GHMC Commissioner: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు అభివృద్ది, అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీ(GHMC) కమిషనర్ ఆర్.వి. కర్ణన్(RV.Karnan) కేవలం 60 రోజుల వ్యవధిలోనే జీహెచ్ఎంసీలో ఏం జరుగుతుంది? కమిషనర్ గా కర్ణన్ బాధ్యతలు చేపట్టి నేటికి 60 రోజులు పూర్తికానుంది. ఈ తక్కువ వ్యవధిలోనే కమిషనర్ ఏం చేస్తే జీహెచ్ఎంసీలో ఆర్థికంగా, పరిపాలనపరంగా కష్టాలు గట్టెక్కుతాయన్న విషయాన్ని చదివేశారు. ఇప్పటి వరకు కనిష్టంగా మూడు నెలల నుంచి నాలుగేళ్ల గడువుతో కమిషనర్ గా విధులు నిర్వర్తించిన ఐఏఎస్(IAS) ఆఫీసర్లు చేయని విధంగా కమిషనర్ కర్ణన్ అతి తక్కువ కాలంలోనే తనదైన మార్కు పాలన ముద్ర వేశారు. నిత్యం కుప్పలుగా ఫిర్యాదులొచ్చే టౌన్ ప్లానింగ్(Toun Planing) విభాగంలో పదుల సంఖ్యలో అధికారులకు స్థానచలనం కల్గించిన కమిషనర్ కర్ణన్ క్రమంగా జీహెచ్ఎంసీ(GHMC)పై పడుతున్న ఆర్థిక భారాన్ని కూడా తగ్గించే దిశగా చర్యలు మొదలు పెట్టారు.
సరిపోయే పోస్టింగ్ లేకపోయినా
ఒక వైపు ప్రక్షాళన మరో వైపు జీహెచ్ఎంసీని ఆర్థికంగా గాడీన పెట్టేందుకు సమాంతరంగా సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు కమిషనర్లుగా వ్యవహారించిన ఆఫీసర్లంతా తాము గతంలో పని చేసిన జిల్లాలో తమతో పాటు కలిసి పని చేసిన ఆఫీసర్లను వివిధ విభాగాల్లోకి రప్పించుకుని, వారికి జీహెచ్ఎంసీ(GHMC)లో సరిపోయే పోస్టింగ్ లేకపోయినా, కొత్త కొత్త పోస్టులు క్రియేట్ చేసి మరీ అకామడెట్ చేస్తూ పోయారు. ఫలితంగా గతంలో రెండు నుంచి మూడు విభాగాలను పర్యవేక్షించే అదనపు కమిషనర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతో వచ్చింది. దీంతో ఇప్పటికే మూలుగుతున్న నక్కగా తయారైన బల్దియా ఖజానాపై తాటి కాయ పడిన చందంగా అదనపు కమిషనర్ల జీతభత్యాలు, కారు, చాంబర్ ఛార్జీలు తడిసిమోపడయ్యాయి. ఏకంగా 15 మంది అదనపు కమిషనర్లు కమిషనర్ గా కర్ణన్ బాధ్యతలు తీసుకునే టైమ్ కు విధి నిర్వహణలో ఉన్నారు. గతంలో ఒక్కో అదనపు కమిషనర్ రెండు నుంచి మూడు విభాగాలను పర్యవేక్షించే పాత పద్దతిని అతి తక్కువ సమయంలో తీసుకురావటంతో కర్ణన్ సఫలీకృతులయ్యారు. ప్రస్తుతమున్న తొమ్మిది మంది అదనపు కమిషనర్ల సంఖ్యను కూడా త్వరలోనే ఆరుకు కుదించేలా కమిషనర్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
Also Read: Medical Reimbursement Bills: ప్రభుత్వ ఉద్యోగుల..పెన్షనర్లకు గుడ్ న్యూస్!
అక్రమార్కుల గుండెల్లో దడ
ఐఎస్ సదన్ డివిజన్ లోని సైదాబాద్(Sydabad) ప్రాంతంలో వేయని రోడ్డుకు బిల్లులు క్లెయిమ్ చేసి, కాజేసిన అక్రమం ఇటీవలే జీహెచ్ఎంసీ(GHMC)లో వెలుగు చూసింది. దీనిపై సమగ్ర నివేదికను తెప్పించుకున్న కమిషనర్ బిల్లులు కాజేసిన ఇద్దరు ఇంజనీర్లు, కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకున్నారు. ఓ ఇంజనీర్ ను ఏకంగా విధుల నుంచి తొలగించగా, మరో ఇంజనీర్ పై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేగాక, అదనపు కమిషనర్లలో కూడా కొందరికి రెండు విభాగాల బాధ్యతలను అప్పగిస్తూనే, పని చేయని అధికారులను గుర్తించి, వారిని సింగ్ విభాగానికే పరిమితం చేయగా, మరి కొందరికి జాయింట్ కమిషనర్ గా డిమోషన్ ఇస్తూ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఎపుడూ లేని విధంగా జీహెచ్ఎంసీలోని ఇద్దరు అదనపు కమిషనర్లను సీడీఎంఏ(CDM)కు సరెండర్ చేసేలా కమిషనర్ ఇటీవల చేపట్టిన బదిలీల ఆదేశాల్లో పేర్కొనటం ఇదే ఫస్ట్ టైమ్.
డిప్యూటీ కమిషనర్లుగా తీసుకువచ్చే ప్రయత్నం
అంతేగాక సీనియార్టీకి ప్రియార్టీనిస్తూ జీహెచ్ఎంసీలో పలు పర్యాయాలు విధులు నిర్వహించిన అదనపు కమిషనర్లకు మరింత మెరుగైన పోస్టింగ్ లిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతటితో ఆగని కమిషనర్ త్వరలోనే డిప్యూటీ కమిషనర్లకు కూడా స్థానచలనం కల్గించి, సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లను జీహెచ్ఎంసీలోకి డిప్యూటీ కమిషనర్లుగా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఇటీవలే నగరంలోని వివిధ సర్కిళ్లలో వెలుగుచూసిన బర్త్(Birth), డెత్(Derth) సర్టిఫికెట్ల అక్రమాలను దృష్టిలో పెట్టుకున్న కమిషనర్ త్వరలోనే మెడికల్ ఆఫీసర్లు, పలు సర్కిళ్లలో బర్త్, డెత్ ల రిజిస్ట్రార్ లుగా విధులు నిర్వహిస్తున్న వారిలో కొందరు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు ఇన్ ఛార్జి డిప్యూటీ కమిషనర్లుగా విధులు నిర్వహిస్తున్న వారిని తప్పించి, వారికి స్థానంలో సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లను డిప్యూటీ కమిషనర్లుగా నియమించే దిశగా కమిషనర్ కసరత్తు కొనసాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Also Read: Pakistan Floods: ప్రాణాలు కాపాడలేరా.. కొంచెమైనా సిగ్గుండాలి.. పాక్‌పై ఆ దేశ పౌరులే ఫైర్!