Rapido: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) మాట్లాడే మాటలు ఒక్కోసారి చాలా గమ్మత్తుగా ఉంటాయి. ‘అదిగో అది కనిపెట్టింది నేనే.. ఇదిగో ఇదిలా చేయమన్నది నేనే.. సర్వం నేనే.. నేనే సర్వంతర్యామీ’ అని చెప్పుకుంటూ ఉంటారు. గుండు సూది నుంచి అంతరిక్షం వరకూ అన్నీ తానే కనిపెట్టినట్లుగా చెబుతుంటారని బాబు మీద విమర్శలు, అంతకుమించి సెటైర్లు కూడా ఉన్నాయి. అయితే ఈ మాటలకు నవ్వి ఊరుకునే వాళ్లు ఉన్నారు.. ఇందులో నిజానిజాలెంత అని గూగుల్ (Google) సెర్చ్ చేసిన వాళ్లూ ఉన్నారు.. అంతకుమించి ఎంక్వయిరీ చేసిన జనాలు ఇంకెంతో మంది ఉన్నారు. ఇప్పటి వరకూ కనిపెట్టిన, దగ్గరుండి మరీ కనిపెట్టించిన విషయాలన్నీ కాసేపు అటుంచితే తాజాగా మరోసారి చంద్రబాబు సోషల్ మీడియాలో (Social Media) మరోసారి హాట్‌టాపిక్ అయ్యారు. ఇందుకు కారణం ప్రముఖ ట్యాక్సీ యాప్ రాపిడో ఆవిష్కరించడానికి తానే స్ఫూర్తిగా నిలిచానంటూ స్వీయకితాబు ఇచ్చుకోవడంతో నెటిజన్లు, ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు, విమర్శకులు చిత్రవిచిత్రాలుగా కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. అయితే ఇందులో నిజానిజాలెంత? ఆయన చెప్పిన మాటలు ఎంతవరకూ నమ్మొచ్చు? అనే విషయాలపై ‘స్వేచ్ఛ’ పరిశీలనలో ఏం తేలింది? అనే విషయాలు ఇప్పుడీ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..
Read Also- Oscar Academy: దేశం గర్వపడేలా చేసిన కమల్.. ఎలాగో తెలిస్తే మీరూ మెచ్చుకుంటారు!
ఎవరీ రాపిడో సీఈవో?
గుంటూరులోని ఆర్వీఆర్ జేసీ ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఏఐ ఫర్ ఏపీ పోలీస్-హ్యాకథాన్-2025లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాపిడో వ్యవస్థాపకులు గుంటూరు జిల్లా అతనేనని.. ఆయన తండ్రి నిజామాబాద్‌కు వలస వెళ్లారన్నారు. టీడీపీ కార్యకర్తగా ఉండేవాడని, తాను చెప్పిన విషయాలన్నీ వినేవాడని, కొడుకు ఐఐటీ చేశాడన్నారు. తన మాటలన్నీ విన్న తర్వాత వెరీ సింపుల్ సొల్యూషన్ చూశారు కదా అని రాపిడోను ఉదహరించి చెప్పారు. ఇప్పుడు దేశంలో ఉండే ఆటోలు, మోటర్ బైక్‌లు గానీ.. ఇవన్నీ ఊబరైజేషన్ ద్వారా ప్రయాణ సౌకర్యం చేసి, ఒక ప్లాట్‌ఫాం కిందకు తీసుకొచ్చాడని.. ఐడియా అనేది గ్రేట్ కాదని ఆలోచించిన విధానం గ్రేట్ అని చంద్రబాబు వెల్లడించారు. వాస్తవానికి.. రాపిడోను స్థాపించింది పవన్ గుంటుపల్లి, రిషికేశ్ ఎస్ఆర్, అరవింద్ సంక అనే ముగ్గురు యువకులు. ముగ్గురూ ఇంజినీరింగ్ నేపథ్యం ఉన్నవారే. పవన్ గుంటుపల్లి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్స్‌లో బీటెక్ పూర్తి చేసి.. శామ్‌సంగ్ రీసెర్చ్ ఇండియాలో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేశారు. రిషికేశ్ పీఈఎస్ యూనివర్సిటీలో కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషనల్ సైన్సెస్‌లో బీఈ పూర్తి చేశారు. ఆయన ఇంప్‌స్టాంట్ (IMPStant) వ్యవస్థాపకుడు. అరవింద్ సంక ఐఐటీ భువనేశ్వర్‌లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసి.. అంతకు ముందు ఫ్లిప్‌కార్ట్‌లో ఫైనాన్స్ బిజినెస్ పార్ట్‌నర్‌గా పనిచేశారు. రాపిడోను స్థాపించడానికి ముందు, ఈ ముగ్గురు స్నేహితులు. నవంబర్ 2014లో బెంగళూరులో ‘ది క్యారియర్’ (The Karrier) అనే పేరుతో లాజిస్టిక్స్ అగ్రిగేటర్ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ చిన్న రవాణా ట్రక్కుల కోసం పనిచేసింది. ఇది విజయవంతం కాకపోవడంతో, పట్టణ ప్రయాణంలో బైక్ టాక్సీలకు ఉన్న అవకాశాన్ని గుర్తించి 2015లో రాపిడోను ప్రారంభించారు. ఓలా, ఉబర్‌ల (Ola, Uber) వంటి పెద్ద కంపెనీలతో పోటీ పడటానికి వారికి చాలా సవాళ్లు ఎదురయ్యాయి. అయినా ముగ్గురు ప్రయత్నాలను ఏ మాత్రం వదులుకోకుండా ముందుకెళ్లి విజయం సాధించారు.
