Gold Rate (27-06-2025): అతి భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్
Gold Rate (27-06-2025) ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rate (27-06-2025): అతి భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్.. సంతోషంలో సామాన్యులు

Gold Rates (27-06-2025): ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మహిళలు బంగారానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. అయితే, దేశంలో ఆర్థిక సమస్యల పెరుగుదలతో కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ, పెరుగుతూ ఉన్నాయి. ధరలు పెరిగితే కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రారు. కానీ ధరలు తగ్గితే మాత్రం బంగారం కొనేందుకు జనం ఆసక్తి చూపుతారు. ఎందుకంటే, ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు తప్పనిసరి. శుభకార్యాల్లో మహిళలు బంగారు ఆభరణాలు ధరించి సంతోష పడతారు.

పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారం ధరలు గణనీయంగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పెళ్లి సీజన్‌లో బంగారం ధరలు కొంతమేర పెరగడం సర్వసాధారణం, కానీ ఇంత భారీగా పెరగడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,020 గా ఉంది. పెళ్లి సీజన్ ముగిసిన తర్వాత బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని, అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల కారణంగా ధరలు తగ్గవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు.

గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ, పెరుగుతూ ఉన్నప్పటికీ, నేడు తగ్గడంతో మహిళలు బంగారం షాపులకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. 24 క్యారెట్ల బంగారం ధర రూ.930 తగ్గి రూ.98,020 గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గి రూ.90,700గా ఉంది. కిలో వెండి ధర రూ.1,18,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, వరంగల్‌లో బంగారం, వెండి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి

22 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్ ( Hyderabad ) – రూ.89,850

విజయవాడ ( Vijayawada) – రూ.89,850

విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ.89,850

వరంగల్ ( warangal ) – రూ.89,850

24 క్యారెట్లు బంగారం ధర

విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ.98,020

వరంగల్ ( warangal ) – రూ.98,020

హైదరాబాద్ ( Hyderabad ) – రూ.98,020

విజయవాడ – రూ.98,020

వెండి ధరలు

గత కొన్ని రోజులుగా వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర మార్కెట్లో రూ.1,06,000 వద్ద ఉండగా.. మరో రూ.11,900 కు పెరిగింది. ప్రస్తుతం, కిలో వెండి రూ.1,17,900 గా ఉంది. ఒక్కో రోజు ఈ ధరలు తగ్గుతున్నాయి, మళ్లీ అకస్మాత్తుగా ధరలు వేగంగా పెరుగుతున్నాయి.

విజయవాడ – రూ.1,17,900

విశాఖపట్టణం – రూ.1,17,900

హైదరాబాద్ – రూ.1,17,900

వరంగల్ – రూ.1,17,900

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Panchayat Elections: మూడో దశ పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం.. ఉత్కంఠగా మారిన దేవరకొండ రెవెన్యూ డివిజన్ ఓట్లు

Gurram Paapi Reddy: సినిమాను హిట్ చేయండి.. మంచి భోజనం పెడతా! ఈ మాటంది ఎవరంటే?

GHMC Delimitation: గూగుల్ మ్యాప్స్ ఆధారంగా పునర్విభజన.. తలసాని విమర్శనాస్త్రాలు

Corporator Shashikala: నా వార్డును పునర్విభజించే హక్కు మీకెవరిచ్చారు?: కార్పొరేటర్ శశికళ

IPL Auction 2026: అన్‌సోల్డ్ ప్లేయర్‌‌ని రూ.13 కోట్లకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఎవరంటే?