Tamannaah - Vijay Varma (Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్, లేటెస్ట్ న్యూస్

Tamannaah – Vijay Varma: తమన్నాకి బిగ్ షాక్ ఇస్తూ.. విజయ్ వర్మ కొత్త లవర్‌ను సెట్ చేసుకున్నాడుగా?

Tamannaah – Vijay Varma: బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ (Vijay Varma)తో స్టార్ నటి తమన్న ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. సౌత్ లో స్టార్ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకున్న తమన్నాతో డేటింగ్ చేయడం ద్వారా.. నటుడు విజయ్ దక్షిణాది పరిశ్రమలో బాగా పాపులర్ అయ్యారు. తమన్నతో డేటింగ్ కు ముందు అతడి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఆమెతో రిలేషన్ లో ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు రావడంతో బాలీవుడ్ (Bollywood) తో పాటు సౌత్ మీడియాలోనూ విజయ్ వర్మకు అటెన్షన్ వచ్చింది. అయితే 2, 3 ఏళ్ల రిలేషన్ తర్వాత తమన్నా – విజయ్ వర్మ జంట విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయన మరో హీరోయిన్ తో ప్రేమలు పడినట్లు బీ టౌన్  లో చర్చ జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

బాలీవుడ్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ (Fatima Sana Shaikh)తో.. విజయ్ వర్మ డేటింగ్ ఉన్నట్లు ఒక్కసారిగా పుకార్లు మెుదలయ్యాయి. దంగల్ మూవీతో ఫాతిమా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం వారిద్దరు పీకల్లోతూ ప్రేమలో ఉన్నారన్న వార్తలు బాలీవుడ్ లో గట్టిగానే వినిపిస్తున్నాయి. విజయ్ – ఫాతిమా ఇటీవల ఓ కేఫ్ లో జంటగా కనిపించి అనుమానాలకు తావిచ్చారు. ప్రస్తుతం వీరిద్దరు ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తున్నారన్న రూమర్లు సైతం నెట్టింట వినిపిస్తున్నాయి. దీనిపై విజయ్ – ఫాతిమా జంట క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Fatima Sana Shaikh (Image Source: Twitter)
Fatima Sana Shaikh (Image Source: Twitter)

Also Read: Akhil Akkineni: అఖిల్ కి అలాంటి గండం ఉందా.. లెనిన్ నుంచి మళ్లీ హీరోయిన్ ఔట్?

మరోవైపు విజయ్-ఫాతిమా ప్రస్తుతం జంటగా ‘గుస్తాఖ్ ఇష్క్’ (Gustakh Ishq) అనే మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేశారు. రొమాంటిక్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతున్న పోస్టర్ ను బట్టి తెలుస్తోంది. మరోవైపు ఇటీవల ఓ ఇంటర్వూలో మాట్లాడిన ఫాతిమా.. నటుడు విజయ్ వర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘విజయ్ ఒక మంచి నటుడు. అద్భుతమైన వ్యక్తి. ప్రతిభతో ముందుకు సాగుతాడు. కొంత సమయం తీసుకున్నప్పటికీ అలాంటి వారు తాము అనుకున్న స్థాయికి చేరుకుంటారు’ అని ఫాతిమా చెప్పుకొచ్చింది.

Also Read This: Shubhanshu Shukla: ఇస్రో మరో మైలురాయి. రోదసిలోకి దూసుకెళ్లిన శుభాంశు శుక్లా.. ఈ విషయాలు తెలుసా!

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది