Phone Tapping Case (imagcredit:twitter)
తెలంగాణ

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన మలుపు

Phone Tapping Case: ఫోన్​ట్యాపింగ్(Phone Tapping)​ కేసు కీలక మలుపు తిరగనుంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)​ మీడియా సమావేశంలో వినిపించిన ఆడియో టేపులపై ఎట్టకేలకు సిట్ అధికారులు దృష్టి సారించారు. ఆ టేపులు రికార్డు చేసింది ఎవరు? వాటిని లోడ్​చేసిన పెన్​డ్రైవ్‌లు కేసీఆర్(KCR) చేతికి ఎలా చేరాయి? అన్నదానిపై విచారణ మొదలు పెట్టారు. దీనిపై ఈనెల 20న ‘స్వేచ్ఛ’ ‘లీకైన టేపుల గురించి పట్టించుకోరా?’ అంటూ ప్రత్యేక కథనం ఇచ్చిన విషయం తెలిసిందే.

ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతంలో లీకైనా టేపులు

నిజానికి సంచలనం సృష్ఠించిన ఫోన్​ట్యాపింగ్​కేసులో విచారణను ముమ్మరంగా జరుపుతున్న సిట్​అధికారులు ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతంలో లీకైనా టేపుల గురించి చాలా రోజులు పట్టించుకోలేదు. దీనిపై పోలీసువర్గాల్లోనే జోరుగా చర్చ జరిగింది. 2023లో బీఆర్ఎస్(BRS) పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనటానికి ప్రయత్నించారన్న ఆరోపణలపై సైబరాబాద్ పోలీసులు(Cyberabad Police) రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీ స్వామిలను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

బీజేపీ(BJP) పార్టీ తరపున ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను కొనటానికి ప్రయత్నించారని అప్పటి బీఆర్ఎస్(BRS)​ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) తోపాటు ఆ పార్టీ పెద్దలు పలువురు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. కేసీఆర్​ఏకంగా మీడియా సమావేశంలోనే ఆ పార్టీ ఎమ్మెల్యే రోహిత్​రెడ్డితో నందకుమార్ మాట్లాడిన మాటల ఆడియో టేపు వినిపించారు. దాంతోపాటు నందకుమార్ సింహయాజీ స్వామితో మాట్లాడిన టేపును కూడా వినిపించారు. అప్పట్లో ఇది సంచలనం సృష్టించింది.

Also Read: Shubhanshu Shukla: శుభాంశు శుక్లా ఏం చదివారు?, ఇంట్లో ఎలా ఉంటారో తెలుసా?

పెన్‌డ్రైవ్‌లో లోడ్​చేసి ఎవరు పంపించారు

నందకుమార్ సంభాషణల ఆడియో టేపులు కేసీఆర్ చేతికి ఎలా అందాయి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. దాంతో రోహిత్ రెడ్డి తనతో నందకుమార్(Nanda Kumar) మాట్లాడినపుడు రికార్డు చేశానని చెప్పుకొచ్చారు. ఇది నిజమే అనుకున్న సింహయాజీ స్వామితో మాట్లాడిన మాటలు ఎవరు రికార్డు చేశారు? అన్న ప్రశ్నకు మాత్రం జవాబు దొరకలేదు. అప్పట్లో ఎస్​ఐబీ(SIB)లో డీఎస్పీగా పని చేసిన ప్రణీత్ రావు(Praneeth Rao) ఆధ్వర్యంలోని టీం సభ్యులే వీటిని రికార్డు చేసి పెన్‌డ్రైవ్​లలో లోడ్​చేసి కేసీఆర్‌కు పంపించారన్న ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని పేర్కొంటూ ఈ ఆడియో టేపుల గురించి ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులను సిట్ అధికారులు ఎందుకు విచారించటం లేదంటూ ‘స్వేచ్ఛ’ తన కథనంలో ప్రశ్నించింది.

తాజాగా సిట్ అధికారులు తమ దర్యాప్తులో ప్రణీత్ రావు నందకుమార్ ఫోన్‌ ట్యాప్ చేయటం ద్వారా ఈ సంభాషణలను రికార్డు చేసినట్టుగా గుర్తించినట్టు సమాచారం. ఈ క్రమంలో సిట్ అధికారులు ప్రస్తుతం ఈ అంశంపై నిశితంగా విచారణ జరపాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. దీనిపై ప్రణీత్ రావు(Praneeth Rao) నోరు విప్పితే ఫోన్​ట్యాపింగ్(Phone Tapping)​ వ్యవహారంలో ప్రభాకర్ రావు పాత్రతోపాటు దీని వెనక ఉన్న సూత్రధారులు ఎవరన్నది తేటతెల్లం కాగలదన్న అభిప్రాయం పోలీసు వర్గాల్లో సైతం వ్యక్తమవుతోంది.

Also Read: Insufficient Rains: వాన జాడ కోసం రైతుల ఎదురుచూపులు

 

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