Bhatti Vikramarka: సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో అధికారుల పర్యటన, సమీక్షలపై పకడ్బందీ క్యాలెండర్ రూపొందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు(Bhatti Vikramarka) సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Adluri Laxman Kumar)తో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏ అధికారి, ఏ రోజు పర్యటించారు? పరిశీలించిన అంశాలపై ఏ మేరకు పరిష్కారం లభించింది? తదితర అంశాలపై ఎప్పటికప్పుడు నివేదికలు రూపొందించాలని డిప్యూటీ సీఎం సూచించారు. ఈ పర్యటన కార్యక్రమం నిరంతరం సాగాలని, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలను సైతం పర్యటనకు ఆహ్వానించాలని అధికారులకు సూచించారు.
యజమానుల వివరాలతో ఒక నివేదిక
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని 40 శాతం డైట్, 200 శాతం కాస్మోటిక్ ఛార్జీల(Cosmetic Charges)ను పెంచామన్నారు. డాక్టర్ల సూచన మేరకు పకడ్బందీ మెనూ ఖరారు చేశామన్నారు. ఈమెనూ అన్ని సంక్షేమ హాస్టళ్లు(Hostals), గురుకులాల్లో ప్రముఖంగా కనిపించేలా బ్యానర్లు తయారు చేయాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. వసతి గృహాల అద్దె భవనాల్లో వసతులు ఎలా ఉన్నాయి? భవనాలు, యజమానుల వివరాలతో ఒక నివేదిక ఇవ్వాలన్నారు. అన్ని వసతి గృహాల్లో దోమతెరలు ఏర్పాటు చేయాలన్నారు. రన్నింగ్ వాటర్ సప్లైలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలిపారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో ఉన్న విద్యార్థులందరికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి హెల్త్ కార్డు లు రూపొందించాలని డిప్యూటీ సీఎం సూచించారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా మెడికల్ అండ్ హెల్త్ అధికారులను సమన్వయం చేసుకొని హెల్త్ కార్డు లు రూపొందించే కార్యక్రమం వేయంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.
Also Read: MLC Kavitha: తెలంగాణ జాగృతి దూకుడు.. పలు దేశాల అధ్యక్షుల నియామకం
భవనాలన్నిటి పైన సోలార్ ప్యానల్స్
విద్యార్థులకు ఏదైనా అనారోగ్యం ఏర్పడితే ఆన్లైన్ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు కార్పొరేట్ ఆసుపత్రులు సంసిద్ధంగా ఉన్నాయని వారి సేవలను వినియోగించుకోవాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. రెసిడెన్షియల్ పాఠశాలల భవనాలన్నిటి పైన సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ అవసరాలు తీర్చుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు తెలిపారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అమలు తీరు, సొసైటీల వారిగా సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్(Center of Excellence) ప్రగతిపై సమావేశంలో సమీక్షించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిని, సాంఘిక సంక్షేమ శాఖ డిడి క్షితిజ, మైనార్టీ వెల్ఫేర్ కమిషనర్ షఫీ, బీసీ గురుకుల సెక్రెటరీ సైదులు, ఎస్టి గురుకుల సెక్రటరీ సీతాలక్ష్మి, ట్రైబల్ వెల్ఫేర్ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Raja Singh resigned: రాజాసింగ్ క్రమశిక్షణారాహిత్యం.. పలువురు నేతల ప్రశ్నలు