Savita Pradhan (Image Source: Twitter)
Viral, లేటెస్ట్ న్యూస్

Savita Pradhan: 16 ఏళ్లకే పెళ్లి.. అత్తింటి వేధింపులు.. కట్ చేస్తే గొప్ప ఐఏఎస్ ఆఫీసర్..!

Savita Pradhan: దశాబ్దాల కాలంగా మహిళలను వెంటాడుతున్న సమస్యల్లో అత్తింటి వేధింపులు ఒకటి. పుట్టింటి నుంచి ఎన్నో ఆశలతో మెట్టినింటిలో అడుగుపెట్టిన కొందరు స్త్రీలు.. అక్కడ నరకం చూస్తున్నారు. వరకట్న వేధింపులు.. భర్త, అత్త, తోటి కోడల సూటిపోటి మాటలు పడలేక పలువురు వివాహితలు ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాయి. అయితే కొందరి స్త్రీలలాగే ఓ మహిళను సైతం అత్తింటి వేధింపులు వచ్చాయి. దీంతో ఆత్మహత్య కూడా చేసుకోవాలని భావించింది. చివరి నిమిషంలో తన ఆలోచన విరమించుకున్న ఆమె.. మెుక్కవోని దీక్షతో ఏకంగా ఐఏఎస్ అయ్యింది. అంతేకాదు విధి నిర్వహణలో ఉత్తమమైన అధికారిణిగా కీర్తి సంపాదించింది. ఇంతకీ ఆమె ఎవరు? ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటీ? ఆమె జీవితంలో ప్రేరణగా తీసుకోవాల్సిన అంశాలేంటి? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.

గిరిజన ఫ్యామిలీలో జన్మించి..
మధ్యప్రదేశ్ లోని మందై గ్రామంలో ఓ గిరిజన కుటుంబంలో జన్మంచిన సవితా ప్రధాన్ ఎన్నో కష్టాలకు ఓర్చి.. కలెక్టర్ గా మారారు. ఆమె తన జీవితంలో ఆకలి దప్పికలు, గృహహింస వంటి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని తన ప్రతిభతో పలువురు మహిళలకు ఆదర్శంగా నిలిచారు. సవిత తల్లిదండ్రులకు మెుత్తం ఏడుగురు సంతానం. ఆమె కుటుంబం బీడీ ఆకులు ఏరుతూ, కూలీ చేసుకుంటూ జీవనం సాగించేంది. సవితను చదివించే స్థోమత తల్లిదండ్రులకు లేకపోయినప్పటికీ పాఠశాలలో ఇచ్చే రూ.75 స్కాలర్ షిప్ డబ్బులు, ఒకపూట జావ, జత యూనిఫామ్ కోసం ఆమెను స్కూల్లో తల్లిదండ్రులు చేర్చారు. ఈ క్రమంలోనే కష్టపడి పది పాసైన ఆమె.. గ్రామంలో టెన్త్ పూర్తి చేసిన తొలి బాలికగా నిలిచారు.

16 ఏళ్లకే పెళ్లి..
బాల్యంలో సైన్స్ పై ఎక్కువ ఆసక్తి ఉండటంతో డాక్టర్ కావాలని సవిత ప్రధాన్ కలలు కన్నారు. అయితే 16 ఏళ్ల వయసులో ఓ సంపన్న కుటుంబం నుంచి పెళ్లి ప్రతిపాదన రావడంతో ఆమె ఆశలన్నీ తలకిందులు అయ్యాయి. వివాహం తర్వాత కవితకు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. అత్తింటిలో అనేక ఆంక్షలు ఆమెను చుట్టుముట్టాయి. కుటుంబ సభ్యులు అందరూ భోజనం చేసిన తర్వాత చివర్లో తినాల్సి రావడం, తన వంతు వచ్చేసరికి ఆహారం లేకపోవడం వంటి కష్టాలు ఎదుర్కొన్నారు. ఓ దిశలో బాత్రూమ్ లో రహస్యంగా భోజనం చేయాల్సిన పరిస్థితులు ఎదురైనట్లు ఆమె చెప్పుకొచ్చారు. పెద్దగా నవ్వకూడదని, బిగ్గరగా మాట్లాడొద్దని.. ఇలా ఏదోక అత్తింటి వారు పెడుతుండటంతో ఆమె తట్టుకోలేకపోయింది. భర్త సైతం తోటి కుటుంబ సభ్యులకు వంతపాడుతూ సవితను దుర్భాషలాడుతూ ఉండేవాడు. శారీరకంగా హింసించడంతో పాటు చంపేస్తానని పలుమార్లు బెదిరించడం కూడా చేశాడు.

