Viswambhara
ఎంటర్‌టైన్మెంట్, లేటెస్ట్ న్యూస్

Chiranjeevi: మెగాస్టార్ ‘విశ్వంభర’ మేకర్స్ నుంచి కీలక ప్రకటన

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ( Mega Star Chiranjeevi) తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘విశ్వంభర’ మూవీతో త్వరలోనే అభిమానులను అలరించబోతున్నాడు. ఈ సినిమా మంచి విజయం అందుకోవాలని మెగా ఫ్యాన్స్ ఇప్పటి నుంచే కోరుకుంటున్నారు. అయితే, విశ్వంభర వీఎఫ్ఎక్స్ అంతగా మెప్పించే స్థాయిలో లేవని, సినిమా ఫైనల్ అవుట్‌పుట్ అత్యున్నత స్థాయిలో రూపుదిద్దేవరకు మూవీ విడుదల తేదీ ప్రకటనను నిలుపుదల చేయాలంటూ చిరంజీవి పట్టుబట్టినట్టుగా జోరుగా ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ కథనాలపై నిర్మాతలు వివరణ ఇచ్చారు. సినిమా విజువల్ ఎఫెక్ట్స్ అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉంటాయని చిరు అభిమానులకు ప్రామిస్ చేశారు. విశ్వంభర మూవీ విడుదల తేదీని కూడా త్వరలోనే వెల్లడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Read this- Sugar Mill: రాత్రికే రాత్రే కరిగిపోయిన రూ.60 కోట్ల విలువైన పంచదార

ఈ సినిమా పోస్ట్-ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. వీఎఫ్ఎక్స్ షాట్లు మునుపెన్నడూ చూడని విధంగా, ఊహకందని స్థాయిలో ఉంటాయని మేకర్స్ దీమా వ్యక్తం చేశారు. భారతీయ సినిమా స్థాయిని పెంచే రీతిలో విశ్వంభరలో సీన్లు ఉంటాయని, గతంలో ఎన్నడూ లేని విధంగా గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తాయని చెబుతున్నారు. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ షాట్ల కోసం టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్‌లకు చెందిన అగ్రశ్రేణి వీఎఫ్ఎక్స్ స్టూడియోల సహకారం తీసుకున్నామని, మూవీ పోస్ట్-ప్రొడక్షన్‌‌ వర్క్స్‌లో ఈ బృందాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్‌లను అందించాలనే లక్ష్యంతో ఈ టీమ్స్ చాలా శ్రద్ధతో పనిచేస్తున్నాయని వివరించారు.

Read this- Producer Sireesh: హీరోల కంటే అతనే బెటర్ అంటూ గేమ్ ఛేంజర్ నిర్మాత షాకింగ్ కామెంట్స్

సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ‘విశ్వంభర’ మూవీని మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కథకు తగ్గట్టుగా ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ షాట్లను గట్టిగానే వాడారని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.
తొలి చిత్రం ‘బింబిసార’తో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు వశిష్ట ఈ మూవీకి డైరెక్షన్ చేశారు. విశ్వంభర తన కలల ప్రాజెక్టు అని ఆయన చెబుతున్నారు. ప్రఖ్యాత ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ సహకారంతో ఈ మూవీని క్వాలిటీగా నిర్మిస్తున్నారు. క్వాలిటీ, సృజనాత్మక విషయంలో ఎలాంటి రాజీ లేకుండా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్టపై పూర్తి నమ్మకంతో నిర్మాతలు ఖర్చుకు వెనుకాడడం లేదు. భారీగా వెచ్చిస్తున్నారు.

కాగా, విశ్వంభర మూవీ పోస్ట్-ప్రొడక్షన్ పనులు దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. వేగంగా కొనసాగుతున్న ఫైనల్ వర్క్స్‌పై మెగాస్టార్ కూడా సంతోషంగా ఉన్నారని సినీ వర్గాల ద్వారా తెలిసింది. సినిమా విడుదల తేదీని మేకర్స్ త్వరలో ప్రకటిస్తారనే అంచనాలు నెలకొన్నాయి. మూవీకి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా అతిత్వరలో ప్రారంభమవుతాయని నిర్మాతలు చెబుతున్నారు. ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

Read this- Pashamylaram Blast: పాశమైలారం ఘటన.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. కీలక ఆదేశాలు జారీ!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు