Celebrity Wedding ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Celebrity Wedding: నాలుగో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నటి.. ఎగిరిగంతులేస్తున్న భర్త? వీడియో వైరల్

Celebrity Wedding: సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా, ఇంకొన్ని ఫ్యాన్-మేడ్ కంటెంట్‌గా ఉంటాయి. అభిమానులు తమ ఫేవరెట్ హీరోల కోసం రకరకాల వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అలాంటి వీడియోలు తక్కువ సమయంలోనే వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది, ఇందులో కోలీవుడ్ నటి వనితా విజయ్ కుమార్ నాలుగో పెళ్లి చేసుకున్నట్లు కనిపిస్తోంది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Bollywood Heros: చీరలు కట్టిన బాలీవుడ్ హీరోస్.. పాలు పితుకుతున్న అక్షయ్ కుమార్.. వీడియో వైరల్

ఈ వీడియోలో వనితా విజయ్ కుమార్ పెళ్లి కూతురిగా కనిపిస్తుంది, వరుడు ఆమె మెడలో తాళి కడుతూ, ఇద్దరూ కలిసి ఏడడుగులు నడుస్తూ కనిపిస్తారు. ఈ క్రమంలోనే వనితా ఎమోషనల్‌గా అయింది. ఈ వీడియోను చూసి చాలా మంది మొదట వనితా నిజంగానే నాలుగో పెళ్లి చేసుకుందని విషెస్, కామెంట్స్ పెట్టారు. అయితే, వీడియో క్యాప్షన్‌లో ఇది నిజమైన పెళ్లి కాదని, సినిమా షూటింగ్‌లో భాగమని తెలిసింది.

Also Read: Singer Pravasthi: మరో సంచలన వీడియో రిలీజ్ చేసిన సింగర్ ప్రవస్తి.. జనాలను ఫూల్స్ చేయడమే టార్గెట్?

కోలీవుడ్‌లో ప్రముఖ నటి వనితా విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ దిగ్గజ నటీనటులు కావడంతో, వనితా కూడా వారి బాటలోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. దేవి మూవీతో హీరోయిన్‌గా తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఈ సీనియర్ నటి తెలుగు, తమిళ సినిమాల్లో కథానాయికగా నటించి, తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Also Read: Telangana: త్వరలో ఎంఈఎంయూ రైళ్లు అందుబాటులోకి వస్తాయి.. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్

ప్రస్తుతం వనితా  గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తుంది.  ఆమె మిసెస్ & మిస్టర్ అనే సినిమాలో నటిస్తూ, దర్శకత్వం కూడా వహిస్తోంది. ఈ మూవీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ రాబర్ట్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి వనితా కూతురు జోవికా నిర్మాతగా వ్యవహరిస్తుంది. ఇటీవలే ప్రమోషన్‌లో భాగంగా ” శుభ ముహూర్తం ” అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటలో భాగంగానే వనితా, రాబర్ట్‌లు మూవీలోని రీల్ పెళ్లి సన్నివేశాన్ని చిత్రీకరించారు.  ఇదే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో, అందరూ వనితా నాలుగో పెళ్లి చేసుకుంటుందని ప్రచారం చేస్తున్నారు.

Also Read: Telangana BJP President: తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు? అమిత్ షా రాకతో క్లారిటీ వచ్చేనా?

">

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!