TGPSC Office: నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగల భర్తీ నోటిఫికేషన్‌లను విడుదల చేయాలనీ TGPSC కార్యాలయ ముట్టడి పిలుపు సందర్బంగా చివ్వేంల మండల పోలీస్‌లు తెలంగాణ యువజన సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు, తెలంగాణ యువజన సంఘము రాష్ట్ర నాయకులు భాషిపంగు సునీల్(sunil)లను అక్రమంగా ముందస్తు అరెస్ట్ చేసి చివ్వేంల పోలీస్ స్టేషన్(Chibvemla Pglioce station) తరలించారు. ఈ సందర్బంగా తెలంగాణ యువజన సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు, భాషిపంగు సునీల్ మాట్లాడుతూ గత ఎన్నికల సందర్బంగా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, నిరుద్యోగ యువతకి అనేక హామీలు ఇచ్చింది.
సుమారు 2 సంవత్సరాలు కావస్తున్నా
అధికారం లోకి వచ్చిన మొదటి సంవత్సరమే ఖాళీగా ఉన్నా 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రతి సంవత్సరం జూన్ 02 నాటికీ, ప్రభుత్వ ఖాళీలు గుర్తించి, సెప్టెంబర్ 17నాటికీ ఉద్యోగాలను భర్తీ చేస్తామని విద్యార్థి నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చి, ఎన్నికల మ్యాని ఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ(Congress). అధికారంలోకి వచ్చి సుమారు 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా సరైన నోటిఫికేషలు రాకపోవడం నిరుద్యోగ యువత ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేక కుంగుబాటుకి గురి అవుతున్నారు. గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్‌లకు, ఉద్యోగ పత్రాలు ఇచ్చి, అడపా దడప ఏవో చిన్న సంఖ్య గల ఖాళీలను భర్తీ చేసి చేతులు దులుపుకుంటున్నారు కానీ, విద్యార్థి, నిరుద్యోగ యువత(Unemployment) ఆశిస్తున్నా మెగా జంబో నోటిఫికేషన్(Notification)లను విడుదల చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుంది.
Also Read: Handloom Workers Loan: చేనేత కార్మికులకు గుడ్ న్యూస్.. మంత్రి తుమ్మల
రాష్ట్రంలో అప్రకటిత ఏమర్జెన్సీ
ఎన్నికల సందర్బంగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని, ఏడవ హామీగా ప్రజాస్వామ్యన్ని పునరుద్దరిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, తీరా అధికారంలోకి వచ్చాక విద్యార్థులు, నిరుద్యోగ యువత, ప్రజలు తమ న్యాయమైన సమస్యల పరిష్కారంకై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ ముందస్తు అరెస్ట్‌లు, నిర్భంధాలను కొనసాగిస్తున్నదని తెలంగాణ రాష్ట్రంలో అప్రకటిత ఏమర్జెన్సీ కొనసాగుతందని అన్నారు. అక్రమ అరెస్ట్‌లు, నిర్భందాలతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎన్నికల సందర్బంగా విద్యార్థి, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, 2లక్షల ఉద్యోగల భర్తీకై నోటిఫికేషన్ విడుదల చేయాలనీ, జాబ్ క్యాలెండర్‌తో సంబంధం లేదు జోంబో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయండి అని తెలిపారు. నిరుద్యోగ యువతకి స్వయం ఉపాధి అవకాశలు కల్పించి నిరుద్యోగ సమస్య పరిష్కారించాలని డిమాండ్ చేసారు.
Also Read: KCR: యశోద ఆస్పత్రికి కేసీఆర్.. ఇంతకీ ఏమైంది?