MLC Kavitha (imagcredit:twitter)
తెలంగాణ

MLC Kavitha: తెలంగాణ జాగృతి దూకుడు.. పలు దేశాల అధ్యక్షుల నియామకం

MLC Kavitha: తెలంగాణ జాగృతి వివిధ దేశాల అధ్యక్షులను జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) నియమించారు. నియామక ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండి రాష్ట్ర సాధన అనంతరం తెలంగాణ అభ్యున్నతికి తెలంగాణ జాగృతి(Telangana Jagruthi) అంకితమైనదన్నారు. అదే స్ఫూర్తితో సమాజంలోని అన్ని వర్గాలవారికి చేరువ కావడానికి తెలంగాణ జాగృతి కార్యక్రమాలను వివిధ రంగాలలో మరింత సమర్థవంతంగా నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. పలు దేశాలలోని శాఖలతో ప్రవాస తెలంగాణ బిడ్దల సంక్షేమానికి, సాంస్కృతిక వికాసానికి తెలంగాణ జాగృతి కృషి చేస్తున్నదన్నారు. బాధ్యతలు అప్పగించిన వారు తెలంగాణ అభ్యున్నతికి, ఆయా దేశాలలో ఉన్న తెలంగాణీయుల సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు.

న్యూజిలాండ్ అధ్యక్షురాలిగా అరుణ జ్యోతి

జాగృతి న్యూజిలాండ్ అధ్యక్షురాలిగా అరుణ జ్యోతి ముద్దం, గల్ఫ్ అధ్యక్షుడిగా చెల్లంశెట్టి హరిప్రసాద్, ఖతార్ అధ్యక్షురాలిగా మూకల ప్రవీణలక్ష్మి, అడ్వైజర్‌గా నందిని అబ్బగోని, యూఏఈ అధ్యక్షుడిగా పీచర వెంకటేశ్వర రావు, ప్రధాన కార్యదర్శిగా శేఖర్ గౌడ్, కువైట్ అధ్యక్షుడిగా మర్క ప్రమోద్ కుమార్, సౌదీ అరేబియా అధ్యక్షుడిగా మహమ్మద్ మొజ్జం అలీ ఇఫ్తెకార్, ఒమన్ అధ్యక్షుడిగా గుండు రాజేందర్ నేత, యునైటెడ్ కింగ్ డమ్‌ అధ్యక్షుడిగా సుమన్ రావు బల్మూరి నియమితులయ్యారు.

ఇటలీ అధ్యక్షుడిగా తానింకి కిశోర్ యాదవ్, ఫిన్లాండ్ – ఐరెడ్డి సందీప్ రెడ్డి, పోర్చుగల్ ప్రకాశ్ పొన్నకంటి, మాల్టా పింటు ఘోష్, కెన్యా – స్వప్న రెడ్డి గంట్ల, ఇరాక్ మరియు కుర్దిస్తాన్ – అధ్యక్షుడిగా మహ్మద్ సల్మాన్ ఖాన్, ప్రధాన కార్యదర్శి నాయక్వార్ రాం చందర్, మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా శ్రీనివాస్ సుల్గేను నియమించారు. ఈ నియామకాలన్నీ వెంటనే అమల్లోకి వస్తాయని, త్వరలోనే ఆయా దేశాల్లో పూర్తి స్థాయి కమిటీలను ప్రకటిస్తామని కవిత వెల్లడించారు.

Also Read: Phone Tapping Case: ఫోన్​ ట్యాపింగ్ కేసులో తవ్విన కొద్దీ సంచలనాలు

 

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?