Subhman Gill
Viral, లేటెస్ట్ న్యూస్

Shubman Gill: రెండో టెస్టులో కెప్టెన్ గిల్ పెనుసంచలనం

Shubman Gill: బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానం వేదికగా భారత్ – ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండవ టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ (Shubman Gill) చెలరేగాడు. చారిత్రాత్మక రీతిలో డబుల్ సెంచరీతో చెలరేగాడు. మొత్తం 311 బంతులు ఎదుర్కొని 200 పరుగులు సాధించాడు. 21 ఫోర్లు, 2 భారీ సిక్సర్లు బాదాడు. దీంతో, టెస్ట్ ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ సాధించిన రెండవ అతి పిన్న భారత కెప్టెన్‌గా శుభ్‌మాన్ గిల్ రికార్డులకెక్కాడు. 25 ఏళ్ల 298 వయసులో గిల్ ఈ రికార్డు సాధించాడు. అతడి కంటే ముందు, 1964లో ఇంగ్లండ్‌పై మన్సూర్ అలీఖాన్ పటౌడి 22 ఏళ్ల 175 రోజుల వయసులో డబుల్ సెంచరీ సాధించాడు. ఇక, సచిన్ టెండూల్కర్ 1999లో న్యూజిలాండ్‌పై 26 సంవత్సరాల 189 రోజుల వయసులో డబుల్ సెంచరీ సాధించాడు. విరాట్ కోహ్లీ 2016లో వెస్టిండీస్‌పై 27 సంవత్సరాల 260 రోజుల వయసులో డబుల్ హండ్రెడ్ సాధించాడు. ఇంగ్లాండ్‌ వేదికగా మొత్తం 11 మంది కెప్టెన్ డబుల్ సెంచరీలు సాధించారు. ఆతిథ్య జట్టుకు చెందిన నలుగు, పర్యాటక జట్లకు చెందిన ఏడుగురు ప్లేయర్లు ఈ ఫీట్ సాధించారు. ఇక, విదేశీ ఆటగాళ్లలో గిల్ కంటే చిన్నవయసులో గ్రేమ్ స్మిత్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. 2003లో ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్‌ టెస్టులలో వరుసగా 277, 259 పరుగుల చొప్పున సాధించాడు. మొదటి డబుల్ సెంచరీ 22 ఏళ్ల 175 రోజుల వయసులో స్మిత్ సాధించాడు.

Read also- Viral News: బాలుడిని హోటల్‌కు తీసుకెళ్లి ఇంగ్లిష్ టీచర్ చేసిన పనిది!

ఇక, భారత టెస్ట్ కెప్టెన్‌గా డబుల్ సెంచరీలు సాధించిన దిగ్గజ ఆటగాళ్ల సరసన గిల్ చేరాడు. అత్యధికంగా విరాట్ కోహ్లీ 7 డబుల్ సెంచరీలు సాధించగా, మన్సూర్ అలీఖాన్ పటౌడీ, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, శుభ్‌మన్ గిల్ తలోటి సాధించారు. 2016లో నార్త్ సౌండ్‌లో విరాట్ కోహ్లీ ద్విశతకం సాధించిన తర్వాత, విదేశీ గడ్డపై మరో డబుల్ సెంచరీ సాధించిన భారత కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ కావడం గమనార్హం. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (SENA) గడ్డపై తొలి డబుల్ సెంచరీ అందుకున్న ఆసియా కెప్టెన్ కూడా గిల్ కావడం విశేషం. 2011లో లార్డ్స్‌లో తిలకరత్నే దిల్షాన్ చేసిన 193 పరుగులే ఇప్పటివరకు అత్యధికంగా ఉన్నాయి.

500 దాటిన స్కోర్

బర్మింగ్‌హామ్ టెస్టులో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరు 500 పరుగుల మైలురాయి అధిగమించింది. రెండవ రోజు ఆట 45 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 6 వికెట్లు నష్టపోయి 511 పరుగులు సాధించింది. క్రీజులో కెప్టెన్ గిల్ 231 పరుగులు (బ్యాటింగ్), వాషింగ్టన్ సుందర్ 25 పరుగులు (బ్యాటింగ్) ఆడుతున్నారు. మిగతా బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 87 పరుగులు, కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీష్ కుమార్ రెడ్డి 1, రవీంద్ర జడేజా 89 చొప్పున పరుగులు సాధించి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో అత్యధికంగా క్రీస్ వోక్స్ 2 వికెట్లు, బ్రిండన్ కర్సే, జాష్ టంగ్, బెన్ స్టోక్స్, షోయబ్ బషీర్ ఒక్కోటి చొప్పున వికెట్లు తీశారు.

Read also- HHVM Trailer: హరిహర వీరమల్లు ట్రైలర్‌‌పై ఓ రేంజిలో ట్రోలింగ్.. ఈ డైలాగ్ ఎవర్ని ఉద్దేశించి పెట్టారో?

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు