US Slams Israels Use Of American Weapons In Gaza As Palestine Death Toll Hits
అంతర్జాతీయం

Breaking News: రఫాని ఇజ్రాయెల్‌ హెచ్చరించడంతో అమెరికా ఫైర్‌

US Slams Israels Use Of American Weapons In Gaza As Palestine Death Toll Hits: గత కొద్దిరోజులుగా ఉత్కంఠ రేపిన బాంబు దాడులతో దక్షిణ గాజా నగరమైన రఫా అతలాకుతలం అయింది. అయితే రఫాపై దాడి చేయొద్దని అమెరికా ఒత్తిడి చేస్తున్నప్పటికి ఇజ్రాయెల్‌ ఏం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా రఫాలోని మరిన్ని ప్రాంతాలను ఖాళీ చేయాలని పాలస్తీనియన్లను ఆదేశించింది. ఎన్‌క్లేవ్‌లోని 11, ఇతర పరిసరాలను ఖాళీ చేసి సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.

ఈ మేరకు శనివారం ఇజ్రాయెల్‌ మిలిటరీ ప్రతినిధి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. స్థానభ్రంశం చెందిన గాజా నగరానికి పశ్చిమాన ఉన్న ఆశ్రయాలకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజలు ప్రమాదకరమైన పోరాట ప్రాంతాల్లో ఉన్నారని హెచ్చరించారు. ఇక్కడ భారీ దాడి జరిగే ఛాన్స్‌ ఉందని తెలిపారు. దీంతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. కాగా.. రఫాపై దాడి చేయొద్దని… అలా చేస్తే ఆయుధాల సరఫరా నిలిపి వేస్తామని అమెరికా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇజ్రాయెల్‌ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

Also Read: భూప్రకంపనలు.. భయం గుప్పిట్లో జనం..!

మరోవైపు ఇప్పటికే మూడు లక్షల మందికి పైగా పాలస్తీనియన్లు రఫా నుంచి వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. హమాస్‌ ఉద్యమానికి చెందిన వేలాది మంది మిలిటెంట్లను నిర్మూలించకుండా యుద్దంలో విజయం సాధించలేమని ఇజ్రాయెల్ చెబుతోంది. రఫాలో అనేక మంది హమాస్ ఉగ్రవాదులు తలదాచుకుంటున్నట్లు ఆరోపిస్తుంది. అందుకే రఫా నగరాన్ని లక్ష్యంగా చేసుకున్నామని తెలిపింది. అయితే రఫా నగరంపై దాడి చేస్తే భారీ ప్రాణనష్టం జరిగే ఛాన్స్ ఉంటుందని ఐక్యరాజ్యసమితితో సహా ప్రపంచంలోని ఆయా దేశాలు హెచ్చరిస్తున్నాయి.

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?