Insufficient Rains: వానాకాలం సీజన్‌కు ముందు రైతులను మురిపించిన వర్షాలు ఆ తరువాత ముఖం చాటేశాయి. రుతుపవనాలు(Monsoons) ముందుగానే వచ్చాయని వాతావరణ శాఖ(Meteorological Department) ప్రకటనతో ఈ ఏడాది వర్షాలు బాగానే ఉంటాయని రైతులు ఆశించారు. కానీ నైరుతి రుతుపవనాలు ప్రారంభమైనా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో ముందస్తు వర్షాలకు సాగు చేసి పంటలు వేసిన రైతులు ఆందోళనలో ఉన్నారు. సకాలంలో వర్షాలు రాకపోవడంతో వారి ఆశలు ఆవిరి అవుతున్నాయి. దీంతో వరుణ దేవుడి కరుణ కోసం అన్నదాతలు ఆకాశం కేసి ఎదురు చూస్తున్నారు. గత సంవత్సరంలో పత్తి పంట(Cotton crop) సాగులో ఆశించిన దిగుబడులు రావడంతో ప్రస్తుతం రైతులు పత్తి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగనుంది.
అన్న దాతలు ఆందోళన
ఖరీఫ్ సీజన్‌లో రోహిణీ కార్తె ప్రారంభానికి ముందే మే నెల రెండవ వారంలో జిల్లాలో ఒకటి రెండు వర్షాలు పడడంతో కొంత మంది పొలాలు చదును చేసి విత్తనాలు విత్తుకున్నారు. మరికొంత మంది విత్తనాలు(Seeds) వేసేందుకు పొలాలను సిద్ధం చేసి పెట్టుకున్నారు. తరువాత వారం పదిరోజులపాటు వానలు లేకపోవడంతో ఆందోళన చెందుతుండగా మృగశిర కార్తె ప్రారంభంలో మళ్లీ ఆశల జల్లు కురిసింది. దీంతో భూమిని సిద్ధం చేసుకున్నవారు విత్తనాలు వేసుకున్నారు. మళ్లీ వర్షాలు లేకపోగా వేసవిలా ఎండలు ఉంటూ దానికి తోడు ఈదురు గాలులకు మొక్కలు వాలిపోతున్నాయి. దీంతో అన్న దాతలు ఆందోళన చెందుతున్నారు. ముందే వేసిన విత్తనాలకు పెరిగిన మొక్కల ప్రాణం నిలవాలన్నా మొలకెత్తేందుకు భూమిలో ఉన్న విత్తనాలు(Seeds) జీవం పోసుకోవాలన్నా వర్షాలు రావడమే పరిష్కారం.
మొలకెత్తిన విత్తనాలు తడిలేక వాడుపడుతున్నాయి. నీటి సౌలభ్యం ఉన్నవారు నీటిని అందిస్తున్నారు. మరికొన్నిచోట్ల భూమిలో విత్తనాలు వేసినా మొలకెత్తకుండానే పోతుండటంతో రైతులు(Farmers) దిగులు చెందుతున్నారు. వర్షాలు పడకపోతే రూ. లక్షల్లో పెట్టిన పెట్టుబడులు మట్టిపాలు అవుతాయని వాపోతున్నాడు. మేఘాలు ఊరిస్తున్నా అక్కడక్కడ కేవలం కొన్ని నిమిషాలు తుంపర పడిపోతుంది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ముందస్తు వర్షాలకు జిల్లాలోని 13 మండలాల్లో పత్తి పంటను 54 వేల ఎకరాలకు పైగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా మానవపాడు, ఇటిక్యాల, వడ్డేపల్లి, ఐజ, మల్దకల్ మండలాలలో కమర్షియల్ పత్తి సాగు విస్తీర్ణం అధికంగా ఉంది.
Also Read: Kavitha on CM Revanth: అవినీతి చక్రవర్తి రేవంత్ రెడ్డి.. కవిత సంచలన కామెంట్స్!
