Komalee Prasad
ఎంటర్‌టైన్మెంట్

Komalee Prasad: ఆ డ్రస్ వేసుకుంటే.. సినిమాలు మానేసినట్టేనా? హీరోయిన్ ఫైర్!

Komalee Prasad: ఒక్కోసారి మనం చేసే పనులు పబ్లిక్‌లోకి వేరే విధంగా వెళతాయనే దానికి ఉదాహరణగా నిలుస్తోంది హీరోయిన్ కోమలి ప్రసాద్ (Komalee Prasad). ఇప్పుడిప్పుడే నటిగా తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న కోమలి ప్రసాద్‌పై కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తుండటంతో.. ఆమె ఫైర్ అయింది. త్వరలోనే ‘శశివదనే’ అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో.. కోమలి ప్రసాద్‌‌పై కావాలని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆమె సినిమాలు వదిలేసి, తన డాక్టర్ వృత్తిలో కొనసాగాలని నిర్ణయించుకుందంటూ వార్తలు వైరల్ చేస్తున్నారు. ఈ వార్తలను ఖండిస్తూ.. కోమలి ప్రసాద్ తాజాగా తన సోషల్ మీడియా వేదికగా అందరికీ వివరణ ఇచ్చారు. అసలింతకీ ఆమెపై ఈ వార్తలు రావడానికి కారణం ఏమిటంటే.. తాజాగా ఆమె డాక్టర్ కోటు ధరించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అంతే, ఇక సినిమాలకు గుడ్ ‌బై చెప్పేసింది. డాక్టర్‌గా స్థిరపడాలని నిర్ణయించుకుంది అంటూ ఒకటే వార్తలు. ఈ వార్తలపై ఫైర్ అయిన కోమలి ప్రసాద్..

Also Read- Shirish Reddy: రామ్ చరణ్‌ని అవమానించడమా.. అది నా జన్మలో జరగదు!

‘‘అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అయ్యానని, నటనకు పూర్తిగా దూరం అయ్యానంటూ నాపై అసత్య ప్రచారాలు, తప్పుదోవ పట్టించే వార్తలను కొందరు ప్రచురించడం నా దృష్టికి వచ్చింది. ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఈ రూమర్లను నిజం అనుకుని ప్రచారం చేస్తున్నాయి. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని అందరికీ ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేయాలని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ఎంతో కష్టపడి.. సినిమాల్లో కెరీర్‌ను కొనసాగిస్తూ ఈ స్థాయి వరకు వచ్చాను. ఆ మహాశివుని ఆశీస్సులతో నా కెరీర్‌ చక్కగానే ముందుకు సాగుతోంది. కానీ, ఎవరూ పుట్టించారో, ఏమో నాపై అసత్య ప్రచారాలు చేయడం మొదలు పెట్టారు.

Also Read- Harshali Malhotra: ‘అఖండ 2’లో ‘బజరంగీ భాయిజాన్‌’ చైల్డ్ ఆర్టిస్ట్‌.. ఇప్పుడెలా ఉందో చూశారా?

నాలో, నా శ్రేయోభిలాషులలో అనవసరమైన ఆందోళనలను రేకెత్తించేలా అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇలా తప్పుదారి పట్టించే సమాచారం వ్యాప్తి చెందకూడదనే వెంటనే నేను రియాక్ట్ అవుతున్నాను. అందుకే అందరికీ స్పష్టతను ఇవ్వాలని ఈ పోస్ట్ చేస్తున్నాను. ఆ విధే నన్ను ఈ మార్గంలోకి తీసుకు వచ్చిందని నేను భావిస్తుంటాను. ఇప్పుడందరికీ చెబుతున్నాను.. చివరి శ్వాస వరకు నటిగా నా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈ జర్నీలో నా వెన్నెంటే ఉన్న నా శ్రేయోభిలాషులందరికీ, నా కంటే నన్ను ఎక్కువగా నమ్మిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ప్రస్తుతం నా స్క్రిప్ట్‌లను జాగ్రత్తగా ఎంచుకునే పనిలో నిమగ్నమై ఉన్నాను. త్వరలోనే కొత్త ప్రకటనలతో అందరినీ గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నాను’’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

">

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్