Honeymoon Murder Case (Image Source: Twitter)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Honeymoon Murder Case: అవును నా భర్తను చంపా.. ప్రియుడితో రిలేషన్ నిజమే.. ఓపెన్ అయిన సోనమ్!

Honeymoon Murder Case: యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన భర్త రాజా రఘువంశీని హత్య చేసినట్లు భార్య సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వారా అంగీకరించినట్లు పోలీసులు ప్రకటించారు. హత్యలో తమ ప్రమేయాన్ని నిందితులు సోనమ్, రాజ్ కుష్వాహా ఇద్దరూ ధ్రువీకరించినట్లు తూర్పు ఖాసీ హిల్స్ పోలీసు సూపరిండెంట్ వివేక్ సయీమ్ స్పష్టం చేశారు. ప్రియుడు రాజ్ కుష్వాహాని పెళ్లి చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సోనమ్ ను ఆమె కుటుంబం బెదిరించినట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత ప్రియుడితో కలిసి ఆమె తన భర్తను హత్య చేసిందని పేర్కొన్నారు.

అన్ని ఆధారాలు లభించాయి
బుధవారం మీడియాతో మాట్లాడిన ఈస్ట్ ఖాసీ హిల్స్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వివేక్ సయీమ్.. హనీమూన్ మర్డర్ కేసుకు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు. విచారణ సమయంలో సోనమ్, రాజ్ ఇద్దరూ తమ మధ్య సంబంధం ఉందని ఒప్పుకున్నారని పేర్కొన్నారు. వారి ఇద్దరు నేరాన్ని అంగీకరించారని.. క్రైమ్ జరిగిన తీరును సైతం పునఃసమీక్షించినట్లు (క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్) చెప్పారు. రాజా రఘువంశీని హత్య చేసిన ప్రదేశం, చంపిన తీరు అంతా చూపించారని స్పష్టం చేశారు. హత్యకు సంబంధించి తగిన ఆధారాలు సైతం తమకు లభించాయని వివేక్ సయీమ్ అన్నారు.

నార్కో టెస్ట్ అవసరం లేదు
మృతుడు రాజా రఘువంశీ కుటుంబం.. సోనమ్ కు నార్కో అనాలసిస్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేసినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వివేక్ సయీమ్ తెలిపారు. అయితే నార్కోటిక్ టెస్ట్ అవసరం లేదని చెప్పారు. సాధారణంగా ఎలాంటి ఆధారాలు లభించని సమయంలో ఈ టెస్ట్ నిర్వహిస్తారని పేర్కొన్నారు. పైగా నార్కో టెస్ట్ సుప్రీంకోర్టు ధర్మాసనం నిషేధించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. రాజా రఘువంశీ డబ్బు కోసమే ఈ హత్య జరిగిందన్న విషయాన్ని పోలీసు అధికారి ధ్రువీకరించలేదు. తమ ప్రేమకు అడ్డుగా ఉన్నాడన్న కారణంతోనే రాజా రఘవంశీని హత్య చేశారని అధికారి తెలిపారు.

Also Read: Tamannaah – Vijay Varma: తమన్నాకి బిగ్ షాక్ ఇస్తూ.. విజయ్ వర్మ కొత్త లవర్‌ను సెట్ చేసుకున్నాడుగా?

అసలేం జరిగిందంటే?
హనీమూన్ కేసు విషయానికి వస్తే.. రాజా రఘువంశీ, సోనమ్ కు మధ్య మే 11న వివాహం జరిగింది. 20న వారు హనీమూన్‌ కోసం మేఘాలయకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ కనిపించకుండా పోవడంతో అక్కడి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో పోలీసులు గుర్తించారు. అనంతరం సోనమ్‌ కోసం గాలించగా.. ఉన్నట్టుండి ఆమె గాజీపుర్‌లో ప్రత్యక్షమైంది. ప్రియుడితో కలిసి ఆమె భర్తను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో ఆమెతో పాటు హత్యకు సహకరించిన మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

Also Read This: Shubhanshu Shukla: ఇస్రో మరో మైలురాయి. రోదసిలోకి దూసుకెళ్లిన శుభాంశు శుక్లా.. ఈ విషయాలు తెలుసా!

Just In

01

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు

Naresh65: కామెడీ గోస్ కాస్మిక్.. అల్లరి నరేష్ 65వ చిత్ర వివరాలివే..!

Drug Factory Busted:చర్లపల్లిలో డ్రగ్ తయారీ ఫ్యాక్టరీపై దాడి.. వేల కోట్ల రూపాయల మాదకద్రవ్యాలు సీజ్

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది