Producer Sireesh: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా 2025 సంక్రాంతి సందర్భంగా విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ, బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అంతేకాదు, నిర్మాలు దిల్ రాజు, శిరీష్ కు భారీ నష్టాలను మిగిల్చిందని ఆయనే స్వయంగా చెప్పాడు. ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Read: Ram Charan: రామ్ చరణ్ వాళ్ళకి అంత బాధను మిగిల్చాడా.. గేమ్ ఛేంజర్ నిర్మాత సంచలన కామెంట్స్
ఈ నేపథ్యంలోనే నిర్మాత శిరీష్ ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజుతో కలిసి గేమ్ ఛేంజర్ సినిమాని నిర్మించారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అవ్వడంతో ” తాము కోట్ల రూపాయలు నష్టపోయామని, అయినప్పటికీ రామ్ చరణ్ నుంచి కానీ, దర్శకుడు శంకర్ నుంచి ఇంత వరకు ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదని వ్యాఖ్యానించారు. అలాగే, నిర్మాత సంస్థల గురించి సంచలన కామెంట్స్ చేశాడు. మైత్రి మూవీ మేకర్స్ కు, సితారా ఎంటర్టైన్మెంట్ కు నక్క లోకానికి, నాగ లోకానికి ఉన్న తేడా ఉంది. ఇక్కడ నాగ లోకం ఎవరు అని అడగ్గా.. వంశీ నా దృష్టిలో దేవుడు లాంటి వాడు. అతనే డిస్ట్రిబ్యూటర్ గురించి ఆలోచిస్తాడు. నా అనుభవంలో చూసిన గొప్ప మనిషి ఎవరన్నా ఉన్నారంటే అది నాగ వంశీ నే అని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
Also Read: Abhishek Bachchan: ఐశ్వర్యతో విడాకులు.. చాలా బాధాకరం అంటూ అభిషేక్ బచ్చన్ సంచలన కామెంట్స్