Viral Video (Image Source: Twitter)
Viral, లేటెస్ట్ న్యూస్

Viral Video:ఘోర రోడ్డు ప్రమాదం.. గుండె ధైర్యం ఉన్నవారే చూడండి.. వీడియో వైరల్!

Viral Video: రహదారులపై కొందరి నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెస్తోంది. డ్రైవర్ చేసిన తప్పునకు రోడ్డుపైన ఉన్న వారి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అతివేగం కారణంగా ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే తాజాగా హరియాణాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి.

అసలేం జరిగిందంటే?
హరియాణాలోని గురుగ్రామ్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సివిల్ ఇంజనీర్ నడుపుతున్న కారు.. రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఇద్దరు వ్యక్తులపై ఒక్కసారిగా దూసుకెళ్లింది. జూన్ 24వ తేదీ తెల్లవారుజామున ఢిల్లీ – జైపూర్ హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లా స్టూటెండ్ హర్ష్, అభిషేక్ అనే ఇద్దరు వ్యక్తులు చంచల్ దాబా వద్దకు వచ్చారు. వారు రోడ్డు పక్కన ఉండి మాట్లాడుకుంటున్న సమయంలో వేగంగా వచ్చిన స్కోడా వారిని ఒక్కసారిగా ఢీ కొట్టింది. 10 మీటర్ల దూరం వరకూ వారిని లాక్కెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.

లా స్టూడెంట్ మృతి
అయితే ఇద్దరు వ్యక్తులను ఢీ కొట్టిన అనంతరం.. కారు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రమాదంలో న్యాయ విద్యార్థి హర్ష్ ప్రాణాలు కోల్పోగా.. అభిషేక్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సీసీటీవీ ఫుటేజీ అధారంగా కారు నడిపిన నిందితుడ్ని పోలీసులు గుర్తించారు. అతడి పేరు మోహిత్ (31) అని పేర్కొన్నారు. మోహిత్ నిద్ర మత్తులో ఉండి డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తేల్చారు. అతడిపై నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్ ఆరోపణల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వివరించారు.

Also Read: Pawan Kalyan: 14 ఏళ్ల మైనర్ బాలిక మిస్సింగ్.. డిప్యూటీ సీఎం పవన్ సాయం చేస్తారా?

ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే!
యాక్సిడెంట్ జరిగిన సమయంలో అక్కడే ఉన్న మృతుడు హర్ష్ స్నేహితుడు మోక్ష్.. ప్రమాదం జరిగిన తీరును వివరించారు. దాబా రద్దీగా ఉండటంతో తమవంతు వచ్చే వరకూ వేచి చూద్దామని హర్ష్ తాను రోడ్డుపై నిలబడినట్లు తెలిపాడు. ఇంతలో పాత స్నేహితుడు అభిషేక్ కనిపించడంతో అతడితో మాట్లాడేందుకు హర్ష్ రోడ్డు అవతలికి వెళ్లాడని తెలిపారు. సర్వీస్ లైన్ రైలింగ్ వద్ద ఇద్దరు నిలబడి ఉండగా.. కారు వారి వైపునకు దూసుకొచ్చిందని చెప్పారు. ప్రమాద అనంతరం డ్రైవర్ ను పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించగా అతడు వెళ్లిపోయాడని వివరించాడు.

Also Read This: Star Actress: నా లైఫ్‌లో అతిపెద్ద నమ్మకద్రోహం అదే.. లవరే కాలయముడు అయ్యాడు.. స్టార్ నటి!

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు