Fire Accident Incident: ప్రపంచ దేశాల్లో భారత్ కు విశిష్టమైన స్థానం ఉంది. ఇక్కడ ఎన్నో మతాలు, కులాలు ఉన్నప్పటికీ ప్రజలు ఐక్యమత్యంతో జీవిస్తుంటారు. ఏ కష్టం వచ్చినా ఇరుగుపొరుగు వారు వెంటనే సాయానికి వస్తారు. తాము ఉన్నమంటూ భుజం తట్టి భరోసా ఇస్తుంటారు. అయితే విదేశాల్లో పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నం. అక్కడి మనుషులు ఒకరితో ఒకరు సంబంధం లేనట్లు వ్యవహరిస్తుంటారు. ఈ క్రమంలోనే అమెరికాలోని భారతీయుడికి చేదు అనుభవం ఎదురైంది. పాశ్చాత్య సమాజ పోకడలకు అది అద్దం పడుతోంది.
వివరాల్లోకి వెళ్తే..
సాధారణంగా ఏదైనా ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగితే చుట్టు పక్కల వెంటనే అప్రమత్తమవుతారు. ప్రమాదం జరిగిన ఇంట్లో వారిని రక్షించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తారు. కానీ యూఎస్ అలాంటిదేది జరగకపోవడం చూసి భారత్ కు చెందిన నితీశ్ అద్వితి (Nitish Advitiy) అనే వ్యక్తి ఆశ్చర్యపోయారు. తన పొరుగు ఇంట్లో అగ్ని ప్రమాదం జరగ్గా.. పక్క ఇళ్లకు చెందిన ఒక్కరంటే ఒకరు స్పందించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘యూఎస్ లోని పొరుగువారు ఒకరినొకరు పట్టించుకోరు’ తను పోస్ట్ చేసిన వీడియోకు నితీశ్ క్యాప్షన్ పెట్టారు.
నెటిజన్ల స్పందన ఇదే
నితీశ్ పోస్ చేసిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. భారత్ లోని పౌర సమాజం.. అమెరికా కంటే ఎంతో బలంగా ఉందని చెప్పారు. భారత్ లో తోటి వారి పట్ల ఉండే గౌరవ మర్యాదలు అమెరికాలో ఉండవని కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం అమెరికా సంస్కృతి (American Socity) సమర్థిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అమెరికాలో గోప్యత ఎక్కువని.. పక్కవారి విషయాల్లో తలదూర్చడానికి ఇష్టపడని చెబుతున్నారు. మరోవైపు అక్కడి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉందని.. సకాలంలో ఫైర్ సిబ్బంది వచ్చి రెస్క్యూ చేస్తారని వారు పక్కింటి వారు భావిస్తూ ఉండవచ్చని చెప్పారు.
Also Read: China Robo Football League: మైదానంలో తలపడ్డ రోబోలు.. బంతితో విరోచిత పోరాటం.. విజేత ఎవరంటే?
సర్వేలో ఏం చెబుతుంటే!
ఇదిలా ఉంటే పొరుగింటి వారితో అమెరికన్ల రిలేషన్ కు సంబంధించి నిర్వహించిన అధ్యయనంలో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. దాదాపు 75% మంది అమెరికన్లు పొరుగు వారిని ఇష్టపడరని పరిశోధనల్లో తేలింది. వాస్తవానికి 10 మందిలో ఒకరి కంటే ఎక్కువ మంది అమెరికన్లు పొరుగువారిని ఇష్టపడట్లేదని స్పష్టమైంది.