Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా 2025 సంక్రాంతి సందర్భంగా విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ, బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అంతేకాదు, నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చిందని ఎన్నో వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే నిర్మాత శిరీష్ ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అవ్వడంతో ” తాము కోట్ల రూపాయలు నష్టపోయామని, అయినప్పటికీ రామ్ చరణ్ నుంచి కానీ, దర్శకుడు శంకర్ నుంచి ఇంత వరకు ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదని వ్యాఖ్యానించారు. అంత పెద్ద సినిమా పోయినా కూడా మేము ఎవరినీ బ్లేమ్ చేయలేదు.అలాగే ఎవరి నుంచి ఇచ్చిన రెమ్యూనరేషన్ ను వెనక్కి తీసుకుంది లేదు. మేము ఆ స్టేజ్‌కి ఇంకా దిగజారిపోలేదు ” అని శిరీష్ అన్నారు. తమ నిర్మాణ సంస్థ ఇప్పటికీ కూడా బలంగా ఉందని తెలిపారు.
మేము అన్నీ ఇబ్బందులు పడుతున్నా కూడా హీరో కాల్ చేయలేదంటూ నిర్మాత అలా చెప్పడంతో ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. రామ్ చరణ్ కూడా ఇలా చేశాడా అంటూ కొందరు నమ్మలేకపోతున్నారు. ఇంకా అతను మాట్లాడుతూ ఏ హీరో సాయం చేయలేదు? ఇండస్ట్రీలో ఇలాగే ఉంటాయి. ఇవన్నీ ఎవరికి తెలియదు కదా, ఆ సమయంలో ఇంకో సినిమా ఉంది కాబట్టి 70% రికవరీ చేయగలిగాము. లేదంటే మేము నష్టాల్లోకి వెళ్ళే వాళ్ళం. అనిల్ రావిపూడి మమ్మల్ని కాపాడాడు. ఆయన వల్లే ఈ రోజు ఇలాగే ఉన్నామంటూ ఆయన్ని ఆకాశానికి ఎత్తేశాడు. దీనికి సంబందించిన వీడియో తెగ వైరల్ అవుతుంది.