Jogulamba Gadwal Crime: జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన లైసెన్స్ సర్వేయర్ తేజేశ్వర్ (32) హత్య కేసు మిస్టరీ వీడింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించిన భార్య ఐశ్వర్య, ఆమె ప్రియుడు వీ తిరుమల రావుతో (Tirumala Rao) పాటు మరో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్య కేసులో రూ.2 లక్షల సుపారీ ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ టీ శ్రీనివాస్ రావు (T Srinivas Rao) వెల్లడించారు.
హత్యకు కుట్ర..
గద్వాల (Gadwal) పట్టణం గంట వీధికి చెందిన తేజేశ్వర్, కర్నూల్ జిల్లా (Kurnool District) కల్లూరుకు చెందిన సుజాత కుమార్తె ఐశ్వర్యతో 2024 డిసెంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నాడు. 2025 మే 18న బీచుపల్లిలో వీరి వివాహం జరిగింది. అయితే, ఐశ్వర్య తల్లి సుజాత (Sujatha) (Kurnool )కర్నూల్‌లోని కన్ఫిమ్ హోమ్ లోన్ లిమిటెడ్ బ్యాంక్‌లో స్వీపర్‌గా, తిరుమల రావు (Tirumala Rao) మేనేజర్‌గా పనిచేస్తూ (ishwarya) ఐశ్వర్యతో అక్రమ సంబంధం కొనసాగించారు. తేజేశ్వర్‌ను అడ్డు తొలగించేందుకు ఐశ్వర్య, తిరుమల రావు కలిసి హత్యకు పథకం వేశారు.
Also Read: Medical Reimbursement Bills: ప్రభుత్వ ఉద్యోగుల..పెన్షనర్లకు గుడ్ న్యూస్!
హత్య ప్రణాళిక..
జూన్ 17న కర్నూల్‌కు చెందిన కుమ్మరి నాగేశ్, చాకలి పరుషరాముడు, చాకలి రాజు అనే నిందితులు తేజేశ్వర్‌ను వ్యవసాయ భూములు చూపిస్తామని కారులో ఎక్కించుకున్నారు. గద్వాలలోని కిష్టారెడ్డి బంగ్లాల నుంచి ఎర్రవల్లి చౌరస్తా వరకు వెళ్లి, తిరిగి వస్తుండగా దారిలో పరుషరాముడు కొడవలితో దాడి చేసి తేజేశ్వర్ గొంతు కోశాడు. చాకలి రాజు తల, చేతులను నరికి, నాగేశ్ (Nagesh) కత్తితో పొడిచి మృతి నిర్ధారించారు. మృతదేహాన్ని కర్నూల్ జిల్లా పాణ్యం సమీపంలోని గాలేరు నగరి కాలువ వద్ద పడేశారు.
పోలీసుల దర్యాప్తు..
జూన్ 17న తేజేశ్వర్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గద్వాల (Gadwal) టౌన్ పోలీస్ (Police) స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జూన్ 21న పాణ్యం వద్ద మృతదేహం లభించిన తర్వాత, గద్వాల (Gadwal) పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. ఐశ్వర్య, సుజాతల ఫోన్ కాల్ డేటా పరిశీలించి, తిరుమల రావు, నాగేశ్, పరుషరాముడు, రాజు, మోహన్, తిరుపతయ్యలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఒక కారు, రెండు కొడవళ్లు, ఒక కత్తి, రూ.1.2 లక్షల నగదు, 10 మొబైల్ ఫోన్‌లు, జీపీఎస్ ట్రాకర్ స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా ఎస్పీ ప్రశంస..
ఈ కేసును అతి తక్కువ సమయంలో ఛేదించిన గద్వాల పట్టణ ఎస్సై కల్యాణ్ కుమార్, రూరల్ ఎస్సై శ్రీకాంత్, ధరూర్ ఎస్సై కొండా శ్రీ హరి, మల్దకల్ ఎస్సై నందికర్, గట్టు ఎస్సై మల్లేశ్, ఐటీ సెల్ ఎస్సై షుకూర్, పీఎస్ఐలు స్వాతి, తేజేశ్విని, సిబ్బంది చంద్రయ్య, రాజు యాదవ్, రామకృష్ణ, కిరణ్ కుమార్, వీరేశ్, రవి కుమార్, కార్తీక్‌లను జిల్లా ఎస్పీ టీ శ్రీనివాస్ రావు (T Srinivas Rao) నగదు బహుమతితో సత్కరించారు.
Also Read: Star Actress: నా లైఫ్‌లో అతిపెద్ద నమ్మకద్రోహం అదే.. లవరే కాలయముడు అయ్యాడు.. స్టార్ నటి!