Harshali Malhotra: ‘అఖండ 2’లో ‘బజరంగీ భాయిజాన్‌’ చైల్డ్ ఆర్టిస్ట్‌..
Harshaali Malhotra
ఎంటర్‌టైన్‌మెంట్

Harshali Malhotra: ‘అఖండ 2’లో ‘బజరంగీ భాయిజాన్‌’ చైల్డ్ ఆర్టిస్ట్‌.. ఇప్పుడెలా ఉందో చూశారా?

Harshali Malhotra: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న హైలీ యాంటిసిపేటెడ్ చిత్రం ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Thandavam). ఈ సినిమాతో బాలయ్య, బోయపాటి జంట నాల్గవ సారి కొలాబరేట్ అయ్యారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇంతకు ముందు వచ్చిన ‘అఖండ’ చిత్రానికి ఇది సీక్వెల్. ఈ హై-ఆక్టేన్ సీక్వెల్ కథ, స్కేల్, నిర్మాణం, సాంకేతిక నైపుణ్యం.. అన్నీ కూడా ‘అఖండ’ను మించి ఉంటాయని మొదటి నుంచి మేకర్స్ చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అత్యంత భారీ స్థాయిలో, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలయ్య, బోయపాటిల మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాను బాలయ్య కుమార్తె ఎం. తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్‌ని మేకర్స్ రివీల్ చేశారు.

Also Read- Dil Raju: నితిన్‌ను అల్లు అర్జున్‌తో పోల్చానని.. నెగిటివ్‌గా చూడొద్దు

ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న హర్షాలీ మల్హోత్రా (Harshaali Malhotra) పాత్రని జననిగా మేకర్స్ పరిచయం చేశారు. ఎవరీ హర్షాలీ మల్హోత్రా అని అనుకుంటున్నారు కదా! బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా, మన తెలుగు రచయిత వి. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ‘బజరంగీ భాయిజాన్‌’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించిన పాపే ఈ హర్షాలీ మల్హోత్రా. ఇప్పుడు ఛైల్డ్ ఆర్టిస్ట్ కాదు.. అమ్మాయి పెద్దదై హీరోయిన్ మెటీరియల్‌గా మారింది. ఈ భామని ‘అఖండ 2’తో టాలీవుడ్‌‌కి పరిచయం చేస్తున్నారు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. తాజాగా ఈ సినిమాలోని ఆమె పాత్రను పరిచయం చేస్తూ, ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్‌లో హర్షాలీ మల్హోత్రా సాంప్రదాయ చీరలో.. చక్కని చిరునవ్వు నవ్వుతూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఆమె పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని, కథలో కీలకమైన పాత్ర ఆమె చేస్తుందని మేకర్స్ చెబుతున్నారు. మరి బోయపాటి ఆమె పాత్రని ఎలా డిజైన్ చేశారో తెలియాలంటే మాత్రం.. సెప్టెంబర్ 25 వరకు వెయిట్ చేయాల్సిందే.

Also Read- Niharika Konidela: నిహారిక కొణిదెల నిర్మించే రెండో సినిమాకు క్లాప్.. వివరాలివే!

ఇక ఇటీవల బాలయ్య పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేసిన టీజర్ నేషనల్ వైడ్‌గా ట్రెమండస్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ టీజర్‌లో నటసింహం బాలయ్య మునుపెన్నడూ కనిపించని అవతార్‌లో కనిపించి, అందరికీ ట్రీట్ ఇచ్చారు. టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆది పినిశెట్టి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. టాలెంటెడ్ టెక్నీషీయన్స్ పని చేస్తున్న ఈ చిత్రానికి మరోసారి ఎస్. థమన్ సంగీతం హైలైట్ కాబోతుందనే విషయం టీజర్‌తో క్లారిటీ ఇచ్చేశారు. సి రాంప్రసాద్ డీవోపీగా, తమ్మిరాజు ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Harshaali Malhotra Akhanda 2
Harshaali Malhotra Akhanda 2

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!

Akhanda2: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు పొందిన బాలయ్య ‘అఖండ 2 తాండవం’..