White House: ట్రంప్ ప్రపంచాన్ని రక్షించారు.. వైట్ హౌస్!
White House (Image Source: Twitter)
అంతర్జాతీయం, లేటెస్ట్ న్యూస్

White House: ట్రంప్ ప్రపంచాన్ని రక్షించారు.. ఆయన శాంతికాముకుడు.. వైట్ హౌస్!

White House: ఇరాన్ లోని అతి ముఖ్యమైన అణు స్థావరాలపై అగ్రరాజ్యం అమెరికా గత శనివారం విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. ప్రపంచాన్ని ముప్పుగా పరిణమించే అణ్వయుధ (Nuclear Weapon) తయారీకి ఇరాన్ కొద్దివారాల దూరంలోనే నిలిచిందని శ్వేద సౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే వారి అణ్వాయుధ తయారీ సామర్థ్యాన్ని తుడిచిపెట్టడం కోసం అమెరికా దాడులు చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆమె పేర్కొన్నారు.

ట్రంప్ శాంతినే కోరుకుంటారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు బి-2 స్టెల్త్ బాంబర్లను (B-2 stealth bombers) ప్రయోగించాని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పష్టం చేశారు. ఇరాన్ లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ లతో సహా కీలకమైన అణు స్థావరాలపై బాంబులతో దాడి చేసినట్లు తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ (President Donald Trump) ఎల్లప్పుడు శాంతినే కోరుకుంటారని ఆమె పేర్కొన్నారు. తమ వద్ద ఉన్న నిఘా సమాచారం ప్రకారం.. ఇరాన్ పై జరిపిన దాడులు విజయవంతమయ్యాయని వివరించారు. గత కొన్ని రోజులుగా ఇరాన్ పై దాడి గురించి ట్రంప్ చేస్తూ వస్తున్న వ్యాఖ్యలకు కరోలిన్ లీవిట్ (Karoline Leavitt) తాజా స్టేట్ మెంట్స్ బలాన్ని చేకూర్చాయి.

యురేనియంను ఇరాన్ తరలించలేదు
అయితే ఇరాన్ తన అణు స్థావరాల నుంచి యురేనియంను తరలించిందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీనిపై కూడా తాజా ప్రెస్ మీట్ లో కరోలిన్ లీవిట్ స్పందించారు. యురేనియంను ఇరాన్ తరలించలేదని ధ్రువీకరించారు. అంతకుముందు బుధవారం నెదర్లాండ్స్ లోని హేగ్ నగరంలో జరిగిన నాటో శిఖరాగ్ర సదస్సులో ట్రంప్ ఇదే అంశంపై మాట్లాడారు. ఇరాన్ అణు స్థావరాల్లో భూమిలోపల చాలా లోతులో ఉన్నందున యురేనియంను తరలించలేకపోయిందని చెప్పారు. అణుశక్తిని తరలించడంలో ఆ దేశం విఫలమైందని పేర్కొన్నారు. తమ బీ-2 బాంబర్లు ఇరాన్ అణు కేంద్రాలను తీవ్రంగా ధ్వంసం చేశాయని పునరుద్ఘటించారు.

Also Read: BJP Telangana: జూబ్లీహిల్స్‌పై బీజేపీ ఫోకస్.. సరైన అభ్యర్థి కోసం మల్లాగుల్లాలు.. ఆశలు నెరవేరేనా?

అమెరికా అణు చర్చలు జరపబోం: ఇరాన్
అమెరికా దాడుల నేపథ్యంలో ఆ దేశంతో అణు చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అగార్జీ (Abbas Araghchi) అన్నారు. త్వరలో ఇరాన్ తో అణు చర్చలు జరగనున్నాయని ట్రంప్ చేసిన కామెంట్స్ ను ఆయన ఖండించారు. ఇటీవర తమపై జరిగిన దాడులు గణనీయమైన నష్టాన్ని కలిగించాయని, ఇరాన్ అణు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించేందుకు అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. నాటో సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ అణు చర్చలకు ఇరాన్ ముందుకు వస్తే ఆ దేశంపై అమెరికా విధించిన ఆంక్షలను సడలిస్తామన్న సంకేతాలను ట్రంప్ ఇచ్చారు.

Also Read This: Telangana Government: సర్కార్ కీలక నిర్ణయం పరిపాలనలో మరింత పారదర్శకత!

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..