Anchor
క్రైమ్

Anchor: టీవీ యాంకర్ ఆత్మహత్య.. అసలేం జరిగింది?

Anchor: హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఛానల్‌లో న్యూస్ ప్రజెంటర్‌గా పనిచేస్తున్న స్వేచ్ఛ అనే మహిళ శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. రామ్ నగర్‌లో తన తల్లితో కలిసి నివాసం ఉంటున్న ఈమె, శుక్రవారం ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నది. విషయం తెలియగానే సంఘటనా స్థలానికి వెళ్లిన చిక్కడపల్లి పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియలేదని, విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

రామ్ నగర్‌లో నివాసం

చనిపోయిన యాంకర్ స్వేచ్ఛ వయసు 40 ఏళ్లు. మూడేళ్లుగా ఓ ప్రైవేట్ ఛానల్‌లో పని చేస్తున్నది. రామ్ నగర్‌లోని లతా నిలయం పెంట్‌హౌస్‌లో నాలుగేళ్లుగా నివాసం ఉంటున్నది. ఈమెకు 9 ఏళ్ల వయసు ఉన్న కుమార్తె ఉన్నది.

సన్నిహితుల విచారం 

ఎప్పుడూ తన పాప భవిష్యత్తు కోసం ఆలోచించే స్వేచ్ఛ, ఇప్పుడు ఆ పాపను తల్లి లేకుండా ఎందుకు చేసిందో అర్థం కావడం లేదని సన్నిహితులు అంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాడిన జర్నలిస్టుల్లో స్వేచ్ఛ ఒకరని గుర్తు చేస్తున్నారు. విప్లవ జర్నలిస్టుకు వీడ్కోలు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

అనేక అనుమానాలు

స్వేచ్ఛ పని చేస్తున్న ఛానల్‌లో ఓ ఉద్యోగిని తనకు ఆఫీ‌స్‌లో లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీనిపై ఆఫీస్‌లోని పై స్థాయిలో ఉన్నవారికి చెప్పినా ఎవ్వరూ పట్టించుకోలేదని ఆరోపించింది. ఇదే సమయంలో స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. దీనిపై పోలీసులు నిజానిజాలు నిగ్గు తేల్చాలని జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Read Also- Siddharth: స్టేజ్‌పైనే కంటతడి పెట్టుకున్న హీరో సిద్ధార్థ్.. నన్ను ఏడిపిస్తున్నారంటూ..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం

యాంకర్ మృతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ, జర్నలిస్ట్, రచయిత్రి అయిన స్వేచ్ఛ మరణం దురదృష్టకరమని అన్నారు. ఈ విషయం తెలిసి చాలా బాధపడినట్టు చెప్పారు. తనకు మాటలు రావడం లేదని, ఆమె కుటుంబానికి ముఖ్యంగా కుమార్తెకు సానుభూతి తెలియజేస్తున్నట్టు ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ఈ కష్ట సమయంలో కుటుంబసభ్యులు దృఢంగా ఉండాలని ధైర్యం చెప్పారు.

బీఆర్ఎస్ నేతల విచారం

బీఆర్ఎస్ నేత కృశాంక్ స్పందించారు. ఈ విషయం తెలిసి షాక్‌కు గురైనట్టు ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. తెలంగాణ వాణి వినిపించడంలో ఆమె ముందుంటారని గుర్తు చేశారు. ప్రియమైన సోదరి మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. దాసోజు శ్రవణ్ స్పందిస్తూ, ఇది చాలా బాధాకరమని అన్నారు. ‘‘ఆత్మీయ పలకరింపు, చిరునవ్వుతో, వినమ్రతతో ప్రతి ఒక్కరిని పలకరించే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడం నిజంగా నమ్మశక్యంగా లేదు. ధైర్యంగా, నిర్మొహమాటంగా మాట్లాడే ఆమె, బతుకంటే భయపడ్డారన్న వార్తను నమ్మలేకపోతున్నాను. తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక ఉద్యమకారుడి కూతురిగా మీడియా ప్రపంచంలోకి అడుగుపెట్టి, తాను స్వయంగా ఉద్యమ స్ఫూర్తిగా నిలిచిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమెది విశ్లేషణాత్మక చింతన, అనర్గళమైన అభివ్యక్తి, అనేక అంశాల్లో లోతైన అవగాహన. సమకాలీన అంశాలపై ఆమె ధైర్యంగా, నిర్మొహమాటంగా, సమగ్రంగా మాట్లాడగల శక్తి గల వ్యక్తిత్వం. తనతో అనేక చర్చలలో పాల్గొన్న అనుభవం నాకు గుర్తొస్తోంది. లోతైన ప్రశ్నలు, సంక్లిష్ట అంశాలను ప్రజల భాషలో చెప్పగల ప్రతిభ, నిబద్ధతతో కూడిన పాత్రికేయతను తాను ప్రదర్శించారు. ఆమె మరణం తెలంగాణ జర్నలిజానికి తీరనిలోటు’’ అని ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.

Read Also- Takahiro Shiraishi: గడగడా వణించిన సీరియల్ కిల్లర్‌కు ఉరిశిక్ష అమలు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!