ACP Shankar Reddy: యువత గంజాయికి బానిసకాకుండా వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇస్తాం. ముఖ్యంగా చదువుకున్న విద్యావంతులే ఆన్లైన్ ద్వారా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. వారి నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. ఎట్టి పరిస్థితిలో ఓటీపీ(OTP) విషయాన్ని గోప్యంగా ఉంచాలి. చిన్నపిల్లలకు ద్విచక్ర వాహనాలు, కార్లు ఇవ్వరాదు. అలా చేస్తే తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తాం అని మేడ్చల్ ఏపీపీ శంకర్ రెడ్డి(ACP Shankar Reddy) హెచ్చరించారు. పలు అంశాలపై ‘స్వేచ్ఛ’ తో ముచ్చటించారు.
గంజాయి విక్రయాలు
యూత్ రూత్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టాను. ముఖ్యంగా గంజాయికి అలవాటు పడ్డ వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్(Counseling) ఇస్తున్నాము. ఇప్పటికే ఆయా పోలీస్ స్టేషన్ల సీఐలకు బాధ్యతలు అప్పగించి వారిలో మార్పు వచ్చే విధంగా చర్యలు చేపడుతున్నాం. ఇక్కడ గంజాయి విక్రయించే వారి కంటే సేవించే వాళ్లే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించాం. తప్పకుండా వారికి సరఫరా చేస్తున్న వారిని కట్టడి చేసి కేసులు నమోదు చేస్తున్నాం. ఇది ప్రత్యేక టాస్క్‌గా ఎంపిక చేసుకుని ముందుకు వెళ్తున్నామని అన్నారు.
బోనాలు మొహరం ఏర్పాట్లు
బోనాలు, మొహరం సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని, మత పెద్దలతో పీస్ కమిటీ మీటింగ్(Peace Meaning) ఏర్పాటు చేస్తున్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని, మొహరం, బోనాలను పండుగ వాతావరణంలో అందరు సంతోషంగా జరుపుకోవాలని కోరాతున్నామని అన్నారు.
Also Read: Medchal Tragedy: టిప్పర్ ఢీకొని ఆరేళ్ళ బాలుడు మృతి
బైకు దొంగతనాలు
ఇటీవల పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనాలు ఎక్కువగా పోతున్నాయి. ఎవరైనా పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసిన వెంటనే కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తున్నామిన తెలిపారు. పాత వాహనాల తాళాలు ఎప్పటికప్పుడు చెకింగ్ చేసుకోవాలని, సీసీ కెమెరాలు(CC Camera) ప్రతి ఇంటి ముందు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే దొంగతనాలు జరిగే సమయంలో అవి ఆధారాలు ఉంటే కేసు త్వరగా ఛేదించేందుకు ఉపయోగపడతాయని అన్నారు. దొంగతనాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి వాటికి ప్రత్యేకంగా నైట్ బీట్ ఏర్పాటు చేసి క్రైమ్ పార్టీ పోలీసులను నియమించామని ఎసిపి శంకర్ తెలిపారు.
సైబర్ నేరాలు
సైబర్ క్రైమ్(Cyber Crime) విషయంలో ఎక్కువగా మోసపోతున్నది విద్యావంతులే. స్మార్ట్ ఫోన్(Smart Phone) ఉన్నవారు వివిధ ఓటీపీలు(OTP) ఓపెన్ చేయడం మూలంగా సులువుగా మోసగాళ్ల చేతికి చిక్కుతున్నారు. మన ఫోన్ బ్యాంకు(Bank) లింకేజీతో ఉండటం వల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఈ విషయంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆన్లైన్ గేమింగ్ అస్సలు ఆడొద్దు. ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ వారియర్స్ నియమించి రూ.1.50 లక్ష లోపు మోస పోతే కేసు నమోదు చేసి, అంతకుమించి డబ్బులు పోగొట్టుకున్న వారు వెంటనే 1930 ఫోన్ చేస్తే అకౌంట్ సీజ్ చేసి డబ్బులు వచ్చేలా చేస్తాం. కొంత మంది మోసపోయిన రెండు, మూడు రోజుల తర్వాత వచ్చి ఫిర్యాదు చేయడం మూలంగా ఫలితం లేకుండా పోతోంది.
మైనర్ల విషయంలో తల్లిదండ్రులకు జాగ్రత్తలు
తల్లిదండ్రులు పిల్లలతో అప్రమత్తంగా ఉండాలి. మీ బిజీ షెడ్యూల్ వల్ల దృష్టి పెట్టలేకపోతున్నారు. ఎన్ని గంటలకు ఇంటికి వస్తున్నారు? అన్న విషయాన్ని మరిచిపోతున్నారు. వారికి సెల్ ఫోన్లు(Cell Phone) ఇవ్వరాదు. డ్రైవింగ్ లైసెన్స్(Driving Licence) లేకుండా వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కేసులు నమోదవుతాయి. పిల్లలపై మీరు శ్రద్ధ పెట్టకుంటే రాబోయే రోజుల్లో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీటితోపాటు తల్లిదండ్రులు పిల్లలకు మొబైల్ ఫోన్ దూరంగా ఉంచాలని సూచిస్తున్నామని తెలిపారు.
Also Read: Jeff Bezos Wedding: 61 ఏళ్ల వయసులో వివాహ బంధంలోకి బెజోస్
వ్యభిచారంపై ప్రత్యేక నిఘా
వ్యభిచారం పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. లాడ్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. అంతేకాకుండా ఫామ్ హౌస్‌లో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించకుండా వీకెండ్స్ తనిఖీలు చేస్తున్నామని అన్నారు.
మహిళలకు భద్రతలు
మహిళల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. బస్ స్టాప్, కాలేజీల వద్ద స్పెషల్‌గా షీ టీం(She Team) ఏర్పాటు చేశాము. మహిళలకు పోకిరీల నుంచి ఎలాంటి ఇబ్బందులు అయినా వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. సమాచారం ఇచ్చిన వారి వివరాలను తాము గోప్యంగా ఉంచుతాము. అంతేకాకుండా హాస్టల్లో ఉండే మహిళలు సైతం తమ రూమ్ మేట్ కుటుంబాలతో పరిచయం ఉంచుకోవాలని సూచిస్తున్నామని అన్నారు.
ఇల్లు అద్దె విషయంలో
ఇల్లు అద్దెకిచ్చేవారు తప్పకుండా అద్దెకి తీసుకున్న వారి ఆధార్ కార్డు(Adhar Card) తీసుకోవాలి. అదేవిధంగా పరిచయాలు ఉన్న వ్యక్తులకు రూమ్ ఇవ్వడం మేలని అన్నారు. ఇల్లు అద్దెకిస్తున్న సమయంలో వారి యొక్క వ్యక్తిగత వివరాలు పూర్తిగా తెలుసుకోవడం మంచిది. ఆపద సమయంలో ఎప్పుడైనా 100 డయల్ చేస్తే ఐదు, పది నిమిషాల్లో అక్కడ పెట్రోలింగ్ సిబ్బంది చేరుకుంటారు. బాధితులకు అండగా ఉంటారు. ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు జరిగితే 108 కు ఫోన్ చేయంమని తెలిపారు.
Also Read: PJR Flyover: పీజేఆర్ ఇల్లు జనతా గ్యారేజ్.. సీఎం కీలక వ్యాఖ్యలు