Himachal Pradesh's Kullu (Image Source: Twitter)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Himachal Pradesh’s Kullu: హిమాచల్‌లో అకస్మిక వరదలు.. సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి!

Himachal Pradesh’s Kullu: హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లోని కుల్లూ (Kullu Region)జిల్లాలో క్లౌడ్ బరస్ట్ (Cloudburst) కారణంగా అకస్మిక వరదలు (Floods) సంభవించిన సంగతి తెలిసిందే. నదులు, వాగుల్లో నీటి ప్రవాహం అకస్మాత్తుగా పెరిగి.. పలువురు కొట్టుకుపోయారు. ముఖ్యంగా సైంజ్ వ్యాలీలోని జీవా నాలా ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ సంభవించడంతో జీవా నదిలో ఒక్కసారిగా నీటిమట్టం పెరిగిపోయింది. ఘటనకు సంబంధించిన విషయాలను స్థానికులు పంచుకున్నారు. వరదల కారణంగా కళ్లముందే ముగ్గురు వ్యక్తులు, నాలుగు ఇళ్లు కొట్టుకుపోయినట్లు పేర్కొన్నారు.

క్లౌడ్ బరస్ట్ జరిగిన తీరు గురించి స్థానిక వ్యక్తి అన్మోల్ (Anmol) మీడియాతో మాట్లాడారు. ‘కొట్టుకు పోయిన నాలుగు ఇళ్లల్లో ఒక ఇంటి వెనక జలపాతం ఉంది. దానిపైన క్లౌడ్ బరస్ట్ జరిగింది. దీంతో ప్రవాహం పెరిగి ముగ్గురు వ్యక్తులు, నాలుగు ఇళ్లు కొట్టుకుపోయాయి’ అని చెప్పారు. అంతేకాదు నీటి ప్రవాహం మరింత పెరిగి సమీపంలోని నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC) ప్రాజెక్ట్ ను ముంచేసిందని చెప్పారు. దీంతో NHPC పూర్తిగా మూసివేశారని అన్నారు. మరోవైపు కొట్టుకుపోయిన వారిలో ఇద్దరు వ్యక్తులను ధర్మశాల సమీపంలోని ఖన్యారా ప్రాంతంలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వారు విద్యుత్ ప్రాజెక్ట్ లో పనిచేసే కార్మికులని పేర్కొన్నారు. అకస్మిక వరదలతో NHPC భారీగా దెబ్బతిన్నట్లు వివరించారు.

Also Read: Tirumala Gaming App: తిరుమలపై గేమింగ్ యాప్.. రంగంలోకి టీటీడీ.. కఠిన చర్యలకు ఆదేశం!

అకస్మిక వరదల నేపథ్యంలో కొనసాగిస్తున్న సహాయక చర్యల గురించి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) ఇన్స్పెక్టర్ దీపక్ బిష్ట్ మాట్లాడారు. ‘మా బృందం ఘటనా స్థలికి చేరుకుంది. మా బృందాల్లో ఒకటి ఘటన జరిగిన ప్రాంతంలో మోహరించింది. గల్లంతైన వ్యక్తుల ఆచూకి తెలిస్తే వెంటనే తెలియపరుస్తాం’ అని బిష్ట్ చెప్పుకొచ్చారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే సురీందర్ షౌరీ సైతం క్లౌడ్ బరస్ట్ పరిస్థితులపై స్పందించారు. సైంజ్, తీర్థన్, గడ్సా ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు నష్టం వాటిల్లినట్లు చెప్పారు. నదులు, కాలువలకు ప్రజలు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. విపత్తులో సమస్యలో ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

Also Read This: Actress disorder: నాకు ఆ వ్యాధి ఉంది.. బెడ్‌పై వెక్కి వెక్కి ఏడ్చా.. స్టార్ నటి ఆవేదన!

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?