Ranga Reddy District Tahsildar: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల తహసిల్దార్ నాగార్జున రైతు నుంచి లంచం తీసుకుంటూ (ACB) ఏసీబీకి చిక్కారు. మండలంలోని అంతారం గ్రామానికి చెందిన మల్లయ్య (Mallaiah) అనే రైతు కుటుంబ సభ్యులకు తమ పూర్వీకుల నుండి వ్యవసాయ పొలం సంక్రమించింది. ఆ పొలాన్ని తమ నల్గురు సోదరుల పేర విరాసత్ చేయాలని మండల తహసిల్దార్ కార్యాలయంలో ధరఖాస్తు చేసుకున్నారు. విరాసత్ చేయాడానికి తహసిల్దార్ నాగార్జున కొంత మొత్తం లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Also Read: Hydraa: పరికరాలతో రంగంలోకి దిగిన మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు!
విషయాన్ని రైతు మల్లయ్య (Mallaiah) ఏసీబీ (ACB) అదికారుల దృష్టికి తీసుకెల్లారు. రైతు మల్లయ్య (Mallaiah) మంగళవారం తహసిల్దార్ కార్యాలయానికి వెళ్ళారు. అటెండర్ (Yadagiri) యాదగిరికి రూ.10 వేలు లంచం డబ్బులు ఇస్తుండగా అక్కడే మాటు వేసినన ఏసీబీ (ACB) అదికారులు రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు. ఏ-1 తహసిల్దార్ నాగార్జున, (Tahsildar Nagarjuna) ఏ-2 అటెండర్ యాదగిరి (Yadagiri) లను అరెస్ట్ చేసి ఏసీబీ (ACB కోర్టులో హాజరుపర్చారు. సంవత్సర కాలంగా మండల తహసిల్దార్ గా విదులు నిర్వహిస్తున్న నాగార్జున కార్యాలయంలో ప్రతి పనికి ఒక రేటు నిర్నయించి రైతుల వద్ద నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేసేవాడని ఆరోపణలు ఉన్నాయి. రైతుల ఉసురు తగిలి ఏసిబి (ACB అదికారులకు పట్టుబడడంతో పాపం పండిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Savita Pradhan: 16 ఏళ్లకే పెళ్లి.. అత్తింటి వేధింపులు.. కట్ చేస్తే గొప్ప ఐఏఎస్ ఆఫీసర్..!