Land Grabbing in Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని ముష్టిబండ గ్రామంలోని రెండువేల ఎకరాల ప్రభుత్వ భూమి(Govt Land) భూ బకాసురులు, అక్రమార్కుల కబంధహస్తాల్లో చిక్కుకుంది. వారందరికీ స్థానిక ఎమ్మార్వో బి భగవాన్ రెడ్డి(Bagavan Reddy) అండదండలు అందిస్తున్నట్లుగా ప్రజల నుంచి విస్తృతమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూమి వేల ఎకరాలు కబ్జా చేస్తున్న విషయం వివరించడానికి వచ్చిన ఎమ్మార్వో(MRO) సమాచారం అడిగిన విలేకరులపై దమ్మపేట మండలం ఎమ్మార్వో బి భగవాన్ రెడ్డి చులకనగా మాట్లాడడం ఏంటి? అంటూ చర్చ సాగుతోంది. ముష్టిబండ గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమి రెండు వేల ఎకరాలు అన్యాక్రాంతానికి గురవుతుంటే విలేకరులు ప్రశ్నిస్తుంటే వారి పట్ల ఎమ్మార్వో భగవాన్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించడం గమనార్హం. ప్రభుత్వ భూమి పట్ల తహసిల్దార్‌కు పూర్తిస్థాయిలో అవగాహన ఉంటుంది. అదేవిధంగా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఆ అధికారికి ఉంటుందనేది మర్చిపోతున్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానం చెప్పు ప్రభుత్వ భూముల వివరణను దాచివేయడంలో ఆంతర్యమేంటని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులే వారికి అండదండలు అందిస్తే ప్రభుత్వ భూమిని కాపాడే వారు ఎవరని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఇక్కడ పరిస్థితులపై వివరణ
దమ్మపేట(Dhamma Peta) మండలం ముష్టిబండ గ్రామపంచాయతీలో సర్వేనెంబర్114 లో 2000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిపై భూ బకాసురులు కన్ను వేసి పేద గిరిజన ప్రజలను మభ్యపెడుతూ వారికి ఆశ చూపుతూ వారిని ఎరగా చూపించి ముష్టిబండ గ్రామపంచాయతీ లోని రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాహా చేసే పన్నాగాలు పన్నుతున్నారు. ఈ భూములలో 15 ఎకరాలు గుట్టలు కూడా ఉన్న వాటిని ధ్వంసం చేసి చదును చేస్తూ అడ్డు వచ్చిన వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ గుట్టలను కూడా మింగేసే ప్రయత్నం చేస్తున్నారు.
అప్పటి దమ్మపేట ఎమ్మార్వో నరేష్ వీరికి అడ్డుపడుతున్నారని ఆయనను అక్రమంగా దోచుకుంటున్న భూములకు తాను సర్వే చేయించి ప్రభుత్వ భూములుగా నిర్ణయించి హెచ్చరిక బోర్డు పెట్టించి వారిపై కేసులు నమోదు చేసి విచారణ చేసే క్రమంలో భూ బకాసురులు నరేష్ ఎమ్మార్వోను దమ్మపేట మండలం నుండి భద్రాచలం ఐటీడీ(Bhadrachalam ITDA)ఏ విభాగంలో గిరిజన(Tribal) సంక్షేమ శాఖకు బదిలీ చేయించారనే చర్చలు సైతం జరుగుతున్నాయి. అంటే వీరికి అండదండలు తోడుబలం ఏవిధంగా ఉందో అర్థం అవుతుంది. అనంతరం దమ్మపేట మండలం ఎమ్మార్వో గా వచ్చిన బి భగవాన్ రెడ్డి 2000 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్న దానిపైన ఏ విధంగా కూడా స్పందించడం లేదని, భూ బకాసురులు యదేచ్చగా ముష్టిబండ గ్రామపంచాయతీ లోని రెండు ఎకరాల ప్రభుత్వ భూమిలో భూములను చదును చేసుకుని వారి ఇష్టానుసారం వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: Temples: ఆలయాలపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
