధ్య ఎలాంటి సంబంధం లేకపోతే ఇన్నాళ్లపాటు, వివాదం జరుగుతున్న సమయంలో, ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తిన సమయంలో, ఒకరి మీద మరొకరు కేసు పెట్టుకున్న సమయంలో కూడా లావణ్య అదే ఇంట్లో ఉంది. దీంతో, రాజ్‌తరుణ్ ఇంట్లో లావణ్య ఇన్నాళ్లు ఎందుకు ఉంది? అనేది కూడా ప్రశ్నగా మారింది. కాగా, వీరిద్దరి మధ్య వ్యవహారంలో రాజ్‌తరుణ్ ఎప్పుడూ బయటకు రాలేదు. లాయర్ల ద్వారా మాట్లాడిస్తూ వస్తున్నారు. ఒకసారి పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు, ఇంకోసారి ముంబైలో మాత్రమే అతడు కనిపించాడు. ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు.