Actress disorder (Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్, లేటెస్ట్ న్యూస్

Actress disorder: నాకు ఆ వ్యాధి ఉంది.. బెడ్‌పై వెక్కి వెక్కి ఏడ్చా.. స్టార్ నటి ఆవేదన!

Actress disorder: బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ (Fatima Sana Shaikh).. దంగల్ సినిమా సక్సెస్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె నటించిన లేటెస్ట్ చిత్రం ‘మెట్రో ఇన్ దినో’ (Metro In Dino).. విడుదలకు సిద్ధమైంది. జులై 4న ఈ చిత్రం రిలీజ్ కానుండటంతో.. వరుసగా ప్రస్తుతం ఆమె వరుసగా మూవీ ప్రమోషన్స్ చేస్తోంది. ఈ క్రమంలో నిర్వహించిన ఓ ఇంటర్వూలో ఫాతిమా సనా మాట్లాడుతూ తనకున్న అరుదైన వ్యాధి గురించి పంచుకున్నారు. అంతేకాదు దానివల్ల తన జీవితంలో జరిగిన ఓ భయంకరమైన ఘటనను కూడా  షేర్ చేసకున్నారు.

అదో భయంకరమైన ఘటన
‘మెట్రో ఇన్ డినో’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ‘హ్యుమన్స్ ఆఫ్ బాంబే’  అనే యూట్యూబ్ ఛానెల్ కు ఫాతిమా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తనకు మూర్చ వ్యాధి (Epilepsy) ఉందన్న కఠిన వాస్తవాన్ని ఆమె తెలియజేశారు. అంతేకాదు దుబాయ్ మీదుగా అమెరికాకు పయనమైన సందర్భంలో తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని భయంకరమైన ఘటన జరిగినట్లు ఆమె తెలిపారు. విమానంలో కూర్చొని ఉండగా తనకు పలుమార్లు మూర్చ వచ్చిందని నటి తెలిపారు. దీంతో తనను విమానశ్రయంలోని ఆసుపత్రికి తరలించారని.. ఎక్కువ డోస్ ఉన్న మందులు ఇచ్చారని చెప్పారు. అయినప్పటికీ మూర్చ రావడం తగ్గలేదని తెలియజేశారు.

Fathima Sana Sheikh (Image Source Instagram)
Fathima Sana Sheikh (Image Source Instagram)

షూటింగ్స్ రద్దు చేసుకున్నా
విమానంలో మూర్చ వచ్చిన సమయంలో తాను రెండు సినిమాలకు వర్క్ చేస్తున్నట్లు ఫాతిమా ఇంటర్వ్యూలో తెలిపారు. అనారోగ్యం కారణంగా రెండు షూటింగ్స్ ను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని వాపోయారు. షూటింగ్ సెట్ నుంచి కాల్స్ వచ్చినప్పుడు మంచం నుంచి దిగలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. మంచం మీదనే ఎంతోగానో ఏడ్చినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఇదే తన వాస్తవిక జీవితమని ఫాతిమా అన్నారు. తనకున్న సమస్యను తాను అంగీకరించానని.. ప్రజలు కూడా దీని గురించి తెలుసుకోవాలని అన్నారు. మూర్చ వ్యాధితో బాధపడేవారికి ఇతరులు సహాయం చేయాలని సూచించారు.

Also Read: Singer Pravasthi: మరో సంచలన వీడియో రిలీజ్ చేసిన సింగర్ ప్రవస్తి.. జనాలను ఫూల్స్ చేయడమే టార్గెట్?

వారి జీవితాలు హృదయ విదారకం
ఈ దేశంలో చాలా మంది పిల్లలు మూర్చ వ్యాధితో బాధపడుతున్నట్లు ఇంటర్వ్యూలో ఫాతిమా సనా అన్నారు. వారు ఒక రోజులో ఎన్నోసార్లు మూర్చపోతుంటారని చెప్పారు. సరైన ఔషదాలు కూడా అందుబాటులో ఉండని వారి జీవితాలు.. హృదయ విదారకమని ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి పిల్లలకు విద్య వ్యవస్థలో ప్రత్యేకంగా ఎలాంటి సౌఖర్యాలు, ప్రోత్సహకాలు కూడా లభించవని అన్నారు. ఇదిలా ఉంటే ఫాతిమా తాజా చిత్రం.. మెట్రో ఇన్ దినో (Metro In Dino) చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహించారు. ఆదిత్య రాయ్ కపూర్, సారా అలీ ఖాన్, అలీ ఫజల్, అనుపమ్ ఖేర్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలు పోషించారు.

Also Read This: Rs 4 Cr Donation to Temple: కుమార్తెల చేతిలో ఘోర అవమానం.. ఆ తండ్రి ఏం చేశాడో తెలిస్తే షాకే!

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?