Mumbai teacher
Viral, లేటెస్ట్ న్యూస్

Viral News: బాలుడిని హోటల్‌కు తీసుకెళ్లి ఇంగ్లిష్ టీచర్ చేసిన పనిది!

Viral News: విద్యార్థి, ఉపాధ్యాయుల మధ్య బంధం ఎంతో పవిత్రమైనది. వెలకట్టలేనంత విలువైనది. భవిష్యత్‌కు బాటలు వేసే బాధ్యాతయుతమైన స్థానంలో ఉండే గురువులు వక్రబాటలో పయనిస్తే పిల్లలు భవిష్యత్‌ అంధకారమే అవుతుంది. అందరూ కాదు కానీ, కొందరు ఉపాధ్యాయ వృత్తికే కళంకం తీసుకొచ్చేలా ప్రవర్తిస్తున్నారు. ముంబైలో అలాంటి ఒక చెత్త టీచర్ వ్యవహారం వెలుగుచూసింది. నగరంలోని ఒక పాపులర్ ప్రైవేటు స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిపై ఇంగ్లిష్ టీచర్ లైంగిక దాడుల పర్వం కొనసాగించింది. ఏడాది కాలంగా లైంగిక వాంఛ తీర్చుకుంటోంది. బాలుడిని ఫైవ్ స్టార్ హోటల్స్‌కు తీసుకెళ్లి కోర్కెలు తీర్చుకున్నది. అయితే, బాలుడి ప్రవర్తనలో మార్పులు గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది.

2023 డిసెంబర్‌ నెలలో జరిగిన స్కూల్ యానివర్సరీ కార్యక్రమంలో గ్రూప్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో నిందిత టీచర్‌తో బాధిత బాలుడికి చనువు ఏర్పడింది. దీనిని ఆసరాగా తీసుకొని టీచర్ బాలుడిని టీచర్ లోబర్చుకుంది. లైంగిక వేధింపులు కొనసాగించింది. బాలుడు తొలుత అందుకు ఒప్పుకోకపోవడంతో.. వేరే స్కూల్‌లో తనకు పరిచయం ఉన్న మరో అమ్మాయిని రంగంలోకి దించింది. సదరు అమ్మాయి బాలుడిని అన్ని విధాలా పురిగొల్పింది. ఈ కాలంలో ఇలాంటి సంబంధాలు మామూలేనని, పట్టించుకోకుండా మేడమ్‌కు సహకరించాలని నూరిపోసింది. ఈ మాటలు నమ్మిన సదరు బాధిత విద్యార్థి భయంతోనే టీచర్‌కు దగ్గరయ్యాడు. దీంతో, టీచర్ పలుమార్లు హోటల్స్‌కు తీసుకెళ్లి కోరిక తీర్చుకుంది. ఈ క్రమంలో మద్యం తాగించింది. తనను ఏకాంతంగా కలవాలని కొన్ని కండిషన్లు విధించింది. ఈ విధంగా ఏడాదికాలంగా విద్యార్థిపై టీచర్ లైంగిక దాడులు కొనసాగాయని పోలీసుల దర్యాప్తులో తేలింది.

Read also- Viral News: వయసు 35 ఏళ్లే.. వ్యాయామం చేస్తుండగా…

బాలుడి ప్రవర్తనలో మార్పు
విద్యార్థిని ఒక తల్లిలా చూడాల్సిన టీచర్, వలపు వల విసురుతూ ఉండేది. కామపు కళ్లతో చూస్తుండేది. కానీ, విషయం బాలుడికి అర్థమయ్యేది కాదు. ఏడాదిగా లైంగిక దాడులకు పాల్పడుతుండడంతో బాలుడి ప్రవర్తనలో మార్పు మొదలైంది. ఇంట్లో వ్యక్తులతో ప్రవర్తించడంతో తేడా వచ్చింది. దీంతో, తల్లిదండ్రులకు అనుమానం వచ్చి ఆరా తీశారు. బాలుడు ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడని ఎంక్వైరీ చేయగా అసలు విషయాలు వెలుగు చూశాయి. బాలుడు నిజాలన్నీ ఒప్పుకున్నాడు. దీంతో, పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో, నిందిత టీచర్‌పై కఠినటమైన పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి వయసు 40 సంవత్సరాలు అని వివరించారు. ఈ వ్యవహారంలో టీచర్‌కు సహకరించిన మరో మహిళపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందిత టీచర్ బాలుడిని పలుమార్లు కారులో ఎవరూలేని ప్రదేశాలకు తీసుకెళ్లేదని కూడా పోలీసులు గుర్తించారు. టీచర్‌తో రిలేషన్‌పై బాలుడు ఎంగ్జయిటీకి గురయ్యేవాడని, అయితే, తగ్గుదలకు మందులు కూడా ఇచ్చేదని వివరించారు.

Read also- Trapit Bansal: టాలెంట్‌ కింగ్.. రూ.853 కోట్ల బోనస్‌తో జాబ్ ఆఫర్!

కేసు వద్దనుకున్నారు

తొలుత ఫిర్యాదు చేయకూడదని భావించిన తల్లిదండ్రులు భావించారు. గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన తర్వాత సదరు స్కూల్‌లో చదువు అయిపోతుంది కాబట్టి తిరిగి కలుసుకునే అవకాశం ఉండదని భావించారు. అయితే, బోర్డు ఎగ్జామ్స్‌ పూర్తయిన తర్వాత బాలుడిని కలిసేందుకు నిందిత ఉపాధ్యాయురాలు ప్రయత్నించింది. దీంతో తల్లిదండ్రులకు పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టారు. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత బాలుడి వయసు 16 ఏళ్ల మాత్రమేనని ఫిర్యాదు ద్వారా తెలిసింది. ప్రస్తుతం అతడు ఇంటర్మీడియట్‌‌లో చేరాడు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!