Jabardasth Nukaraju: జబర్దస్త్ కమెడియన్ నూకరాజు, పటాస్ ఆసియా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై క్రేజ్ తెచ్చుకున్న జంటలలో వీరు కూడా ఒకరు. వీరిద్దరూ “పటాస్” షో ద్వారా ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు. ఆ తర్వాత జబర్దస్త్‌లో కూడా కలిసి స్కిట్స్‌లో నటించారు. వీరి ఆన్-స్క్రీన్ లవ్ ట్రాక్‌తో పాటు, నిజ జీవితంలోనూ వీరి సంబంధం గురించి చాలా మందికి సందేహం ఉంది.
Also Read: Movie Piracy: పైరసీతో టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న కిరణ్ అరెస్ట్.. ఒక్క ఏడాదిలో రూ. 3700 కోట్ల నష్టం
జబర్దస్త్ కమెడియన్ నూకరాజు కేవలం కామెడీ మాత్రమే కాకుండా పాటలతో కూడా అలరిస్తున్నాడు. ఇటీవలే నూకరాజు పాడిన తాటి బెల్లం సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం, ఈ పాట మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తుంది. అయితే, తాజాగా మరో పాటతో మన ముందుకు వస్తున్నాడు. జబర్దస్త్ బాబు డైరక్షన్లో తెరకెక్కిన సల్లగుండరాదే సాంగ్ ప్రోమో నేడు విడుదలైంది. అయితే, ఈ పాటలో ఆసియా పెళ్లి వేరే అబ్బాయితో జరుగుతుంది. అంతక ముందు లవ్ చేసుకున్న నూకరాజు, ఆసియా గడిపిన క్షణాలను గుర్తు చేసుకుని తల్లడిల్లిపోతుంటాడు.
Also Read: Dil Raju: పైరసీపై కఠిన చర్యలకు ఎఫ్‌డీసీ ముందడుగు.. సినిమాలను పైరసీ చేస్తున్న కిరణ్ అరెస్ట్
ఆమెను గుర్తు చేసుకుంటూ నూకరాజు కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో ఈ వీడియోని చూసిన వారు ఇది పాట వరకు అయితే ఒకే, నిజ జీవితంలో ఇలా అయితే మేము తట్టుకోలేమంటూ తమ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. ఇంకొందరు పాటకి డైరక్షన్ చేసిన జబర్దస్త్ బాబుకు కంగ్రాట్స్ చెబుతూ, ఈ పాట పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇక బుల్లితెర ప్రేక్షకులైతే ఆసియా నువ్వు ఎప్పుడూ నూకరాజుతోనే ఉండాలి.. యాక్టింగ్ బాగా చేశాడు, సూపర్.. సినిమాల్లో కూడా అవకాశాలు రావాలని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Love Affair: ఒకేసారి ఆరుగురితో లవ్ ఎఫైర్.. యువతికి లైఫ్ లో గుర్తిండిపోయే ఝలక్ ఇచ్చిన అబ్బాయిలు!