Nara Lokesh: టీడీపీ యువనేత, యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ నారా లోకేష్‌పై కుట్ర జరుగుతోందా? యువనేతను అప్రతిష్టపాలు చేయడానికి కొందరు పన్నాగం చేస్తున్నారా? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అక్షరాలా నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే అసలు ఆయనకు ఎలాంటి సంబంధం లేని విషయాల్లో పదే పదే పేరు ప్రస్తావించడంతో లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. దీంతో ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. తమ అభిమాన నేతకు వస్తున్న ఆదరణను తట్టుకోలేకపోతున్నారని.. మంచి చేస్తుంటే ఇంత కడుపు మంటా? అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది? లోకేష్‌పై జరుగుతున్న కుట్ర ఏమిటనే సంచలన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం వచ్చేయండి..!
Read Also- Infosys: టాయిలెట్‌కు వెళ్లిన యువతి.. నిమిషాల్లోనే అరుపులు.. ఫోన్ చెక్ చేయగా?
ఏం జరుగుతోంది?
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మరణించిన సంగతి తెలిసిందే. తొలుత జగన్ కాన్వాయ్‌లోని ఢీకొన్నదని.. ఆ తర్వాత జగన్ కారు కిందేపడి చనిపోయాడని గట్టిగానే హడావుడి జరిగింది. అయితే ఆ వీడియో ఏదో తేడా కొడుతుండటంతో ఏది నిజమో.. ఏది అబద్ధమో తేల్చుకోలేని పరిస్థితి. ఈ ఘటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెను సంచలనమే అయ్యింది. ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదు చేయగా.. జగన్‌ను ఏ2గా చేర్చారు. ఈ వివాదం సద్దుమణిగింది అనుకునే సమయంలో ఊహించని ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో అసలు ఈ కేసు ఎటు నుంచి ఎక్కడికి వెళ్తోందో అర్థం కాని పరిస్థితి. సింగయ్య భార్య లూర్దు మేరీ చేసిన చేసిన కామెంట్స్ పెను సంచలనాలకు దారితీసింది. బుధవారం నాడు చీలి సింగయ్య కుటుంబ సభ్యులు వైఎస్ జగన్‌ను కలిశారు. సింగయ్య కుటుంబానికి ఇప్పటికే వైసీపీ తరపున ఇప్పటికే రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేసింది. ఇవాళ నేరుగా జగన్‌ను కలవగా.. సింగయ్య కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది కానీ, తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికొచ్చిన తర్వాత మేరీ మాట్లాడిన మాటలతో ఒక్కసారిగా సీన్ మొత్తం మారిపోయింది.
లోకేష్‌కు సంబంధమేంటి?
‘ నా భర్త సింగయ్య మరణంపై అనుమానాలున్నాయి. అంబులెన్సులో ఏదో జరిగినట్ల అనిపిస్తోంది. జగనన్న మా ప్రాంతానికి వస్తున్నారని తెలియగానే ఆయన్ను చూడడానికి మేమంతా వెళ్ళాం. పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో, మేము కాస్త దూరంలోనే ఉండిపోయాం. కాసేపటి తర్వాత నా భర్తకు యాక్సిడెంట్ జరిగింది అని ఎవరో ఫోన్ చేస్తే తెలిసింది. ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఆయన బాగానే ఉన్నారు. నా భర్త స్వయంగా తన పేరు, ఊరుతో పాటు, మా కుటుంబ సభ్యులందరి వివరాలు చెప్పారు. ఆ తర్వాత ఆయన్ను అంబులెన్సులో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకుని, మేము ఆస్పత్రికి వెళ్లాం. అక్కడ ఆయన చనిపోయారు. అంత వరకు బాగా ఉన్న మా ఆయన్ను, అంబులెన్సులో ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత ఎలా చనిపోయారు? అందుకే ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్ళే సమయంలో అంబులెన్స్‌లో ఏమైనా చేశారా? అని అనుమానం వస్తోంది. దీనిపై నిజాలు తేలాలి. మా ఆయన చనిపోయిన తర్వాత మా ఇంటికి పోలీసులు వచ్చి యాక్సిడెంట్ వీడియోలు చూపారు. ఆ తర్వాత దాదాపు 50 మంది టీడీపీ మనుషులు కూడా మా ఇంటికి వచ్చి.. లోకేష్ పంపారు, మేం కూడా మీ కులస్తులం, ఎస్సీలమే అని చెప్పారు. ఇంకా ఏవేవో మాట్లాడి ప్రలోభపెట్టాలని చూశారు. అందుకే మా ఆయన మరణంపై మాకు అనుమానాలు వస్తున్నాయి. ప్రమాదం తర్వాత మా ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు వైసీపీ నాయకులు సిద్ధమైతే, పోలీసులు బలవంతంగా అంబులెన్సు వచ్చే వరకు ఆపారు. ఆటో లేదా మరే వాహనంలో సింగయ్యను ఆస్పత్రికి తీసుకుపోవద్దని, కచ్చితంగా అంబులెన్సులోనే తీసుకెళ్లాలని పోలీసులు బలవంతం చేశారు. అందుకే ఆ అంబులెన్సులోనే ఏదో జరిగిందని మాకు బలమైన అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు మాకు జగన్ ఎంతో భరోసా ఇచ్చారు. మా కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు’ అని లూర్దు మేరీ మీడియాకు వివరించారు.
ఎందుకిలా..?
ఘటన జరిగిన రోజు.. ఆ తర్వాత.. ఇప్పుడు మేరీ మాట్లాడిన మాటలకు చాలా తేడా ఉన్నది. అసలు పొంతనే లేదు. ఈ వాదనలను టీడీపీ తీవ్రంగా పరిగణించాల్సి ఉందని కార్యకర్తలు, అభిమానులు కోరుతున్నారు. ఇదంతా జగన్ స్క్రిప్ట్ అని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. జగన్‌ను ఈ ఘటన నుంచి గట్టెక్కించడానికి అనవసరంగా లోకేష్‌ను టార్గెట్ చేస్తున్నారని దీన్ని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతోందని వాదనలు వినిపిస్తున్నాయి. ఇదంతా వైసీపీ వ్యూహాత్మకంగా చేస్తున్నట్లుగా టీడీపీ సీనియర్లు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే.. ఈ వివాదంలోకి లోకేష్‌ను లాగడం ద్వారా వైసీపీ సేఫ్ జోన్‌లోకి వెళ్లొచ్చని, ప్రజలను గందరగోళానికి గురిచేయడానికే ఇలా చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ఎలా స్పందిస్తారో.. ఈ వివాదం ఇంకెంత దూరం పోతుందో వేచి చూడాల్సిందే మరి.
Read Also- Komalee Prasad: ఆ డ్రస్ వేసుకుంటే.. సినిమాలు మానేసినట్టేనా? హీరోయిన్ ఫైర్!