క్రైమ్

Khammam News: ఎస్సై భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య

Khammam News: ఓ ఎస్‌ఐ(SI) కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం(Khammam) జిల్లా రఘునాధపాలెం మండలానికి చెందిన భానోత్ రాణ ప్రతాప్ 2016 బ్యాచ్ కు చెందిన ఎస్సై. తొలుత మహబూబాబాద్ జిల్లాలో ప్రొబేషనరీ ఎస్సైగా పనిచేశారు. ఆ తర్వాత మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌లోనే ఎస్సైగా విధులు నిర్వహిస్తూ గుడుంబా సంబంధిత వ్యాపారాలపై ఉక్కు పాదం మోపారు. గుడుంబా తయారీదారుల పై దురుసుగా ప్రవర్తించడంతో రాణా ప్రతాప్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. గుడుంబా తయారు చేస్తున్న క్రమంలో గుడుంబా తయారీ వస్తువులపై ఎగిరెగిరి తంతు తన ఆకతాయి చేష్టలకు గుర్తింపు తీసుకొచ్చాడు.

మొదటినుంచి రాణా ప్రతాప్‌ది వివాదాస్పదమే

ఎస్సై రాణా ప్రతాప్ ప్రవర్తన మొదటి నుంచి వివాదాస్పదమే. ప్రొబేషనరీ ఎస్సైగా పనిచేస్తున్న టైంలో ఖమ్మం షాపింగ్ లో తన సోదరుడితో కలిసి సదరు యజమానితో దురుసుగా ప్రవర్తించారు. యజమాని సైతం తిరుగుబాటు చేయడంతో రాణా ప్రతాప్ తన సర్వీస్ రివాల్వర్ చూయించి చంపేస్తానని బెదిరించాడు. ఈ ఘటన అప్పట్లో కలకలం సృష్టించింది. ఆ తర్వాత సిరోల్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సమయంలో చింతపల్లిలో ఓ వివాదంలో తలదూర్చి అభాసు పాలయ్యాడు.

అదేవిధంగా పలువురి సహా ఉద్యోగినులతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎస్సై రాణా ప్రతాప్ ఆయన భార్య రాజేశ్వరి ల మధ్య వివాదం నెలకొనేది. అయితే తాజాగా జరిగిన ఘటనలోను ప్రతాప్ కుటుంబ సభ్యులందరూ కలిసి దూషించి దాడి చేసినట్లుగా మృతురాలు రాజేశ్వరి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.

Also Read: Hanamkonda News: రాష్ట్రంలో ఘోరం.. మహిళను వివస్త్రను చేసి.. జననాంగంలో జీడిపోసి.. అతి దారుణం!

రాణా ప్రతాప్ తల్లికి సేవలు చేసేందుకు తీసుకొచ్చి హింసలు

జిఆర్‌పి ఎస్సైగా పనిచేస్తున్న రాణా ప్రతాప్ తల్లి ఇటీవలనే ప్రమాదవశాత్తు కాలు విరిగిపోవడంతో ఆమెకు సపర్యలు చేసేందుకు రాజేశ్వరిని ఖమ్మం లోని ముస్తఫా నగర్‌లో నివాసం ఉంటున్న తమ తల్లి వద్దకు తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే రాణా ప్రతాప్, అతని అన్నయ్య, తండ్రి ముగ్గురు కూడా పోలీసులు కావడంతో రాజేశ్వరిపై రూడ్‌గా ప్రవర్తించేవారని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే రాణా ప్రతాప్ సోదరుడు ఎక్కువగా హింసించడంతోటే రాణ ప్రతాప్ భార్య రాజేశ్వరి మధ్య తరచూ గొడవలు జరిగేవని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల క్రితం ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు రాజేశ్వరి జుట్టు పట్టుకుని కొట్టుకుంటూ ఎస్సై రాణా ప్రతాప్ తీసుకెళ్లడంతో తలకు గాయమై ఆసుపత్రిలో చికిత్స పొందినట్లుగా చెబుతున్నారు. ఆ క్రమంలోనే తరచూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో వారి హింసను భరించలేక వీడియోను సైతం రాజేశ్వరి చేసినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కుటుంబ సభ్యుల హింసతోటే రాజేశ్వరి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో రాజేశ్వరి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.

Also Read: Medchal Bonalu: ఘనంగా ప్రారంభమైన ఆషాడంమాస బోనాలు

 

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది