Ramachandra Rao: పార్టీలో కొత్త పాత పంచాయతీలు లేవు
Ramachandra Rao (magcredit:swetcha)
Political News

Ramachandra Rao: పార్టీలో కొత్త పాత పంచాయతీలు లేవు.. రామచందర్‌ రావు

Ramachandra Rao: తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెస్తానని, గోల్కొండ కోట(Golconda Fort)పై కాషాయ జెండాను ఎగుర వేద్దామని బీజేపీ నూతన సారథి ఎన్‌.రామచందర్‌ రావు(N. Ramchendar Rao) అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండలం మన్నెగూడలో బీజేపీ సభను నిర్వహించారు. ఈ సభలో బీజేపీ కేంద్ర ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే(Shobha Karandlaje) రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్‌.రామచందర్‌ రావు నియామకాన్ని అధికారికంగా ప్రకటించి నియామక పత్రాన్ని అందజేశారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి(Kishan Reddy) నుంచి రామచందర్‌ రావు బాధ్యతలు స్వీకరించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ

ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావు మాట్లాడుతూ 14 కోట్ల సభ్యత్వాలతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ తరపున రాష్ట్ర శాఖకు అధ్యక్షునిగా పనిచేయడం గర్వంగా ఉందన్నారు. యుద్దానికి తాను ఎప్పుడూ సిద్దంగానే ఉంటానన్నారు. తెలంగాణ ప్రజలంతా బీజేపీ(BJP) వైపు చూస్తున్నారని, పంచాయతీ నుంచి పార్లమెంట్‌ వరకు అన్ని ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. పార్టీలో కొత్త, పాత పంచాయతీలు లేవని పార్టీలో చేరిన వారంతా బీజేపీ కుటుంబ సభ్యులేనన్నారు. అందరితో కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్(Congress), బీఆర్‌ఎస్(BRS)లు ఫేక్‌ న్యూస్(Fake News) ను ట్రోల్‌ చేస్తున్నాయని ఆ రెండు పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాట్సాప్‌ వర్శిటీలు పెట్టుకుని ఫేక్‌ న్యూస్ ను ట్రోలింగ్‌ చేస్తున్నాయని, ఫేక్‌ న్యూస్ సూత్రధారులను బోనులో నిలబెట్టేందుకు వెనుకాడనన్నారు. అందరూ అనుకుంటున్నట్లుగా తాను సౌమ్యుడిని కాదన్నారు. విద్యార్థుల సమస్యలపై పోరాడి 14 సార్లు జైలుకు వెళ్లొచ్చానని, నక్సలైట్లను అరెస్టు చేయాలని చేసిన పోరాటంలో తన చేయి విరిగిందన్నారు.

Also Read: GHMC Commissioner: గ్రేటర్ హైదరాబాద్‌లో స్పెషల్ డ్రైవ్‌.. ఫోకస్ పెంచిన జీహెచ్ఎంసీ

హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోలేదు: శోభా కరంద్లాజే

బీజేపీ నూతన అధ్యక్షుడు రామచందర్‌ రావు 40 ఏళ్లుగా పార్టీకోసం కష్టపడి పనిచేస్తున్నారని, ఏనాడూ పదవులను ఆశించలేదని కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే(Shobha Karandlaje) అన్నారు. రాష్ట్రంలో రేవంత్‌(Revanth) సర్కారు ఏడాదిన్నర కాలంలోనే అనేక విమర్శలను మూటగట్టుకున్నదని, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్(Congrss) నిలబెట్టుకోలేక పోయిందని విమర్శించారు. గత బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వంలోనూ ప్రజలు నారాజ్‌ కావడంతోనే ఆ పార్టీని ప్రజలు ఇంటికి వెళ్లగొట్టారని ఎద్దేవ చేశారు. ప్రస్తుతం తెలంగాణ(Telangana) సమాజం అంతా బీజేపీ వైపు చూస్తోందని, 2028 ఎన్నికల్లో రాష్ట్రంలో బిజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జి.కిషన్‌ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్‌(Bandi Sanjay), రాజ్యసభ్య సభ్యుడు డాక్టర్‌ లక్ష్మణ్‌(MP Laxman), బీజేపీ రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.

Also Read: GHMC Commissioner: జీహెచ్ఎంసీలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం

 

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క