ఆత్మహత్యకు యత్నం..
అత్తింటి వేధింపులు భరించలేని సవిత.. ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయానికి కూడా వచ్చారు. ఆమె సీలింగ్ ఫ్యాన్ కు తాడు కట్టుకుంటుండగా తన అత్త కిటికీ గుండా చూశారని సవిత ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఆమె అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదని పేర్కొన్నారు. ఈ చర్యతో సవితకు ఓ విషయం బాగా అర్థమైంది. తన శ్రేయస్సు, క్షేమం పట్ల శ్రద్ధ చూపని వ్యక్తుల కోసం తన జీవితాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదని భావించారు. ఇద్దరు పిల్లలు, చేతిలో రూ. 2700తో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. చిన్నపాటి బ్యూటీ సెలూన్ పెట్టడంతో పాటు చిన్న పిల్లలకు ట్యూషన్ చెబుతూ అవిశ్రాంతంగా శ్రమించారు. ఈ కష్టతర ప్రయాణంలోనే ఆమె పబ్లిక్ అడ్మినిస్టేషన్ లో బీఏ, ఎంఏ చేశారు. భోపాల్‌లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయంలో పరీక్షలలో అగ్రస్థానంలో నిలిచి రాణించారు.

Also Read: Balkampet Yellamma Kalyanam: అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం!

యూపీఎస్సీ సాధించి.. ప్రేరణగా నిలిచి
ఈ క్రమంలోనే చిన్న జాబ్ వస్తే చాలని న్యూస్ పేపర్లు తిరగేయడం ప్రారంభించారు సవిత ప్రధాన్. ఈ క్రమంలోనే ఆమెకు యూపీఎస్సీ నోటిఫికేషన్ కనిపించింది. ఎంతకష్టపడి చదివైనా దానిని సాధించాలని ఆ క్షణంలోనే సవిత నిర్ణయించుకున్నారు. రేయింబవళ్లు శ్రమించి.. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. 24 ఏళ్ల వయసులోనే చీఫ్ మున్సిపల్ ఆఫీసర్ అయ్యారు. ప్రస్తుతం ఆమె గ్వాలియర్, చంబల్ కు అర్బన్ అడ్మినిస్టేషన్ జాయింట్ డైరెక్టర్ హోదాలో కొనసాగుతున్నారు. తనలా మౌనంగా బాధలు భరించే ఆడపిల్లలు తమ ప్రతిభను నమ్ముకోవాలని సవిత ప్రధాన్ సూచిస్తున్నారు. వారిలో ధైర్యం, స్థైర్యం నింపేందుకు హిమ్మత్‌ వాలీ లడ్కియా (బ్రేవ్‌ గర్ల్స్‌)పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ ను సైతం ఆమె ప్రారంభించారు. తన జీవితంలో ఎదుర్కొన్న బాధలు, వాటి నుంచి బయటపడిన తీరును ఈ తరం అమ్మాయిలకు తెలియజేస్తూ వారిలో ప్రేరణగా నిలుస్తున్నారు.

Also Read: Bhatti Vikramarka: రెసిడెన్షియల్ పాఠశాల భవనాలపై సోలార్ ప్యానల్స్

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?