Trapit Bansal: వార్షిక వేతన ప్యాకేజీ మూడు నాలుగు కోట్ల రూపాయలు వరకు ఉంటే బ్రహ్మండమంటూ ప్రశంసలు వెల్లువెత్తుతాయి. అలాంటిది ఒక వ్యక్తికి ఏకంగా రూ.853.32 కోట్ల జాయినింగ్ బోనస్ ఆఫర్‌తో కళ్లు చెదిరే జాబ్ ఆఫర్ వచ్చింది. భారత సంతతికి చెందిన త్రాపిత్ బన్సల్ (Trapit Bansal) అనే రీసెర్చర్‌కు కలలో కూడా ఊహించని ఈ ఆఫర్ దక్కింది. ప్రస్తుతం ఓపెన్ ఏఐలో (Open AI) అత్యంత కీలక హోదాలో పనిచేస్తున్న బన్సల్ కోసం గ్లోబల్ ఐటీ దిగ్గజం మెటా (Meta) ఈ సంచలన ప్యాకేజీ ఆఫర్ చేసింది. ఈ భారీ ఆఫర్‌కు బన్సల్ కూడా ఓకే చెప్పారు. మెటా నూతన సూపర్ ఇంటెలిజెన్స్ విభాగంలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక కీలక ప్రకటన కూడా చేశారు. ‘‘మెటాలో చేరబోతుండడం థ్రిల్లింగ్‌గా అనిపిస్తోంది!. ప్రస్తుతం సూపర్‌ఇంటెలిజెన్సీపైనే దృష్టి’’ అంటూ ట్వీట్ చేశారు. కాగా, అత్యుత్తమ నైపుణ్యాలు ఉన్న త్రాపిత్ బన్సల్‌ను ఏకంగా 100 మిలియన్ డాలర్ల భారీ ఆఫర్‌తో రిక్రూట్ చేసుకునేందుకు మెటా సిద్ధమైందంటూ ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ ఈ మధ్యనే వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల ఆధారంగానే బన్సల్ జాబ్ ఆఫర్‌పై టెక్ రంగంలో పెద్ద చర్చ నడుస్తోంది.
Read also- Illegal Bike Taxi: మంత్రి స్టింగ్ ఆపరేషన్.. సామాన్యుడిలా మారి.. బైక్ ట్యాక్సీల గుట్టురట్టు!
అసలు ఎవరీ బన్సల్
త్రాపిత్ బన్సల్ ఐఐటీ కాన్పూర్‌లో చదువుకున్నారు. మేథ్స్ అండ్ స్టాటిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. 2022లో ఓపెన్ఏఐ కంపెనీలో చేరాడు. కంపెనీ లెర్నింగ్ సామర్థ్యాలను మెరుగుపరచడంతో, ప్రారంభంలో ఏఐ తార్కిక నమూనాల అభివృద్ధి కోసం బాగా కష్టపడ్డారు. బన్సల్ అత్యంత ప్రభావంతమైన ఓపెన్ఏఐ రీసెర్చర్ అని ‘టెక్ క్రంచ్’ అనే టెక్ డైలీ పేర్కొంది. మేథ్స్, స్టాటిక్స్, కంప్యూటర్ సైన్స్‌లో నేపథ్యంలో ఆయన పరిశోధనలు చేస్తుంటారు. నేచురల్ లాంగేజ్ ప్రాసిసింగ్ (NLP), డీప్ లెర్నింగ్, మెటా-లెర్నింగ్ వంటి రంగాలలో కూడా ఆయన విస్తృత పరిశోధనలు చేశారు. మసాచుసెట్స్ అమ్హెర్స్ట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేశారు. అదే విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ కూడా పూర్తి చేశారు.
Read Also- Ponguleti Srinivas Reddy: ప్రభుత్వ పథకాలు పేదలకు అందాలి.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
తొలి జాబ్ ఓపెన్ఏఐలోనే
తన అకడమిక్ సంవత్సరాల్లోనే ఐఐఎస్‌సీ బెంగళూరు, ఫేస్‌బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్‌లలొ రీసెర్చ్ ఇంటర్న్‌షిప్‌లు చేశారు. 2017లో గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయంలో ఓపెన్ఏఐలో కూడా 4 నెలలు ఇంటర్న్‌షిప్ చేశారు. ఇంటర్న్‌షిప్‌లు పూర్తయిన తర్వాత, తొలి ఉద్యోగం ఓపెన్ఏఐలోనే చేశారు. 2022 జనవరిలో టెక్నికల్ స్టాఫ్ ఎంప్లాయిగా చేరారు. ఆ సమయంలో ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకుడు ఇలియా సుట్స్‌కేవర్‌తో కలిసి రీన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ (RL), రీజనింగ్-ఫోకస్డ్ ఫ్రాంటియర్ రీసెర్చ్‌పై విస్తృతంగా పనిచేశారు. ‘01’ అని పిలిచే మోడల్ సహ స్థాపకుడిగానూ బన్సల్ ఉన్నారని ఆయన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ద్వారా వెల్లడైంది. అయితే, ఇంతకుమించి వివరాలు రాలేదు.