Drug Case
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Hyderabad: అడ్డంగా దొరికిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. అతడి బ్యాగులో

Hyderabad: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: అతడో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (Hyderabad).. ఐదంకెల జీతం.. ఏసీ గదుల్లో పని.. వాటితో సంతృప్తిపడకుండా సులువైన మార్గంలో, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని కక్కుర్తిపడ్డాడు. అందుకోసం గంజాయి దందా మొదలు పెట్టాడు. చివరకు ఎక్సైజ్ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఎక్సైజ్ ఎన్​ ఫోర్స్​ మెంట్​ డైరెక్టర్​ షానవాజ్​ ఖాసీం తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని మల్లేపల్లి మాన్‌గార్ బస్తీ నివాసి మహ్మద్ నదీమ్​ (26) అడ్డంగా దొరికిపోయాడు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అతడికి కొంతకాలం క్రితం అర్జున్ రెడ్డి అనే వ్యక్తితో స్నేహం ఏర్పడింది. గంజాయి అమ్మితే తేలికగా లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చని అర్జున్​ రెడ్డి నమ్మబలకడంతో నదీమ్​పూర్తి నమ్మాడు. గంజాయి బిజినెస్‌కు ఒప్పుకున్నాడు.

అందుకోసం అర్జున్ రెడ్డి నుంచి మహ్మద్ నదీమ్ అరకిలో గంజాయి తీసుకున్నాడు. లాంగ్​ డ్రైవ్ అనే యాప్​ ద్వారా గంజాయి కొనుగోలుదారులను సంప్రదించాడు. గంజాయి డెలివరీలు ఇవ్వటానికి కారు అద్దెకు తీసుకున్నాడు. గంజాయి పట్టుకొని నారాయణగూడ ప్రాంతానికి వచ్చాడు. మహ్మద్ నదీమ్‌పై పక్కా సమాచారం అందుకున్న ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ టీమ్ పట్టుకుంది. సీఐ నాగరాజు, తన సిబ్బందితో కలిసి ఈ దాడి చేసి నదీమ్‌ను అరెస్ట్ చేశారు. అతడి నుంచి గంజాయితో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న అర్జున్​ రెడ్డి కోసం గాలిస్తున్నారు.

Read also- Viral Video: ఇదేం దారుణం రా బాబూ.. అన్యాయంగా ఒక మనిషిని..

మరోవైపు, బాలానగర్‌లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న రమావత్ లోక్ నాథ్ నాయక్​ (29‌‌) అనే కొన్ని రోజులుగా గంజాయి విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారం అందుకున్న సీఐ నాగరాజు, సిబ్బందితో కలిసి దాడి చేసి అతడిని పట్టుకున్నారు. బాలానగర్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 2.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన నిందితుడు కేపీహెచ్‌బీ కాలనీలో నివాసం ఉంటున్నాడని, డబ్బు సంపాదన కోసం రమావత్ ఈ అక్రమ మార్గం ఎంచుకున్నట్టు విచారణలో వెల్లడైంది.

డ్రగ్స్​ విక్రేతల అరెస్ట్

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: డ్రగ్స్ విక్రయిన్న ఇద్దరు వ్యక్తులను ఈగిల్ టీమ్ అధికారులు, రాచకొండ నార్కొటిక్ పోలీసులతో కలిసి గురువారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.10.96 లక్షల విలువైన ఓజీ కుష్​, ఎక్టసీ పిల్స్2ను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ స్టేడియం పార్కింగ్ వద్ద డ్రగ్స్​ అమ్మకాలు జరుగుతున్నట్టుగా సమాచారం అందటంతో సీఐలు ప్రవీణ్​ కుమార్​, రాంప్రసాద్​, ఎస్సైలు జీవన్ రెడ్డి, చెన్నరాయుడుతోపాటు సిబ్బందితో కలిసి దాడి చేశారని ఈగిల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. సికింద్రాబాద్ సింధీ కాలనీకి చెందిన కమతం మోహిత్ (25), మధ్యప్రదేశ్‌కు చెందిన స్వప్నిల్ వర్తే(26)లను అరెస్ట్ చేశారు. బీకాం చేస్తూ చదువు మధ్యలో ఆపేసిన మోహిత్ తన తండ్రి నడుపుతున్న హోల్ సేల్ కూరగాయల దుకాణంలో పని చేస్తున్నాడు. కొంతకాలం క్రితం ముంబైలోని ఓ పబ్బులో అతడికి పరిచయమైన వ్యక్తి ద్వారా ఓజీ కుష్​, ఎక్టసీ పిల్స్ గురించి తెలుసుకున్నాడు. వాటిని సేవిస్తే ఎలా ఉంటుందోనని కొని వాడాడు. ఆ తరువాత వీటిని మార్కెట్లో అమ్మితే దండిగా డబ్బు సంపాదించుకోవచ్చని భావించాడు. ఈ క్రమంలో ముంబై పబ్బులో పరిచయం అయిన వ్యక్తి నుంచి డ్రగ్స్‌ను కొరియర్​ ద్వారా ఇక్కడికి తెప్పిస్తూ విక్రయిస్తున్నాడు.

Read also- Shubman Gill: రెండో టెస్టులో కెప్టెన్ గిల్ పెనుసంచలనం

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?