Medical Reimbursement Bills( image crdit: twitter)
తెలంగాణ

Medical Reimbursement Bills: ప్రభుత్వ ఉద్యోగుల..పెన్షనర్లకు గుడ్ న్యూస్!

Medical Reimbursement Bills: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త అందించింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కీలక నిర్ణయం తీసుకుని, పెండింగ్‌లో ఉన్న మొత్తం రూ. 180.38 కోట్ల మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను ఒకేసారి విడుదల చేశారు. ఈ నిర్ణయంతో 26,519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఉపశమనం లభించింది. కొన్ని రోజుల క్రితం రైతు భరోసా కింద రూ. 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఆ వెంటనే, విపక్షాల అంచనాలకు భిన్నంగా ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను క్లియర్ చేసింది. ఈ నెల 13న ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డీఏలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ నిర్ణయం తీసుకున్న కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ మెడికల్ బిల్లులు క్లియర్ చేయడం గమనార్హం.

 Also Read: Transfers In GHMC: అడిషనల్ కమిషనర్ల బాధ్యతల్లో మార్పులు!

ఉద్యోగుల సమస్యలపై ఫోకస్..
ఉద్యోగుల సంక్షేమ మంత్రుల సబ్-కమిటీ చైర్మన్‌గా ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, (Bhatti Vikramarka) గత 15 రోజుల వ్యవధిలోనే పలు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ బిల్లులకు ప్రాధాన్యతనిస్తూ వాటిని క్లియర్ చేశారు. గత ప్రభుత్వం కాలం నాటి (04-–03–-2023 నుంచి 20–-06–-2025 వరకు) పెండింగ్‌లో ఉన్న బిల్లులను కూడా ఒకేసారి చెల్లించడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ఇతర ఉద్యోగుల సంక్షేమ చర్యలు:
రెండు డీఏల పెంపు: ఈ నెల 13న రెండు డీఏలు పెంచుతూ జీవో జారీ చేయడంతో 3.50 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు, 3 లక్షల మంది పెన్షనర్లకు ఆర్థిక ప్రయోజనం చేకూరింది. ఈ పెంపుతో ప్రభుత్వ ఖజానాపై నెలకు రూ. 200 కోట్లు, ఏడాదికి రూ. 2,400 కోట్ల భారం పడుతుంది.
❄️జాయింట్ స్టాఫ్ కౌన్సిల్: ఉద్యోగులు, అధికారుల సమస్యల పరిష్కారానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
❄️కేడర్ స్ట్రెంత్ పెంపు: మహిళా శిశు సంక్షేమ శాఖ, ప్రణాళికా శాఖల్లో కేడర్ స్ట్రెంత్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
❄️హెల్త్ ఇన్సూరెన్స్ పథకం: ఉద్యోగులు, పెన్షనర్ల కోసం కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ పథకం సిద్ధమవుతుంది.
❄️ప్రమోషన్లు: వివిధ శాఖల్లో ప్రమోషన్లకు సంబంధించిన డీపీసీ కమిటీలు వేగం పుంజుకున్నాయి.

ప్రజా ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య సంబంధం ఒక ఆదర్శ కుటుంబంలా ఉండాలని తాము భావిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పేర్కొన్నారు. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే 7.5 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కారం కావడం పట్ల ఉద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

 Also Read: ACB Raids: ఆర్టీఏ ఆఫీసులపై ఏసీబీ మెరుపుదాడులు.. రాష్ట్రవ్యాప్తంగా సోదాలు.. కారణమిదే!

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?