15 వేల ఎకరాలలో కాటన్ సీడ్ సాగు
కాటన్ సీడ్(CotonSeeds Crops) పంటను15 వేల ఎకరాలలో సాగు చేస్తున్నారు. గద్వాల, ధరూర్, కేటి దొడ్డి మండలాలలో 2 వేల ఎకరాల చొప్పున సాగు విస్తీర్ణం ఉండగా గట్టు, మల్దకల్ మండలాలలో 3 వేల ఎకరాలలో కాటన్ సీడ్ సాగు చేస్తున్నారు. కంది, కూరగాయల పంటలతో కలిపి 72 వేల ఎకరాలలో జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత ఖరీఫ్‌లో ముందస్తు వర్షాలకు పంటల సాగు ఉంది. ఎక్కువ శాతం వర్షాధార పంటలు(Rainfed crops) వేయడం వల్ల వరుడు కరుణించకపోవడంతో రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు.
జిల్లాలో సాగు విస్తీర్ణం ఇలా
ప్రతి సంవత్సరం ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో ఆహార ధాన్యాలు సాగు 1.86 లక్షలు ఎకరాలు, వాణిజ్య పంటలు)Cash crops) 2.08 లక్షల ఎకరాలలో సాగు అవుతోంది.మొత్తం 3.47 లక్షల ఎకరాలలో సాగు విస్తీర్ణం ఉంది.70 శాతానికి పైగా రైతులు తొలకరి వర్షాలకు విత్తనాలు వేసుకున్నారు. ఇప్పటికే ముందస్తు వర్షాలకు పత్తి మొలకలు రాగా ప్రస్తుతం వర్షాభావం వల్ల ప్రస్తుతం వర్షాభావం వల్ల గాలులకు భూమిలో తేమ లేకపోవడం వల్ల మొలకలు నేలను చూస్తున్నాయి. నెల నుంచి వర్షాల జాడ లేకపోవడంతో పంటలు వేసిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుత సీజన్‌లో ఎక్కువగా పత్తిసాగువైపు దృష్టి సారించారు. సగానికి పైగా రైతులు ఎరువులు కొనుగోలు చేసి పొలాల్లో పంటకు బలం పెట్టేందుకు వానల కోసం ఎదురు చూస్తున్నారు.
విత్తుకు ఎదురుచూపులు
ఇప్పటికే ముందస్తు వర్షాలకు విత్తిన రైతులు వర్షాలు రాక మొలకలు వాడు మొఖం పట్టాయి. మరికొందరు రైతులు పొలాలను సిద్ధం చేసుకుని విత్తనాలు వితుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. వర్షాలు పడతాయని ఆశతో పొడి పొలంలోని రైతులు పత్తి విత్తనాలు పెట్టి వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. వరి సాగుకు సైతం విత్తనాలు తూకం పోశారు. వాణిజ్య పంట అయిన మిరప(Chili) సాగుకు రైతులు నార పెంచేందుకు మడులు కట్టి విత్తనాలు నాటుతున్నారు.
Also Read: Telangana: మత్తుపై ఉక్కుపాదం.. స్వేచ్ఛ – బిగ్ టీవీ.. మేముసైతం
వర్షంలేక ఇబ్బందులు: తిరుపతి రెడ్డి రైతు
మే(May) నెలలో వర్షాలు(Rains) కురవడంతో ముందస్తుగా పొలాలను సిద్ధం చేసుకుని పత్తి విత్తనాలు నాటాము. మొలకలు మలచిన నెల కావస్తున్న వర్షాలు లేకపోవడం వల్ల అవి వాడిపోతున్నాయి. విధి లేని పరిస్థితులలో పంటను రక్షించుకునేందుకు ఇతర పంటలకు బదులు మొలకలకు డ్రిప్పు పరిచి నీటిని అందించేందుకు ప్రయత్నిస్తున్నాం.
పొడిపొలంలో విత్తనాలు: రమేష్ రైతు
ప్రతి సంవత్సరం మాదిరే ప్రస్తుత ఖరీఫ్‌లో ముందస్తుగా కురిసిన వర్షాలకు పొలాలు సిద్ధం చేసుకుని అచ్చుకొట్టి పొడి పొలంలో విత్తనాలు పెట్టాము. వర్షం వస్తే మొలుస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నాం. ఈసారి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(Meteorological Department) అధికారులు సూచించగా సాగుపై ఆశతో పత్తి విత్తనాలు వేశాం. వర్షాలు సకాలంలో పడి విత్తనాలు మొలకెత్తాలని వాన కోసం ఎదురు చూస్తున్నాం.
Also Read: Shubhanshu Shukla: శుభాంశు శుక్లా ఏం చదివారు?, ఇంట్లో ఎలా ఉంటారో తెలుసా?