UP Shocking: ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) లోని దారుణం చోటుచేసుకుంది. భర్త సోదరులతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. తన అత్తనే కడతేర్చింది. ఆపై ఇంట్లో విలువైన ఆభరణాలతో అక్కడి నుంచి పరారయ్యింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆమెతో పాటు కుట్రలో భాగమైన వారిని అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెల్లడించారు.
అసలేం జరిగిందంటే?
ఉత్తర్ ప్రదేశ్ ఝాన్సీలోని కుంహారియా గ్రామానికి (Kumhariya village) చెందిన 54 ఏళ్ల సుశీల దేవి (Sushila Devi) జూన్ 24 ఉదయం హత్యకు గురైంది. ఆమెను తుపాకీతో కాల్చి చంపారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు.. ఫోరెన్సిక్ ఆధారాలు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాల ఆధారంగా 48 గంటల్లోనే కీలక అనుమానితులను కనుగొన్నారు. సుశీల ఇంట్లోనే నివసిస్తున్న కోడలు పూజ (Pooja), ఆమె సోదరి కమ్లా (Kamla)ను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు అనిల్ వర్మ (కమ్లా ప్రియుడు) ను సైతం అరెస్ట్ చేశారు.
ఆస్తి కోసం అత్త హత్య
విచారణలో పూజ, ఆమె సోదరి కమ్లా.. సుశీలను హత్య చేసినట్లు అంగీకరించారని ఝాన్సీ ఎస్పీ జ్ఞానేంద్ర కుమార్ (Superintendent of Police (City) Gyanendra Kumar) స్పష్టం చేశారు. అనిల్ వర్మ (Anil Varma) సాయంతో ఈ దారుణానికి తెగబడినట్లు ఒప్పుకున్నారని చెప్పారు. హత్య జరిగిన కొద్దసేపటికే వర్మ గ్రామం విడిచి పారిపోయాడని.. దొంగిలించిన బంగారు ఆభరణాలను విక్రయిస్తుండగా అతడ్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పూజ భర్త గతంలోనే చనిపోయాడని.. వారసత్వం, భూమికి సంబంధించిన విషయంలో అత్త సుశీలతో ఆమెకు విభేదాలు ఉన్నాయని చెప్పారు.
Also Read: Star Actress: 40 ఏళ్ల వ్యక్తితో ముడిపెట్టి వార్తలు రాశారు.. కన్నీరు పెట్టుకున్న హీరోయిన్?
భర్త సోదరులతో ఎఫైర్
నిందితురాలు పూజ తన భర్త చనిపోయిన తర్వాత మరిది కల్యాణ్ సింగ్ తో వివాహేతర సంబంధం పెట్టుకుందని పోలీసులు తెలిపారు. అయితే అతడు కూడా మరణించగా.. మరో మరిది సంతోష్ తో రిలేషన్ పెట్టుకున్నట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. సంతోష్ కు అప్పటికే పెళ్లికాగా.. అతడితో రిలేషన్ కారణంగా ఓ కుమార్తెకు సైతం పూజ జన్మనిచ్చిందని తెలిపారు. దీంతో 9 నెలల క్రితం సంతోష్ భార్య రాగిణి.. పుట్టింటికి వెళ్లిపోయిందని చెప్పారు. అత్త సుశీలను హత్య చేసిన నేపథ్యంలో గతంలో మరణించిన భర్త, ఆమె సోదరుడి గురించి కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.