Madhya Pradesh (Image Source: Twitter)
క్రైమ్, లేటెస్ట్ న్యూస్

Madhya Pradesh: ఆస్పత్రిలో ఘోరం.. యువతి ఛాతిపై కూర్చొని.. కసిగా గొంతు కోసిన ఉన్మాది!

Madhya Pradesh: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌(Madhya Pradesh)లోని నార్సింగ్‌పూర్ ఆస్ప‌త్రి (Government district hospital of Narsinghpur)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలు అందరూ చూస్తుండగా ఓ యువతిని గొంతు కోసి హత్య చేశాడు ఓ ఉన్మాది. జూన్ 27న దారుణ ఘటన జరగ్గా.. తాజాగా వెలుగు చూసింది. ఈ ఘటనలో ఇంటర్ చదువుతున్న 19 ఏళ్ల బాలిక సంధ్య చౌదరి (Sandhya Chaudhary) ప్రాణాలు కోల్పోయింది. ఆమెను ప్రేమిస్తున్నానంటూ కొంతకాలంగా వెంటపడుతున్న అభిషేక్ కోష్టి (Abhishek Koshti) అనే యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు.

మంటగలిసిన మానవత్వం
నిందితుడు అభిషేక్.. యువతి గొంతు కోస్తున్న దృశ్యాలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్ గా మారాయి. యువతిపై అభిషేక్ దాడి చేస్తున్న సమయంలో.. అస్పత్రి సిబ్బంది సహా అక్కడ చాలామంది ఉన్నప్పటికీ ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అందరూ స్థంభించిపోయి చూస్తూ ఉండిపోయారు. అంతేకాదు బాలిక తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతుండగా.. కొందరు ఏమాత్రం పట్టనట్లు పక్కగా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు పలు ప్రశ్నలకు తావిస్తున్నాయి.

పరారీలో నిందితుడు
తొలుత బాధిత యువతి ఆస్పత్రిలోని అత్యవసర విభాగం వద్ద నిలబడి ఉండగా బ్లాక్ షర్ట్ వేసుకున్న అభిషేక్ ఆమె వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో సంధ్యను చెంపదెబ్బ కొట్టి నేలపైకి కూలదోశాడు. అనంతరం ఆమె ఛాతీపై కూర్చొని.. కత్తితో గొంతు కోశాడు. అనంతరం తాను గొంతు కోసుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో వెంటనే ఆస్పత్రి నుంచి పారిపోయాడు. బయట పార్క్ చేసిన బైక్ ను తీసుకొని ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయాడు.

Also Read: Pakistani Couple: కోటి ఆశలతో భారత్ బాట.. థార్ ఎడారిలో విగతజీవులుగా పాక్ జంట..!

యువతి కుటుంబ సభ్యుల ఆందోళన
ఘటన జరిగిన రోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సంధ్య ఆస్పత్రికి వెళ్లింది. తన స్నేహితుడి వదిన ఆస్పత్రిలో ఉండటంతో ఆమెను పలకరించేందుకు వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిపింది. అయితే ఆమె రాక గురించి ముందే తెలిసిన నిందితుడు అభిషేక్ ఆస్పత్రి వద్దే ఉన్నట్లు తెలుస్తోంది. 22వ నెంబర్ గది వద్ద ఉన్న ఆమెపై ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఘటన అనంతరం కుటుంబ సభ్యులు, పోలీసులకు ఆస్పత్రి సిబ్బంది సమాచారం ఇచ్చారు. దీంతో ఆస్పత్రి వద్ద యువతి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అభిషేక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Also Read This: Viral Video: కాళ్లతో తన్ని.. నేలపై ఈడ్చుకెళ్తూ.. అధికారిపై పైశాచిక దాడి!

Just In

01

Damodar Raja Narasimha: పరిశుభ్రత పేషెంట్ కేర్‌పై.. ఆరోగ్యశాఖ మంత్రి స్పెషల్ ఫోకస్

Ambedkar Open University: గోరటి వెంకన్న, ప్రేమ్ రావత్‌ కు.. గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేసిన గవర్నర్

Telugu Thalli Flyover: తెలుగు తల్లి కాదు.. తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్.. స్వాగత తోరణం ఏర్పాటు

Bathukamma 2025: సాగర తీరాన ఘనంగా సద్దుల బతుకమ్మ.. హాజరైన మంత్రులు

Hyderabad Collector: గాంధీ జయంతి ఏర్పాట్లను స్పీడప్ చేయాలి.. కలెక్టర్ హరిచందన కీలక అదేశాలు