దీనికి విద్యుత్ శాఖ వారి సహకారం
కబ్జా భూమిలో ఎటువంటి అనుమతులు లేకుండా కూడా విద్యుత్ అధికారులు(Electricity officials) విద్యుత్ సదుపాయం కోసం కరెంటు పోల్స్ నిర్మించడం విడ్డూరంగా ఉన్నదని ప్రజలు చర్చించుకోవడం విశేషం. ఇండ్లలో కానీ పొలాల్లోనూ కానీ విద్యుత్ సౌకర్యం కల్పించాలంటే ప్రభుత్వం నుండి గుర్తింపుగా వారి పేరు మీద పత్రాల ఆధారం లేకుండా విద్యుత్ సౌకర్యం అనుమతించారు. కానీ ఈ భూముల్లో విద్యుత్ సౌకర్యం కల్పించారు అంటే భూ బకాసురుల పనితనం ఏ విధంగా ఉంది అర్థమవుతుంది
అమాయక గిరిజనుల ఆశ చూపుతూ
అమాయక గిరిజన ప్రజలను అడ్డుపెట్టుకొని వారు పన్నుతున్న పన్నగాలు ఇవన్నీ కనులకు కట్టిన కనపడ్డ కూడా ఇప్పుడు ఉన్న దమ్మపేట మండలం ఎమ్మార్వో బి భగవాన్ దీనిపైన చర్య తీసుకోపోవడం విడ్డూరంగా ఉందంటూ దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామపంచాయతీలో చర్చనీయంగా మారింది. ప్రభుత్వ భూము(Govt Land)ను కాపాడే క్రమంలో ఒక ఎమ్మార్వోను బదిలీ చేయించారు. అంటే వీరు ఎంతటి దీరులో అర్థమవుతుంది.
విలేకరులపై ఎందుకు మండిపాటు
ప్రభుత్వానికి ప్రజలకు మధ్యల వారిదిగా పనిచేసే విలేకరులు వారిని దమ్మపేట మండలంలో గల ముష్టిబండ గ్రామపంచాయతీలో సర్వేనెంబర్ 114 లో గల 2000 వేల ఎకరాల ప్రభుత్వ భూమి విషయంలో వివరణ కోరగా అక్కడకు వచ్చిన విలేకరులను ఎద్దేవా చేస్తూ చులకనగా మాట్లాడుతూ అక్రిడేషన్ ఉందా లేదంటే లోపలికి రావద్దు మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం. మాకు లేదు అంటూ దురుసుగా మాట్లాడుతూ అంటే బి భగవాన్ రెడ్డి ఎమ్మార్వో భూ బకాసురుల కబ్జాలకు వంతు పాడుతున్నాడ లేదంటే ఈయన కూడా వాటాదారుడా? ఏది లేకపోతే వివరణ కోరిన విలేకరులపై ఈ విధంగా మాట్లాడడం ఏంటి ఒక మీడియా సంస్థను చులకనగా మాట్లాడుతున్నాడు. ఎమ్మార్వో హోదాలో ఉండి ఇవన్నీ తెలిసి కూడా ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఈయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాసిల్దార్‌ల సంఘానికి అధ్యక్షుడు కూడా బి భగవాన్ రెడ్డి హోదాలో ఉండే ఈయనే ఈ విధంగా విలేకరులపై ప్రవర్తించడం ఏంటి అంటూ పలువురు విమర్శిస్తున్నారు.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన మలుపు
ప్రభుత్వ భూముల పరిస్థితి ఏమవుతుంది
ఏదేమైనా ముష్టిబండ గ్రామపంచాయతీలో ప్రభుత్వ 2000ల ఎకరాల భూమిలో జరుగుతున్న తంతును ఉన్నత అధికారులు ఇప్పటికైనా దృష్టి చాలించి భూ బకాసురుల కబంధహస్తాల నుండి ప్రభుత్వ భూమిని కాపాడి వారి చేతిలో ఉన్న సామాన్య పేద ప్రజలను కాపాడాలని ప్రజలకు ప్రభుత్వ భూమి పట్ల అవగాహన కల్పించి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.