Siddharth Kaushal Politics
ఆంధ్రప్రదేశ్

Siddharth Kaushal: రాజకీయాల్లోకి సిద్ధార్థ్ కౌశల్.. పార్టీ కూడా ఫిక్స్!

Siddharth Kaushal: యంగ్ అండ్ డైనమిక్.. పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సిద్ధార్థ్ కౌశల్ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. ఆయన ఏ జిల్లాకు వెళ్లినా నేరుస్థులకు దబిడి దిబిడే. బహుశా ఇలాంటి వ్యక్తిని సినిమాల్లో తప్పితే రియల్‌గా ఎక్కడా చూసి ఉండరు.. అదీ ఆయన రేంజ్. అందుకే ఈయన్ను ‘సింగం సిద్ధార్థ్’ (Singam Siddarth) అని అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకూ ఈయన పనిచేసిన అన్ని జిల్లాల్లోనూ ఐపీఎస్ అంటే ఎలా ఉంటారు? పవర్ ఏంటి? అనేది క్లియర్ కట్‌గా నిజ జీవితంలో చేసి చూపించారు. అందుకేనేమో ఈయనకు ఆంధ్రాలో భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈయన పేరిట ప్రత్యేకంగా కార్యక్రమాలు.. సోషల్ మీడియాలో (Social Media) పేజీలు కూడా నడుపుతున్నారంటే ఆ అభిమానం ఎలాంటిదో చెప్పనక్కర్లేదు. అయితే.. సడన్‌గా ఏం జరిగిందో తెలియట్లేదు కానీ.. తాను ఐపీఎస్ పదవికి రాజీనామా (Resignation) చేస్తున్నట్లు ప్రకటించి అందర్నీ షాక్‌కు గురిచేశారు. వాస్తవానికి ఇంకా 20 ఏళ్లపాటు సర్వీస్ ఉన్నప్పటికీ రాజీనామా చేయడంతో తెర వెనుక ఏం జరిగింది? ఎందుకిలా చేశారని లేనిపోని అనుమానాలు వచ్చాయి. ప్రభుత్వ వేధింపులే కారణమని ప్రచారం కూడా జరిగింది. అయితే తాను స్వచ్ఛందంగానే ఐపీఎస్‌కు రాజీనామా చేస్తున్నట్టు ఓ ప్రకటనతో ఈ పుకార్లకు చెక్ పెట్టేశారు. అయితే సమాజానికి కొత్త మార్గాల్లో సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లుగా హింట్ ఇచ్చారు. దీంతో తాజాగా అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సిద్ధార్థ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లుగా తెలుస్తున్నది.

Read Also- KCR: యశోద ఆస్పత్రికి కేసీఆర్.. ఇంతకీ ఏమైంది?

IPS Siddarth

ఫుల్ డీటైల్స్ ఇవిగో!
రాజీనామా తర్వాత ఢిల్లీలోని ఓ ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తారని ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని దాదాపుగా సిద్ధార్థ్ కూడా అంగీకరించారు కూడా! అయితే ఒక్కరోజు గ్యాప్‌లోనే సోషల్ సరికొత్త ప్రచారం ఊపందుకున్నది. ఖాకీ నుంచి ఖద్దర్‌కు కౌశల్ మారబోతున్నారని టాక్ నడుస్తున్నది. అదోనండోయ్.. ఖాకీ బట్టలు తీసేసి రాజకీయాల్లోకి వచ్చి ఖద్దరు బట్టలు ధరించబోతున్నాడని అర్థం. అది కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల అధికారానికి దూరమైన వైసీపీతో (YSR Congress) సంప్రదింపులు కూడా పూర్తయినట్లుగా తెలుస్తున్నది. అంతేకాదు.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి (YS Jagan Mohan Reddy) గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే సిద్ధార్థ్ వీఆర్ఎస్‌కు (VRS) దరఖాస్తు చేసినట్టుగా వినికిడి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే రెండు లేదా మూడు నెల్లలో అధికారిక ప్రకటన రావొచ్చని సమాచారం. వైసీపీలోనే చేరడం వెనుక చాలా కారణాలు ఉన్నాయట. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో సిద్ధార్థ్ ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. అందుకే ఆ పార్టీకి వ్యతిరేకంగా వైసీపీలో చేరాలని ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ప్రభుత్వం నుంచి కౌశల్ వేధింపులు ఎదుర్కొన్నది కూడా అక్షరాలా నిజమే అవుతుంది. వాస్తవానికి ఎన్ని ఇబ్బందులున్నా, ఆటంకాలు ఉన్నా ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ఎక్కడా బయటికి చెప్పరు.. చెప్పుకోవడానికి సాహసించరు కూడా. బహుశా అందుకేనేమో సిద్ధార్థ్ కూడా బయటికి ఎలాంటి విషయాలు చెప్పలేదనే తెలుస్తున్నది. మరోవైపు.. కౌశల్‌ రాజీనామా నుంచి బ్యూరోక్రాట్స్, సివిల్‌ సర్వీస్‌లో ఉన్న అధికారులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందనే అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకులు నుంచి వస్తున్నాయి.

Read Also- Siddharth Kaushal: సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా వెనుక ఏం జరిగింది.. ఎందుకీ పరిస్థితి?

Siddharth Kaushal

వైసీపీలోనే ఎక్కువ..!
వాస్తవానికి.. పలు రంగాల్లో సేవలు అందించిన, ప్రభుత్వ రంగాల్లో విశేష అనుభవం ఉన్న వ్యక్తులు రాజకీయ పార్టీల్లోకి రావడం సర్వ సాధారణమే. ఈ విషయానికొస్తే వైసీపీలో మాత్రం ఎక్కువగానే ఉన్నారు. ఎంబీబీఎస్ డాక్టర్లు, యాక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఇందులో మాజీ ఐఏఎస్ ఇంతియాజ్, మాజీ పోలీస్ అధికారి గోరంట్ల మాధవ్ కూడా ఉన్నారు. ఇంతియాజ్ తొలిసారి ఎన్నికల్లో పోటీచేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పేశారు. ఇక మాధవ్ విషయానికొస్తే తొలిసారి ఎంపీగా గెలిచి రికార్డ్ సృష్టించారు. ఆ తర్వాత పరిస్థితులు అనుకూలించలేదు. ఈయన రాజకీయాల్లోకి రాకముందు ఊర మాస్ పోలీస్‌గా వ్యవహరించారు. యువకులు, ఉత్సాహవంతులు రాజకీయాల్లోకి రావాలని ఎక్కువగా అధినేతలు పిలుపునిస్తుంటారు. బహుశా ఇవన్నీ ఆదర్శంగా తీసుకొని కౌశల్ రాజకీయాల్లోకి వస్తున్నారేమో..! అయితే ఆయన వచ్చినా మరో ఇంతియాజ్, గోరంట్ల అవుతారని విమర్శలు సైతం వస్తున్నాయి. పొలిటికల్ ఎంట్రీ నిజమే అయితే.. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి కాదు.. అలాంటి రాష్ట్ర రాజకీయాల్లో ఎలా రాణిస్తారు? అనేది పెద్ద ప్రశ్నే. మరోవైపు.. కౌశల్‌ విషయంలో సీనియర్లు, విశ్లేషకుల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఇప్పటికైనా మించి పోయిందేమీ లేదని వీఆర్ఎస్ వెనక్కి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే.. వీఆర్ఎస్‌కు దరఖాస్తు పెట్టుకున్న 90 రోజుల్లోపు అది వెనక్కి తీసుకోవచ్చు. ఇందులో నిజానిజాలెంతో సిద్ధార్థ్ కౌశల్ స్పందిస్తే తప్ప తెలిసే అవకాశం లేదు.

Jagan And Siddarth

Read Also- Hyderabad: అడ్డంగా దొరికిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. అతడి బ్యాగులో

 

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది