Lakshmi Narasimha Swamy Temple( image credit: swetcha reporter)
తెలంగాణ

Lakshmi Narasimha Swamy Temple: మహిమాన్విత క్షేత్రం.. హేమాచల మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం!

Lakshmi Narasimha Swamy Temple: హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయం మహిమాన్విత క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. తెలంగాణ రాష్ట్రంలో హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం (Lakshmi Narasimha Swamy Temple) నవ నరసింహ క్షేత్రాలలో ఒకటి దిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్వామివారి విగ్రహం రుదువైన మానవ శరీరాన్ని పోలి ఉంటుంది. ఛాతిపై వెంట్రుకలు కూడా ఉంటాయని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయానికి సుమారు 4776 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని ఆలయ అర్చకులు చెబుతారు.

ఈ మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి (Lakshmi Narasimha Swamy Temple)  కొండకు అగస్త్య మహర్షి హేమాచలం అని కూడా పేరు పెట్టారని నానుడి. శ్రీ ఉగ్ర నరసింహ స్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందిన మల్లూరు భద్రాచలం దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ శ్రీ రామ మందిరం నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే మహానగరం వరంగల్ నుండి 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మొల్ల విరాట్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి (Lakshmi Narasimha Swamy ) విగ్రహం ఎత్తు పది అడుగులు ఉంటుంది. ఇది నట్టఅడవిలో ఉంటుంది. మూల విరాట్ విగ్రహం యొక్క బెల్లీ భాగంలో శని, ఆదివారాల్లో ముట్టుకుంటే మానవ శరీరం లాగే మృదువుగా ఉంటుంది. ఈ ఆలయ ధ్వజస్తంభం దాదాపు 60 అడుగుల ఎత్తులో ఉంటుంది.

 Also Read: Chief Engineer Harassment: మహిళా ఉద్యోగులకు చీఫ్ ఇంజనీర్ లైంగిక వేధింపులు.. సీతక్కవద్ధకు ఇష్యూ!

ఆలయానికి సమీపంలో రాతితో కూడిన ఉగ్ర ఆంజనేయ స్వామి విగ్రహం సైతం ఉంటుంది. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఎత్తయిన గుట్టల నడుమ నుండి సొరంగాల నుంచి నీటి ప్రవాహం ఏడాది పొడవున వస్తుంటుంది. 2003 గోదారి పుష్కర సమయంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామ శివారుణ ఉండే హేమాచల కొండపై లక్ష్మీనరసింహస్వామి(Lakshmi Narasimha Swamy ) స్వయంగా వెలిశారు. ఎత్తయిన కొండలపై నుంచి వచ్చే నీటిని చింతామణి జలపాతం అని పిలుస్తారు. ఈ నీరు అచ్చం కొబ్బరి నీరు లాగే ఉంటుందనేది భక్తులు చెబుతున్న నిజం. ఇక్కడ భక్తులు స్నానాలు చేస్తే శుభాలు కలుగుతాయని నానుడి ఉంది. ఈ జలధర విశేషమైన ఔషధ గుణాలు కలిగి ఉందని, ఈ పానీయాన్ని సేవిస్తే సమస్త రోగాలు మటు మాయమవుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఈ జలపాతానికి అతి సమీపంలోనే మరో చిన్ని జలపాతం ఉంటుంది.

హేమాచల నరసింహస్వామి క్షేత్రంలో ఇతర దేవత మందిరాలు
హేమాచల లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో (Lakshmi Narasimha Swamy Temple) ఇతర దేవతల మందిరాలు కూడా ఉన్నాయి. ఈ దివ్యాలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి, నవగ్రహ మండపం, మహాలక్ష్మి, గోదాదేవి మందిరాలు భక్తులకు దర్శనం ఇస్తాయి. ఆ దివ్య సందర్శన పూర్వ జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. ఈ మహిమాన్విత హేమాచల క్షేత్రాన్ని కాకతీయ రాణి రుద్రమదేవి సందర్శించి ఇక్కడ ఉన్న జలపాతానికి చింతామణి అని నామకరణం చేసినట్లుగా పూర్వీకులు చెబుతుంటారు. ఓరుగల్లు రాజధానిగా పరిపాలనను సాధించిన కాకతీయ రాజుల ఏలుబడిలోనే ఈ హేమాచల క్షేత్ర ప్రాంతం ఉన్నదని అర్చకులు చెబుతున్నారు. బుట్ట శిఖరంపై కాకతీయ రాజులు.. కోనేరు, అర్ధమండపం, గుర్రపు శాలలు, రాక్షస గుహలు నిర్మించి శత్రు రాజ్యాలతో యుద్ధం చేయడానికి ఇక్కడ విహరచనలు చేసేవారని చెబుతుంటారు.

 Also Read: Bonalu Festival 2025: నేటి నుంచి బోనాలు ప్రారంభం.. పకడ్బందీగా నిధుల కేటాయింపు!

ప్రధాన దైవం
హేమాచల లక్ష్మీనరసింహస్వామి (Lakshmi Narasimha Swamy ) కొండపై ప్రధాన ధైవంగా లక్ష్మీనరసింహస్వామి (Lakshmi Narasimha Swamy ) కొలువయ్యారు. క్షేత్రపాలకుడిగా పంచముఖ ఆంజనేయ స్వామి కొలువయ్యారు. క్షేత్రపాలకుడిగా శిఖాంజనేయ స్వామి నెరిసి ఉన్నారు. ఆలయానికి పశ్చిమ భాగంలో వేణుగోపాల స్వామి ఆలయం ఉంటుంది. ఆలయానికి తూర్పు భాగంలో కోనేరు ఉంటుంది. ఇక్కడ భక్తులు స్నానమాచరించి లక్ష్మీనరసింహస్వామిని (Lakshmi Narasimha Swamy ) దర్శించుకుంటారు. దక్షిణాదిన నారా నరసింహ క్షేత్రాలు కొలువై ఉన్నాయని పూర్వీకులు చెప్తున్నారు.

కొండపై నిలువైన దశావతారాలు
1.మచ్చ అవతారం, 2.కూర్మ అవతారం, 3.వరాహ అవతారం, 4.నరసింహ స్వామి అవతారం, 5.వామన అవతారం, 6.పరశురామ అవతారం, 7.శ్రీరాముని అవతారం, 8.శ్రీకృష్ణుని అవతారం, 9.బుద్ధుని అవతారం, 10.కల్కి అవతారంలు లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ ప్రాంగణానికి నలువైపుల దశావతారాలు వెలసి ఉన్నాయి

 Also Read: Formula E Race Case: ఫార్ములా ఈ కార్​ రేస్ కేసులో ఏసీబీ స్పీడ్!

Just In

01

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు

Pushpa 3: ‘పుష్ప 3’ ప్రకటించిన సుక్కు.. ఈసారి ర్యాంపేజే!

Viral Fevers: కేజిబీవీలలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. ఆలస్యంగా వెలుగులోకి?

KCR KTR Harish Meet: ఎర్రవెల్లిలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సుధీర్ఘ చర్చలు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?

Ganesh Immersion 2025: పాతబస్తీ గణనాధులపై స్పెషల్ ఫోకస్.. మంత్రి పొన్నం, డీజీపీ, మేయర్ విజయలక్ష్మి ఏరియల్ సర్వే