Viral News: రద్దీగా ఉండే మార్గంలో నడిరోడ్డుపై ఎవరైనా ఒక వ్యక్తి తుపాకీ పట్టుకొని కూర్చుంటే ఎంత గందరగోళంగా అనిపిస్తుందో ఒకసారి ఊహించుకోండి. వాహనదారులు, పాదచారులు ఉలిక్కిపడరూ!!.. అమెరికాలోని టెక్సస్‌లో ఇదే తరహా ఘటన జరిగింది. ఉత్తర హారిస్ కౌంటీలో ఒక మహిళ పిస్టల్ తీసుకొచ్చి ఇంటర్‌స్టేట్ 45 రోడ్డుపై (I-45) మడత కుర్చీ వేసుకొని కూర్చుంది. దీంతో, ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వేలాది మంది వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. అటుగా వెళ్లాలంటే భయపడి ఆగిపోయారు. నిందిత మహిళ తన వాహనంలో వెళ్తూ, 18 చక్రాలున్న ఒక వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం ఆమె ఈ విధంగా ప్రవర్తించింది.
ప్రమాదం తర్వాత వాహనం నుంచి బయటకు దిగిన ఆమెను స్థానిక అధికారులు వారించారు. అధికారుల మౌఖిక ఆదేశాలను ఆమె లెక్కచేయలేదు. మడత కుర్చీపై కూర్చొని, తలపై తుపాకీ భజంపై పెట్టుకుని రోడ్డు సౌత్ లేన్ మధ్యలో కూర్చుంది. సమాచారం అందుకొని కానిస్టేబుళ్లు, పోలీసు అధికారులు, ఫస్ట్ రెస్పాండర్లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎవరికి ఏం హాని జరుగుతుందోనని అధికారులు వణికిపోయారు. షార్ప్ట్ షూటర్లు ఆమెవైపు తుపాకీని గురిపెట్టి ఉంచాల్సి వచ్చింది. ఈ ఘటన ఐ-45కు సమీపంలో 19000 బ్లాక్‌లో ఈ ఘటన జరిగింది.
Read this- Jeff Bezos Wedding: 61 ఏళ్ల వయసులో వివాహ బంధంలోకి బెజోస్
దాదాపు 5 గంటల ప్రతిష్టంభన తర్వాత సదరు మహిళ దారికొచ్చింది. తన కుమార్తెతో మాట్లాడిన తర్వాత ఆమె పోలీసులకు లొంగిపోయింది. భద్రతపై తనకు హామీ ఇవ్వాలంటూ కూతురు కోరడంతో ఆమె వెనక్కి తగ్గింది. దీంతో, ఆమెను పోలీసులు సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. తుపాకీ పట్టుకుని రోడ్డుపై కూర్చున్న మహిళను సురక్షితంగా పట్టుకున్నామని పోలీసులు ప్రకటించారు.
కాగా, నిందిత మహిళ ఆత్మహత్య ఆలోచనలను వ్యక్తపరుస్తోందని పోలీసులు తెలిపారు. చేతిలోని తుపాకీని పడేయడానికి, రోడ్డు మీద నుంచి పక్కు కదలడానికి ఆమె నిరాకరించిందని అధికారులు వివరించారు. అధికారులు చర్చలు జరిపేందుకు ప్రయత్నించినప్పటికీ, అస్పష్టమైన సమాధానాలు ఇచ్చిందని, దీంతో, ఆమె మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు అధికారులు భావిస్తున్నారు. నిందిత మహిళ కారణంగా ఒక రోడ్డును చాలా సమయం పాటు మూసివేయాల్సి వచ్చిందని, పర్యావసానంగా ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని అధికారులు వివరించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral News) మారింది.
Read this- S-400 Air Defence Systems: రష్యాతో భారత్ గేమ్ ఛేంజింగ్ డీల్.. ఇక పాక్, చైనాలకు చుక్కలే!
🚨🇺🇸#BREAKING | NEWS ⚠️
Houston police are on the scene of interstate 45 in Houston,Texas in Harris County after a woman is seated in a lawn lawn chair in the middle of the freeway, and she is armed this is causing a massive back up.Houston police along with FBI and other… pic.twitter.com/zZofrDRhWK
— Todd Paron🇺🇸🇬🇷🎧👽 (@tparon) June 26, 2025