Dinosaur Skeleton At Museum: డైనోసార్ అంటే తెలియని వ్యక్తి ప్రపంచంలో ఉండరేమో. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమిపైన నడయాడిన ఈ జీవులు.. ప్రస్తుతం సజీవంగా లేవు. అయినప్పటికీ హాలీవుడ్ చిత్రాల పుణ్యామా అని అవి ఎలా ఉంటాయి? ఎంత ప్రమాదకరంగా ప్రవర్తిస్తాయి? ఒకవేళ బతికుంటే ఎంత విధ్వంసం చేయగలవు? వంటివి మనం తెలుసుకోగలిగాం. అయితే తాజాగా ఈ డైనోసార్లకు సంబంధించి మరోమారు ప్రపంచవ్యాప్తంగా చర్చ మెుదలైంది. 150 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి డైనోసార్ గురించి ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు. అందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
లండన్ మ్యూజియంలో ప్రదర్శన
చరిత్రలో కనివినీ ఎరుగని కొత్త జాతి రాక్షసబల్లి (డైనోసార్)ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు భూమిపై 15 కోట్ల సంవత్సరాల క్రితం తిరిగిన ఆ జీవికి సంబంధించిన అస్థిపంజరాన్ని తాజాగా సందర్శనకు తీసుకొచ్చారు. లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం (Natural History Museum)లో గురువారం (జూన్ 26) నుంచి దీనిని ప్రదర్శనకు ఉంచారు. ఈ అస్థిపంజరం.. ఎనిగ్మాకర్సర్ మొలీబోర్త్‌వికే (Enigmacursor Mollyborthwickae) అనే కొత్త డైనోసార్ జాతికి చెందినదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ‘ఎనిగ్మాకర్సర్’ అనేది లాటిన్ పదం కాగా.. దీని అర్థం “పజ్లింగ్ రన్నర్” (Puzzling Runner). డైనోసార్ వేగవంతమైన కదలికలను ఇది సూచిస్తుంది.
Think you know all of the dinosaurs? Think again…
There’s a brand new dinosaur species in town. Say hello to never-seen-before Enigmacursor mollyborthwickae 👋🏽 pic.twitter.com/KY7WvqDYWV
— Natural History Museum (@NHM_London) June 25, 2025
ఎంతో చురుకైన డైనోసార్
ఎనిగ్మాకర్సర్ మొలీబోర్త్‌వికే జాతి డైనోసార్.. సుమారు 145-150 మిలియన్ సంవత్సరాల క్రితం ఉత్తర అమెరికాలో నివసించినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ అస్థిపంజరం మొదట నానోసారస్ (Nanosaurus) జాతిగా వర్గీకరించబడినప్పటికీ.. పరిశోధనలో ఇది కొత్త జాతి అని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎనిగ్మాకర్సర్ శారీరక నిర్మాణం చిన్నగా ఉన్నప్పటికీ అవి ఎంతో చురుకైనవని శాస్త్రవేత్తలు తెలిపారు. స్టెగోసారస్ వంటి భారీ డైనోసార్లతో కలిసి అవి సంచరించినట్లు పేర్కొన్నారు.
Also Read: Viral Video:ఘోర రోడ్డు ప్రమాదం.. గుండె ధైర్యం ఉన్నవారే చూడండి.. వీడియో వైరల్!
మరో పురాతన డైనోసార్ కూడా..
నేచురల్ హిస్టరీ మ్యూజియం విషయానికి వస్తే.. అది లండన్ లోని దక్షిణ కెన్సింగ్టన్‌లో ఎగ్జిబిషన్ రోడ్‌లో ఉంది. ఈ మ్యూజియం ప్రపంచంలోనే అతిపెద్ద సైన్స్ మ్యూజియాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అంతరించిపోయిన చాలా రకాల జంతువుల తాలుకూ నమూనాలు భద్రపరిచి ఉన్నాయి. తాజాగా ఎనిగ్మాకర్సర్ జాతి డైనోసార్ స్కెల్టెన్ ను ఇక్కడ ప్రదర్శనకు ఉంచడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ మ్యూజియంపై పడింది. గతంలో నేచురల్ హిస్టరీ మ్యూజియంలో మరొక 150 మిలియన్ సంవత్సరాల నాటి స్టెగోసారస్ అస్థిపంజరం ఉండేది. దానిని అపెక్స్ అని పిలిచేవారు. న్యూయార్క్ నిర్వహించి వేలంలో రూ. 81 కోట్లకు ఇది అమ్ముడుపోయింది. ప్రస్తుతం అమెరికన్ మ్యూజియం ఆఫ్ నాచురల్ హిస్టరీలో అది ప్రదర్శనకు ఉంది.