Abhishek Bachchan: బాలీవుడ్ స్టార్స్ ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 2024 నుంచి వీరిద్దరూ విడిపోతున్నారనే పుకార్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు ఎవరూ స్పష్టంగా మాట్లాడలేదు.
Also Read: Aamir Khan: ఆ ముగ్గురు టాప్ హీరోయిన్స్ రిజెక్ట్ చేశారు.. తట్టుకోలేకపోతున్నా.. అమీర్ ఆవేదన!
విడాకులపై స్పందించిన అభిషేక్ బచ్చన్
తాజాగా, అభిషేక్ బచ్చన్ ఈ విడాకుల పుకార్లపై మౌనం వీడారు. “గతంలో నా మీద వచ్చిన ట్రోల్స్‌ను నేను పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు నాకు కుటుంబం ఉంది. నా గురించి, నా కుటుంబం గురించి తప్పుడు ప్రచారం చేయడం చాలా బాధాకరం. ఈ రూమర్స్‌ను క్రియోట్ వారుచేస్తున్న వారికి సమాధానం చెప్పుకోవాలి. వారు సృష్టించిన వార్తలకు వారే బాధ్యత వహించాలి, నేను కాదు” అని అభిషేక్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, తమపై వస్తున్న నెగిటివ్ వార్తలు తన కుటుంబాన్ని తీవ్రంగా కలచివేశాయని అభిషేక్ తెలిపారు.
ఈ కామెంట్స్ చూస్తుంటే ఐశ్వర్య, అభిషేక్ కలిసే ఉన్నారని స్పష్టమవుతోంది. ఇక నెటిజన్లు ఈ పుకార్లకు స్వస్తి చెప్పి, వాటిని ఆపుతారో లేదో చూడాలి.
Also Read: Congress vs BJP: డీఎస్ విగ్రహావిష్కరణపై వార్.. దుమ్మెత్తిపోసుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్.. ఎందుకంటే?
అయితే, గత కొంతకాలంగా వీరిద్దరూ విడిపోతున్నారనే చర్చలు సాగుతున్నాయి. 2024లో జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి వేడుకకు వీరిద్దరూ విడివిడిగా హాజరవడంతో ఎన్నో అనుమానాలు వచ్చాయి. అంతేకాక, ఐశ్వర్య ముంబైలోని బచ్చన్ ఇంటి నుంచి వెళ్లిపోయారని, ఒక డాక్టర్‌తో ఆమె సన్నిహితంగా ఉంటున్నారని ఎన్నో న్యూస్ లు వచ్చాయి. దీంతో, వీరి విడాకుల గురించి సోషల్ మీడియాలో ట్రొల్స్ పెరిగిపోయాయి.
త్వరలో అభిషేక్ బచ్చన్ “కాళీధర్ లాపాట”
ఇక అభిషేక్ బచ్చన్ త్వరలో “కాళీధర్ లాపాట” అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రానున్నారు. ఈ మూవీ జూలై 4 నుంచి Zee5లో స్ట్రీమింగ్ కాగా, అభిషేక్ కాళీధర్ పాత్రలో నటిస్తున్నారు, ఇందులో ఆయన తన జీవితంలో ఏదో కోల్పోయినట్లు భావించి, దానిని వెతుక్కునే ప్రయత్నంలో ఉంటారు. మధుమిత దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో దైవిక్ బఘేలా కీలక పాత్రలో కనిపించనున్నారు.