అవునా.. నిజమేనా?
చంద్రబాబు చెబుతున్నట్లుగా పవన్ గుంటుపల్లి తండ్రి టీడీపీ కార్యకర్త అనే నిర్దిష్ట సమాచారం ఎక్కడా లేదు. పవన్ వ్యక్తిగత లేదా కుటుంబ రాజకీయ అనుబంధాల గురించి బహిరంగంగా ఎటువంటి అధికారిక ప్రకటనలు లేదా నివేదికలు ఎక్కడా లేవు. సాధారణంగా, ప్రముఖ వ్యాపారవేత్తల కుటుంబ సభ్యుల రాజకీయ నేపథ్యాలు చాలా అరుదుగా బహిర్గతం అవుతుంటాయి. ముఖ్యంగా వారు స్వతహాగా రాజకీయాల్లో చురుగ్గా లేకపోతే ఇలాంటి విషయాలు బయటికి రావు. సో.. దీన్ని బట్టి చూస్తే ఇందులో నిజమెంత అనేది మాత్రం తెలియట్లేదు. అయితే ఓ కార్యక్రమంలో సభా వేదికగా పవన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ ఒకానొక సందర్భంలో చంద్రబాబును కలిశాను. ఆయన ఎప్పుడూ ఆలోచించేది.. తెలుగువాళ్లను ఎప్పుడూ ప్రపంచ మ్యాప్‌లో ఎలా పెట్టాలనే ఆలోచిస్తుంటారు. ఆ మాట విన్నప్పుడు నేను కూడా ఆలోచించాను. ఆయన అలా ఆలోచిస్తుంటే మనం.. నేను ఏమైనా ప్రయత్నం చేసి తెలుగువారి పేరు ఇండియా మొత్తం వ్యాపించేలా చేయొచ్చని ఆలోచించాను. అలా రాపిడోను 2015లో ప్రారంభించాం. ఈరోజు రాపిడో భారత్‌లోని 100 సిటీల్లో మా సేవలు నడుస్తున్నాయి. ప్రతిరోజూ 22లక్షల రైడ్లు, అందులో 30 శాతం అమ్మాయిలు వాడుతున్నారు’ అని పవన్ గర్వంగా వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే పేరు నిలబెట్టాలని తాను ఈ ప్రయత్నం చేసినట్లుగా పవన్ చెప్పారు కానీ.. ఇదిగో ఫలానా స్థాపించు, ఫలానా మార్గంలో వెళ్లు అని చెప్పినట్లుగా ఎక్కడా ఆ యువకుడికి చంద్రబాబు చెప్పినట్లుగా లేదు. దీంతో చంద్రబాబు వ్యాఖ్యలపై ఎవరికి తోచినట్లుగా వాళ్లు కామెంట్స్ చేసేస్తున్నారు. అయితే ఇందుకు ఇదిగో పవన్ మాట్లాడిన మాటలు అంటూ వీడియోలను ఆధారాలుగా పెట్టి టీడీపీ కార్యకర్తలు, సీబీఎన్ వీరాభిమానులు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చిపడేస్తున్నారు.
Proof idigo ra PINKY LANJA pic.twitter.com/9Q8P1x87QQ
— DILEEP PINNAMANENI (@Dileep18Dileep) June 27, 2025
నిజం దేవుడికే తెలియాలి కానీ..!
చంద్రబాబు మాటల్లో నిజమెంత అనేది పైనున్న పెరుమాళ్లుక ఎరుకలే కానీ.. హైదరాబాద్ హైటెక్ సిటీ ఏర్పాటుకు ఆద్యుడిని తానేనని చెప్పడం.. ప్రపంచంలో ఐటీని ప్రమోట్ చేసిన ఘతన కూడా తనకే దక్కుతుందనే స్థాయికి బాబు ఆలోచన వైఖరి చేరుకుందని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆ మధ్య మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్యనాదెళ్ల నియామకమైనప్పుడు కూడా ఆ ఘనతను చంద్రబాబు ఆపాదించుకున్న విషయాన్ని కూడా జనాలు గుర్తు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. పీవీ సింధు ఒలింపిక్ మెడల్ సాధించడం, కరోనాకు జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ కనిపెట్టినప్పుడు శాస్త్రవేత్తల కృషిని తన గొప్పదనం, ప్రోత్సాహం ఫలితంగా చెప్పుకున్న తీరు ఏ రేంజిలో చర్చకు దారితీసిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ మధ్యనే యోగాకు మార్కెట్ చాలా వీక్‌గా ఉందని.. అందుకే తాను ముందుకు తీసుకెళ్తున్నానంటూ చంద్రబాబు మాట్లాడటం విడ్డూరమని నెటిజన్లు, విమర్శకులు మండిపడుతున్న పరిస్థితి. దేవుడా.. ఇదిగో ఈ ఒక్కటి మాత్రం చంద్రబాబు కనిపెట్టలేదు.. ఇకపై ఇలాంటి కామెంట్స్ చేయరులే అనుకున్న ప్రతిసారీ అందరి అంచనాలను తలకిందలు చేస్తూ ఏదో ఒక మాట అనేస్తున్నారని జనాలు సెటైర్లు కురిపిస్తున్నారు.
Read Also- Swetcha: యాంకర్ స్వేచ్ఛ చివరిసారిగా కూతురితో ఏం చెప్పింది..? ఎక్స్‌క్లూజివ్