Viral Video: క్యాబ్ లో మందు కొట్టి.. బాధ్యతరహితంగా వ్యవహరించిన ప్రయాణికుల పట్ల డ్రైవర్ వ్యవహరించిన తీరుపై నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. బుద్ధి లేకుండా వ్యవహరించిన వ్యక్తిని సమాజం ముందుకు తీసుకొచ్చారంటూ నెటిజన్లు అకాశానికెత్తుకున్నారు. ఈ డ్రైవర్ లాగానే మిగతా వారు ఉంటే సమాజం మరింత మెరుగ్గా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ డ్రైవర్ చేసిన పనేంటి? ఎందుకు అంతగా నెటిజన్లు ప్రశంసిస్తున్నారు? అనే అంశాలను ఈ కథనంలో పరిశీలిద్దాం.
అసలేం జరిగిందంటే?
ఓ క్యాబ్ డ్రైవర్ తనకు ఎదురైన పరిస్థితి గురించి వీడియోలో పంచుకున్నాడు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది విపరీతంగా వైరల్ అవుతోంది. కారులో కెమెరా ఎందుకు ఉండాలో ఇప్పుడు చూడండి అంటూ సదరు డ్రైవర్ వీడియోను ప్రారంభించాడు. వీడియోలో.. క్యాబ్ వెనక సీటులో కూర్చొని ఉన్న మహిళ మద్య తాగడాన్ని గమనించవచ్చు. ముందు సీటులో ఉన్న మహిళ.. తన స్నేహితురాలిని అలా చేయవద్దని చెబుతుంది. ఈ క్రమంలోనే కారులో మద్యం సేవించడంపై డ్రైవర్ అభ్యంతరం వ్యక్తం చేస్తాడు. దీంతో ‘ఏం చేయాలో మాకు తెలుసు. పోలీసుల గురించి ఆందోళన చెందవద్దు. వారు ఆపితే బాటిల్ ను దాచిపెడతాం’ అంటూ యువతి డ్రైవర్ కు ఘాటుగా సమాధానం ఇచ్చింది.
This cab driver addressed privacy concerns in cabs which have dashboard cameras through this video.
He shouldn't have blurred the video though. Everyone should know who was this chutiya. pic.twitter.com/qmzDreMkgt
— Incognito (@Incognito_qfs) July 2, 2025
మద్యం సీసా బయటకు విసిరి..
అదే కారు ఎక్కిన మరో ప్రయాణికుడు కూడా ఇదే తరహాలో మద్యం సేవించి.. బాధ్యతరహితంగా వ్యవహరించినట్లు వీడియోలో గమనించవచ్చు. కారు ముందు సీటులో కూర్చొన్న అతడు మద్యం సేవించి.. ఆ బాటిల్ ను వాహనం నుండి బయటకు విసిరేశాడు. దీనిపై క్యాబ్ డ్రైవర్ స్పందిస్తూ ‘నువ్వు అలా చేయకూడదు సోదర’ అని అతడితో అంటాడు. ఇప్పుడు అర్థమైందా కారులో కెమెరా ఎందుకు అవసరమో అంటూ క్యాబ్ డ్రైవర్ వీడియో చివరన చెప్పడం గమనించవచ్చు. ఇది నా గోప్యత అంటూ వీడియోను అతడు ముంగించాడు. అయితే ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న దానిపై క్లారిటీ లేదు.
Also Read: Telangana: తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ప్లాన్!
నెటిజన్ల రియాక్షన్
క్యాబ్ డ్రైవర్ పోస్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. సమాజంలో అనారిగరికంగా ప్రవర్తించే వారు కూడా ఉంటారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు డ్రైవర్ భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. క్యాబ్ లోపల నిఘా అవసరాన్ని గురించి ఈ వీడియో ప్రశ్నలు లేవనెత్తుతోందని చెప్పారు. కారు లోపల డాష్ క్యామ్ ను తప్పనిసరి చేయాలని ఉబర్ (Uber), ఓలా (OLA), రాపిడో (Rapido) వంటి సంస్థలకు మరో నెటిజన్ సూచించాడు. మెుత్తంగా క్యాబ్ డ్రైవర్ పోస్ట్ చేసిన వీడియో.. ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చకు తావిస్తోంది.